రీలీజ్‌కు ముందే ఐఫోన్ 6ఎస్ బేరసారాలు

|

ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న హ్యాండ్‌ సెట్‌ ఆపిల్‌ ఐ ఫోన్‌. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలు మోబైల్‌ స్టోర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఐ ఫోన్‌లో పలు మోడళ్లను మార్కెట్‌లోకి విడుల చేసిన ఆపిల్‌ కంపెనీ.. తాజాగా ఐఫోన్‌ 6s, 6sప్లస్‌ను సెప్టెంబర్‌ 25న అమెరికా మార్కెట్‌లో రిలీజ్‌ చేయబోతున్నది. అప్పటి వరకు ఆగలేని ఐఫోన్‌ లవర్లకు ముంబై, ఢిల్లీ, కలకత్తాలోని కొన్ని మొబైల్‌ స్టోర్లు బంఫర్‌ ఆఫర్‌ ఇస్తున్నాయి.

Read more : యాపిల్‌పై నెటిజన్లకు ఇంత కోపముందా..

లక్ష రూపాయలు ఇస్తే అమెరికాలో రిలీజైన రెండు రోజుల్లోనే ఐఫోన్‌ 6s ప్లస్‌ అందిస్తామంటున్నాయి . అటు ఆపిల్‌ 6s, 6sప్లస్‌ మోడళ్లలో రోజ్‌ గోల్డ్‌ కలర్ ఫోన్లకు మరింత గిరాకీ ఉన్నట్లు మొబైల్‌ ఎక్స్‌ ఫర్ట్స్‌ చెప్తున్నారు. 6s ధర 70 నుంచి 80 వేల రూపాయలు ఉండగా 6s ప్లస్‌ ధర 80 నుంచి 90 వేలు పలికే అవకాశం ఉంది. అయితే రోజ్‌ గోల్డ్‌ ధర మాత్రం పది నుంచి పదిహేను వేల రూపాయలు అధికంగా ఉండొచ్చంటున్నారు.ఐ ఫోన్ 6 ఎస్ ,ప్లస్ ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more:60 రోజుల్లో 5 లక్షల ఫోన్‌లు అమ్మేసారు

కొత్త మోడల్స్‌ను రిలీజ్‌ చేసిన  టిమ్‌కుక్‌

కొత్త మోడల్స్‌ను రిలీజ్‌ చేసిన టిమ్‌కుక్‌

మొబైల్‌ లవర్స్‌ ఊహించిన దానికన్నా.. ఎక్కువ ఫీచర్లే కొత్త మోడల్స్‌లో ఉన్నాయ్‌. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ కొత్త మోడల్స్‌ను రిలీజ్‌ చేశారు.

ధర

ధర

మొబైల్స్‌లో 6ఎస్‌ మోడల్‌ను 16, 64,128 జీబీ కెపాసిటీ ఇచ్చింది. 16 జీబీ 649 డాలర్లు, 64 జీబీ 749 డాలర్లు, 128 జీబీ 849 డాలర్లును ధరగా కంపెనీ నిర్ణయించింది.

16, 64, 128జీబీ కెపాసిటీ

16, 64, 128జీబీ కెపాసిటీ

ఇక, 6ఎస్‌ ప్లస్‌ కూడా 16, 64, 128జీబీ కెపాసిటీలతో రిలీజ్‌ చేసింది. వీటి ధరలను 749-949 డాలర్లుగా కంపెనీ తెలిపింది.

కొనుగోలు ఆర్డర్లు

కొనుగోలు ఆర్డర్లు

అమెరికా, యూరప్‌లోను మార్కెట్‌లతో పాటు, ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, జపాన్‌, సింగపూర్‌లో ఇవాళ్టి నుంచి కొనుగోలు ఆర్డర్లు చేయవచ్చు.

ఫీచర్ల విషయానికి వస్తే..

ఫీచర్ల విషయానికి వస్తే..

ఫీచర్ల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 1 జీబీ ర్యామ్‌తో వచ్చిన ఐఫోన్‌ ఇక నుంచి 2 జీబీ ర్యామ్‌తో మరింత పవర్‌ పుల్‌గా పనిచేయనున్నాయ్. గేమింగ్‌ ప్రియుల కోసం హైఎండ్ గ్రాఫిక్స్, పుల్ హెచ్‌డి, హై రెజిల్యూషన్‌ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణ.

కొత్తగా త్రీడీ టచ్‌

కొత్తగా త్రీడీ టచ్‌

6ఎస్‌ 4.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తే.. 6ఎస్‌ప్లస్‌ 5.5 అంగుళాలు. రెటీనా డిస్‌ప్లేతో 12 మెగాపిక్సల్‌ రియర్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా ఇచ్చింది. ఇక కొత్తగా త్రీడీ టచ్‌ అందించింది.

ఆపిల్ iPhone 6S లో కొత్తగా యాడ్ అయినవి..

ఆపిల్ iPhone 6S లో కొత్తగా యాడ్ అయినవి..

3D టచ్ ను వివరిస్తూ మొదలు పెట్టింది ఆపిల్ బృందం. ఇది ఐ ఫోన్ 6s లో ప్రవేశపెడతున్న ఫోర్స్ టచ్ టెక్నాలజీ. నార్మల్ గా కాకుండా ఒక 10ms మిని టాప్ అండ్ 15ms ఫుల్ టాప్ చేస్తే టచ్ inputs రెగ్యులర్ గా చేసే పనులు కాకుండా వేరే ఫలితాలను ఇస్తాయి ఫోనులో. ఇది యాప్ ఓపెన్ చేయకుండానే యాప్ లో పనులు చేస్తుంది. అంటే సేల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు వెంటనే తీయటానికి ఉపయోగపడుతుంది.

హార్డ్ వేర్ విషయానికి వస్తే..

హార్డ్ వేర్ విషయానికి వస్తే..

హార్డ్ వేర్ విషయానికి వస్తే.. 3rd Gen A9 డెస్క్ టాప్ క్లాస్ 64 బిట్ ప్రొసెసర్ ఉంది. ఇది A8 ప్రొసెసర్ కన్నా 70% ఫాస్ట్ గా అండ్ 90% ఫాస్ట్ గ్రాఫిక్స్ తో రన్ అవుతుంది. దీనిలో M9 మోషన్ కో - ప్రొసెసర్ నిరంతరం రన్ అవుతుంటుంది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు యాప్స్ పెర్ఫార్మన్స్ ను స్ట్రీమ్ లైన్ చేస్తుంది.

12 మెగా పిక్సెల్ iSight కెమేరా

12 మెగా పిక్సెల్ iSight కెమేరా

12 మెగా పిక్సెల్ iSight కెమేరా ఫాస్ట్ గా ఫోకస్ చేస్తుంది. deep trench isolation కూడా ఉంది. ఇది ఓవర్ ఆల్ గా ఇమేజ్ లో noise తీయటానికి. 4K వీడియో రికార్డింగ్ ఉంది. ఫ్రంట్ కెమేరా 5MP కు అప్ గ్రేడ్ అయ్యింది.

ఇమేజ్ లైవ్ వీడియో లా కన్వర్ట్

ఇమేజ్ లైవ్ వీడియో లా కన్వర్ట్

ఫోటో తీసేటప్పుడు లాంగ్ ప్రెస్ చేసి capture చేస్తే ఇమేజ్ లైవ్ వీడియో లా కన్వర్ట్ అవుతుంది. ఇది 3D టచ్ ఫోటోగ్రఫీ అని చెబుతుంది ఆపిల్. కెమేరా ఫ్లాష్ కు రెటినా ట్యాగ్ కూడా ఉంది. ఇది true టోన్ ఫ్లాష్ కన్నా బెటర్ గా ఉంటుంది.

 గొరిల్లా గ్లాస్ వలె కొత్త 7000 సిరిస్ గ్లాస్

గొరిల్లా గ్లాస్ వలె కొత్త 7000 సిరిస్ గ్లాస్

iphone 6S లో 23 LTE బాండ్స్ డబుల్ స్పీడ్ తో వర్క్ అవుతాయి. దీనికి కూడా ఆండ్రాయిడ్ ఫోనుల్లో ఉండే గొరిల్లా గ్లాస్ వలె కొత్త 7000 సిరిస్ గ్లాస్ ఉంది. దీనిలో అల్యూమినియం యూస్ చేసినట్లు చెబుతుంది ఆపిల్.

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో 

Best Mobiles in India

English summary
Here Write Get the new Apple iPhone for Rs 1 lakh within two days of US launch

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X