ఆపిల్‌లో లోపాన్ని కనుక్కుంటే రూ. కోటి 30 లక్షలు

Written By:

టెక్నాలజీ రంగంలో దూసుకుపోతుేన్న ఆపిల్ తమ సాప్ట్‌వేర్ అప్లికేషన్లలో తలదూర్చేవారికి బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఆపిల్‌ సాఫ్ట్‌వేర్‌లో భద్రతాపరమైన లోపాలను గుర్తించి, తెలియజేసినందుకు హ్యాకర్లకు 2లక్షల డాలర్ల(కోటి 33 లక్షలకు పైగా) వరకు రివార్డును ఆఫర్ చేయనున్నట్టు ఆపిల్ ఇంక్ ప్రకటించింది. లాస్ వెగాస్‌లోని కంప్యూటర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రొగ్రామ్‌లో ఆపిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రారంభంలో లిమిటెడ్ రీసెర్చర్లకు ఈ రివార్డులను అందిస్తామని, ఈ ప్రొగ్రామ్‌ను మెల్లమెల్లగా విస్తరిస్తామని ఆపిల్ తెలిపింది.

ఆపిల్ కొత్త ఫీచర్ల ఫోన్ ఇప్పట్లో లేనట్లే.. వస్తే షాకేనట

ఆపిల్‌లో లోపాన్ని కనుక్కుంటే రూ. కోటి 30 లక్షలు

కంపెనీ సాప్ట్‌వేర్‌లో భద్రతను సీరియస్‌గా తీసుకున్న ఆపిల్, సమస్యను గుర్తించిన వారు ఆ సమాచారాన్ని ఇతరులకు విక్రయించకుండా డైరెక్టుగా కంపెనీకే అందించేలా హ్యాకర్లకు రివార్డులను అందించాలని ఆపిల్ నిర్ణయించింది. కంప్యూటర్ కోడ్‌ల్లో లోపాలు గుర్తించిన వారిని టెక్ దిగ్గజాలు "బగ్ బౌన్‌టీస్"గా పిలుస్తారు. గూగుల్, ఫేస్‌‌బుక్ వంటి ఇతర కంపెనీలు తమ సాప్ట్‌వేర్‌లో లోపాలను గుర్తించి, కంపెనీకి తెలియజేసినందుకు హ్యాకర్లకు ఎప్పటినుంచో రివార్డులను ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆపిల్ సైతం ఈ బాటలోనే పయనించనుంది.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ ఉందని తెలుసా..ఆపిల్ ఐఫోన్‌కు సంబంధించిన కొన్ని విడిబాగాలను ఈ ఫ్యాక్టరీలో తయారుచేస్తుందని లేబర్ వాచ్ అనే సంస్థ బయటపెట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

ఈ ఫోన్లను తయారు చేసే కంపెనీలో పనెలా జరుగుతుందనేది ఐఫోన్ .. ప్రపంచంలో చాలామంది విపరీతంగా ఇష్టపడే స్మార్ట్ ఫోన్. అందరూ ఆసక్తి చూపే ఈ ఫోన్లను తయారు చేసే కంపెనీలో పనెలా జరుగుతుందనేది తెలుసుకోవడం కూడా అంతే ఆసక్తి కరంగా ఉంటుంది.

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

ఉదయం 9 కాగానే ఉన్న షాంఘై నగరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి వేలమంది ఉద్యోగులు ఇలా గులాబి చొక్కాలు ధరించి ఐ ఫోన్ తయారీకి రెడీ అవుతారు.

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

ఉద్యోగులు ఒక్కసారి కాంపౌండ్లోకి అడుగపెట్టగానే అక్కడ మెటల్ డిటెక్టర్లు, కెమెరాలు, వీడియోల్ని, ఐడీ కార్డులు, ముఖాల్ని స్కానింగ్ చేసే యంత్రాల్ని దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

ఈ వ్యవహారమంతా అత్యంత పకడ్బందీగా ఆపిల్ సంస్థ కోసం ఐఫోన్లను చైనా షాంఘైలోని పెగట్రాన్ కార్పొరేషన్ అసెంబ్లింగ్ ప్రక్రియ ద్వారా రూపొందిస్తుంది. ఈ వ్యవహారమంతా అత్యంత పకడ్బందీగా, రహస్యంగా సాగుతుంది.

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

90 ఫుట్బాల్ మైదానాలు పట్టేంత వైశాల్యంలో, 50 వేలమంది సిబ్బంది సైనిక క్రమశిక్షణను పాటిస్తూ .. పనిచేసే భారీ కర్మాగారమిది. గులాబీ రంగు జాకెట్లు, తలపై నీలిరంగు టోపీ, ప్లాస్టిక్ చెప్పులు వేసుకోవాల్సిందే.

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

ఐఫోన్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి విషయాలు బయటికి పొక్కకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అధునాతన గుర్తింపు వ్యవస్థ ఉద్యోగికి సంబంధించిన ప్రతి సెకనునూ లెక్కిస్తుందని కర్మాగారం చీఫ్ జాన్ష్యూ పేర్కొన్నారు.

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

ఇంతకాలం అత్యంత రహస్య కర్మాగారంగా పేరొందిన ఇక్కడ ఏం జరుగుతోందో బయటికి తెలిసేది కాదు. ఇటీవలి కాలంలో ఉద్యోగుల పనివేళలకు సంబంధించిన వ్యవహారాలపై ఆరోపణలు రావడంతో తొలిసారిగా పాశ్చాత్య మీడియాను లోపలికి అనుమతించారు.

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

ఇది ఆపిల్ ఫ్యాక్టరీ అని ఇక్కడ నుంచి ఐ ఫోన్ కి సంబంధించి అనేక రకాల పార్టులు తయారవుతాయని బయటి ప్రపంచానికి తెలిసింది.

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

ఇక ది గ్రేట్ అని చెప్పుకునే ఆపిల్ ఫోన్లో రకరకాల పార్టులు అనేక దేశాల్లో తయారవుతాయి. చైనా మాత్రమే కాదు జపాన్, యూకే, జర్మనీ, తైవాన్, దక్షిణ కొరియా - లాంటివన్నీ ఈ లిస్టులో ఉన్నాయి.

చైనాలో ఆపిల్ ఫ్యాక్టరీ

మొత్తం మీద ఆపిల్ కు ప్రపంచవ్యాప్తంగా 33 దేశాల్లో 60 ఫోన్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Apple To Offer Cash For Reporting Security Flaws
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot