ఆ వాచ్ ఖరీదు 14 లక్షలు

Written By:

అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఆపిల్.. దేశీయంగా స్మార్ట్‌వాచ్‌ల విక్రయాన్ని ప్రారంభించింది. దీంట్లో టాప్ మోడల్ ధరను రూ.14 లక్షలుగా నిర్ణయించింది. ఈ వాచ్ కొనుగోలు చేయదలిచిన వినియోగదారులు ముందుగానే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని ఆపిల్ రిటైల్ నెట్‌వర్క్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రూ.30,990 మొదలుకొని రూ.14 లక్షల వరకు ధర కలిగిన ఈగడియారాలను దేశవ్యాప్తంగా ఉన్న 100 ప్రీమియం స్టోర్ల ద్వారా విక్రయించనున్నట్లు ఆపిల్ ప్రకటించింది.

Read more: రికార్డులు తిరగరాసినా గ్రాఫిక్స్‌లో అనేక తప్పులు

38 ఎంఎం, 42 ఎంఎం సైజులు కలిగిన ఈ వాచ్‌లు మూడు రకాల్లో లభించనున్నాయి. దీంట్లో 18 క్యారట్ల బంగారం కేస్‌తో తయారైన 42 మిల్లీమీటర్ల డిస్‌ప్లే కలిగిన మోడల్ ధరను రూ.9.9 లక్షలుగా నిర్ణయించింది. సిల్వర్ అల్యూమినియం కేస్ కలిగిన గడియారం ప్రారంభ ధరను రూ.34,900గా ఉంచింది. వీటితోపాటు 38 ఎంఎం కలిగిన వాచ్ ప్రారంభ ధరను రూ.30,900గా నిర్ణయించిన సంస్థ గరిష్ఠంగా రూ.8.2 లక్షలకు విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Read more: రూపు రేఖలు మారిపోతున్నాయ్!

ఈ వాచ్‌ల ద్వారా ఫోన్ మాట్లాడవచ్చు. ఈ-మెయిల్స్, సంగీతాన్ని నియంత్రించవచ్చు. అంతేకాదు ఫోటోలు, ఫిట్‌నెస్ సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే వీలుంటుంది. ఈ సందర్బంగా యాపిల్ వాచ్ చేసిన మంచి పనిని ఓ సారి చూద్దాం.

Read more: వొడాఫోన్ కస్టమర్‌లకు దీపావళి బంపర్ ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హృదయ స్పందన రేటు

అమెరికాలో ఓ యువకుడి ప్రాణాలను అతను ధరించిన స్మార్ట్‌వాచీ కాపాడింది. పాల్ హూలే అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడి హృదయ స్పందన రేటు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటాన్ని స్మార్ట్‌వాచీ గుర్తించి.. వెంటనే హెచ్చరించింది. దాంతో వెంటనే ఆ యువకుడ్ని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్సనందించి.. ప్రాణ ముప్పును తొలగించారు.

గదికి వచ్చి విశ్రాంతి

మసాచుసేట్స్‌లోని మారియన్‌లో ఉన్న టాబర్ అకాడమీ సీనియర్ క్రీడాకారుడైన పాల్ .. గరిష్ఠ ఉష్ణోగ్రతలో ఏకబిగిన రెండు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. నొప్పి రావడంతో తన గదికి వచ్చి విశ్రాంతికి ఉపక్రమించాడు.

నిమిషానికి 145 సార్లు

తన చేతికి ధరించిన ఆపిల్ వాచీ మానిటర్‌లో సాధారణ స్థాయిలో ఉండే హృదయ స్పందన రేటు 60 నుంచి 80 కంటే.. నిమిషానికి 145 సార్లు కొట్టుకోవడం నమోదైంది.

ఎమర్జెన్సీ రూంకు..

తొలుత వాచీ పాడైపోయిందని పాల్ భావించాడు. కాని పరిస్థితి తనకు తెలియకుండానే చేయి దాటిపోయింది. ఇక అక్కడే అలానే పడిపోయాడు. తన కోచ్, స్కూల్ నర్సు పరిస్థితిని గమనించి.. ఎమర్జెన్సీ రూంకు తరలించారు.

రాబ్డోమయోలిసిస్‌కు ..

దేహంలోని కండరాలు విచ్ఛిన్నమై.. రక్తంలోకి ఓ రకమైన ప్రొటీన్లు విడుదలై.. కీలక అవయవాలు విఫలమయ్యే లక్షణాలున్న రాబ్డోమయోలిసిస్‌కు గురయ్యాడని డాక్టర్లు గుర్తించారు.

యాపిల్ వాచ్ నన్ను కాపాడిందని..

ఈ పరిస్థితిని పట్టించుకోకుండా మళ్లీ ప్రాక్టిస్‌కు వెళ్లి ఉంటే ప్రాణాలతో మిగిలి ఉండేవాడివి కాదని వైద్యులు హెచ్చరించారని పాల్ తెలిపారు. ఈ సందర్భంగా యాపిల్ వాచ్ నన్ను కాపాడిందని దానికి చాలా ధ్యాంక్స్ అంటూ మనోడు అందరికీ చెబుతున్నాడు.

ప్రాణం పోయో టైంలో ..

అంతే కదా.. ప్రాణం పోయో టైంలో యాపిల్ వాచ్ అలా మనోడికి సాయం చేయడం అంటే గ్రేటే మరి. నిజంగా యాపిల్ స్మార్ట్ వాచీకి థ్యాంక్స్ చెప్పాల్సిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple Watch top model to cost about Rs 14 lakh in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot