ఇండియాకు త్వరలో యాపిల్ స్మార్ట్ వాచ్

Written By:

సెల్ ఫోన్ల రాకతో వాచ్ ల వాడకం చాలా వరకూ తగ్గిపోయింది. అయినా వాచ్ లను మోజుగా ధరించే వారు ఇంకా చాలా మందే ఉన్నారు. మార్కెట్లోకి ఏ కొత్త తరహా వాచ్ వచ్చినా చేతికి పెట్టుకోవాలని తహతహలాడతారు. ఇలాంటి వాళ్లకోసం టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ రంగంలోకి దిగింది. సరికొత్త వాచ్ ను మార్కెట్ లోకి వదలబోతోంది. యాపిల్ స్మార్ట్ వాచ్ ఈ దసరాకు భారత మార్కెట్ లోకి తీసుకురావాలని యోచిస్తోంది.

Read more:రీలీజ్‌కు ముందే ఐఫోన్ 6ఎస్ బేరసారాలు

ఇండియాకు త్వరలో యాపిల్  స్మార్ట్ వాచ్

వీటి ధర 25వేల నుంచి 30వేల వరకూ ఉంటుంది. 38, 42ఎంఎం సైజుల్లో, మూడు మోడల్స్ లో ఈ వాచ్ లు వస్తున్నాయి. యాపిల్ వాచ్, ఆపిల్ వాచ్ ఎడిషన్, ఆపిల్ వాచ్ స్పోర్ట్ అనే మూడు మోడల్స్ లో లభించనున్నాయి. ఏప్రిల్ నెల నుంచి ఈ ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ, తొమ్మిది ఎంపిక చేసిన మార్కెట్లలోనే లభించేవి.

Read more: యాపిల్‌పై నెటిజన్లకు ఇంత కోపముందా..

ఇండియాకు త్వరలో యాపిల్  స్మార్ట్ వాచ్

అయితే ఇప్పుడు యాపిల్ స్మార్ట్ వాచ్ లను విడతల వారీగా అన్ని కీలకమైన మార్కెట్లలో అందుబాటులో ఉంచబోతున్నారు. అయితే, త్వరలో భారత మార్కెట్ లోకి రాబోతున్న మోటరోలా, శాంసంగ్ వాచ్ లు ఆపిల్ వాచ్ లకు పోటీ నివ్వబోతున్నాయి.

ఇండియాకు త్వరలో యాపిల్  స్మార్ట్ వాచ్

మోటో 360 సెంకండ్ జెనరేషన్, శాంసంగ్ న్యూగేర్ ఎస్ టు త్వరలోనే భారత విఫణిలోకి రాబోతున్నాయి.

English summary
Apple is all set to launch its first smartwatch in India next week.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot