తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

Written By:

రాత్రి పూట తెల్లగా అందాలు ఆరబోసే పాలపుంతలో నిర్మానుష్య ఎడారి ఉందట. శాస్ర్తవేత్తలు పాలపుంత మధ్య భాగంలో ఓ ఎడారిని కనుగొన్నారు. ఈ ఎడారి అంతా భారీ అగాధంతో నిండి ఉందని అక్కడ నక్షత్రాలు, గ్రహాలు, ఇతర ఖగోళ శఖలాల ఉనికి ఏమి అక్కడ లేదని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడయింది. పాలపుంతలో ఈ ఎడారి ప్రాంతం దాదాపు 8 వేల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో విస్తరించి ఉందని Monthly Notices of the Royal Astronomical Society సభ్యుల బృందమైన జపాన్, దక్షిణాఫ్రికా, ఇటలీలకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.

ఇకపై మెసెంజర్ నుంచి సీక్రెట్ మెసేజ్‌లు పంపుకోవచ్చు

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఎలాంటి నక్షత్రమూ, గ్రహమూ కొత్తగా ఏర్పడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. పాలపుంత మధ్య భాగంలో దాదాపు 150 కాంతి సంవత్సరాల వ్యాసం పరిధిలో కోటి నుంచి 30 కోట్ల సంవత్సరాల వయసున్న నక్షత్రాలు ఉన్నా... ఆ ప్రాంతం తరువాత ఈ నక్షత్ర ఎడారి ప్రాంతం విస్తరించి ఉందని సౌతాఫ్రికన్ లార్జ్ టెలిస్కోపు ద్వారా తాము జరిపిన పరిశీలనల ద్వారా ఇది స్పష్టమైందని వారు అంటున్నారు.పాలపుంత గురించి మీకు తెలియని కొన్ని నిజాలపై ఓ లుక్కేయండి.

పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

కోటాను కోట్ల నక్షత్రాలు, మనం నివసిస్తున్న భూమి ,సూర్యుడు అన్ని ఒక చోట చేరితే ఎలా ఉంటుంది. ఇక రాత్రి వేళ చూస్తే తెల్లగా దగదగలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ అందమైన ప్రపంచాన్నే పాలపుంతగా పిలుస్తారు.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

పాలపుంత అనే ప్రపంచంలో లెక్కలేనన్ని నక్షత్రాలు, దుమ్ము, వాయువులు సముదాయంగా ఉన్నాయని అతి శక్తివంతమైన టెలిస్కోపుల సాయంతో కనుగొన్నారు.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

పాలపుంత పాలరంగులో ఉండటానికి కారణం అందులో ఎన్నో నక్షత్రాలు ఉండటమే. విశ్వంలో ఇలాంటి నక్షత్ర మండలాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

టెలిస్కోపు గుండా చూస్తే, పాలపుంత మధ్య భాగం ఉబ్బెత్తుగా, చివరి అంచులు పలచగా ఒక కుంభాకార కటకం (కాన్వెక్స్‌ లెన్స్‌) రూపంలో ఉంటుంది. శాస్త్ర పరిశీలనల ద్వారా పాలపుంత సర్పిలాకారంలో ఉండి 1,50,000,000,000 నక్షత్రాలు కలిగి ఉన్నట్లు తెలిసింది.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

పాలపుంత పరిమాణాన్ని మైళ్లలో, కిలో మీటర్లలో కాకుండా, కాంతి సంవత్సరాలలో కొలుస్తారు. కాంతి సంవత్సరం అంటే సెకనుకు సుమారు 3,00,000 కిలోమీటర్ల వేగంతో కాంతి ఒక సంవత్సర కాలంలో పయనించే దూరం. అంటే 9,408,000,000,000,000 కిలోమీటర్లు.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

మన పాలపుంత వ్యాసం లక్ష కాంతి సంవత్సరాలు! సూర్యుడు పాలపుంత కేంద్రం నుంచి 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉండి పాలపుంత చుట్టూ తిరుగుతుంటాడు.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

అలా సూర్యుడు ఒక భ్రమణం తిరగడానికి పట్టే కాలం 250 మిలియన్‌ సంవత్సరాలు. ఇక పాలపుంతలో చీకటి ప్రదేశాలు ఏవంటే నక్షత్రాలు తక్కువగా ఉండి, దుమ్ము, ధూళి ఉండే ప్రాంతాలు.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

ఈ పాలపుంత ద్వారా ప్రతి యేడాదికి వెయ్యి సూర్యుళ్లు తయారవుతున్నాయట. ఒక సూర్యుడి ప్రభావానికే భూమండలంపై ఉన్న మనం హడలి పోతుంటే... 40 లక్షల కోట్ల సూర్యుళ్ల ప్రతాపానికి ఏమై పోతామో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదా..

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

అయితే దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ భయంకర పాలపుంత అవనికి 12.7 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట. ఈ విషయాలన్నీ ఖగోళ పరిశోధకులు చిలీలోని అటకామా ఎడారిలో "అల్మా" అనే రేడియో టెలిస్కోప్‌ ద్వారా కనుగొన్నారు.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

ఈ టెలిస్కోప్ ప్రపంచంలోనే అతిపెద్దది. శక్తిమంతమైనది కూడా. ఈ అల్మా రేడియో టెలిస్కోపు ఈ గుట్టుమట్లన్నీ విప్పడంతో శాస్త్రవేత్తలు వాటిని క్రోఢీకరించే పనిలో పడ్డారు.

తెల్లని పాలపుంతలో చుక్కలు లేని ఎడారి

ఈ పాలపుంత వయస్సు దాదాపు 14 వందల కోట్ల సంవత్సరాలని శాస్ర్తవేత్తలు ప్రయోగాల ద్వారా నిర్థారించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Astronomers Look Into Mystery of Young Stars Missing from Milky Way Galaxy
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot