ఆపిల్ దాన్ని ఇంత సీక్రెట్‌గా దాచిందా...?
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సీక్రెట్ ప్రాజెక్ట్ తో దూసుకువస్తోంది.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సీక్రెట్ ప్రాజెక్ట్ తో దూసుకువస్తోంది. గత కొద్ది కాలం నుంచి ఆపిల్ తన సెల్ఫ్ డ్రైవింగ్ కారును పరీక్షిస్తోందని వార్తలు హల్ చేస్తున్నాయి. ఆ వార్తను నిజం చేస్తూ శాన్‌ఫ్రానిస్కో రోడ్లపై దూసుకుపోతున్న ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు వీడియోకు చిక్కింది.
ఈ ఫోన్ ధరెంతో తెలిస్తే గుండె ఆగిపోద్ది..

తెలుపు రంగు లెక్సస్ ఆర్ఎస్ 450 హెచ్ ఎస్‌యూవీ ఆ వీడియోలో ప్రయాణిస్తూ కనిపించింది. అందులో స్వతంత్రంగా పనిచేసే కంప్యూటర్ పరికరాలు అమర్చబడి ఉన్నాయి. కారులో ఉన్న ఆపిల్ ఉద్యోగి కారు పనితీరును పర్యవేక్షిస్తూ కనిపించారు.
మార్కెట్‌ను షేక్ చేసేందుకు కొత్త మొబైల్ రెడీ..

తాజాగా ఆపిల్ పరీక్షిస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్లా, గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్ట్ 'వేమో'కు గట్టి పోటీ కానుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..


Click it and Unblock the Notifications








