499 రూపాయలకే 200mbps ఏసియానెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

|

జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును అధికారికంగా వెల్లడించిన తర్వాత ప్రతి ఒక్కరు తమ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను కోల్పోకుండా ఉండడానికి రకరకాల ఆఫర్లను ప్రవేశపడుతున్నారు. అందులో భాగంగా ఏసియానెట్ బ్రాడ్‌బ్యాండ్ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 499 రూపాయల వద్ద సమర్థవంతంగా ఇస్తున్నట్లు సమాచారం. కంపెనీ వినియోగదారులకు మొత్తం మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. వీటిలో రూ.1,499, రూ.2,499 మరియు రూ.2999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి.

499 రూపాయలకే 200mbps ఏసియానెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

 

పైన పేర్కొన్న అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 200Mbps వేగంతో కంపెనీ అందిస్తుంది.1,499 రూపాయల ప్లాన్ రెండు నెలల చెల్లుబాటుతో వస్తుంది అలాగే 2,499 రూపాయల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నాలుగు నెలల చెల్లుబాటు కాలంతో వస్తుంది.

 2,999 రూపాయల ప్లాన్:

2,999 రూపాయల ప్లాన్:

200 Mbps వేగంతో 2,999 రూపాయల దీర్ఘకాలిక ఏషియానెట్ ప్లాన్ ఆరు నెలల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం FUP పరిమితికి 1200GB డేటాతో అందించబడుతుంది. అంటే నెలవారీ పరిమితి 200GB డేటా. FUP పరిమితి తరువాత 2Mbps వేగంతో అపరిమిత డేటాను ఈ ప్లాన్ అందిస్తుంది. దీని అర్థం సమయానికి ముందు పరిమితిని ఎగ్జాస్ట్ చేసినా FUP కోలుకునే వరకు మిగిలిన సమయానికి మీకు 2Mbps వేగం లభిస్తుంది. మొత్తంమీద మీరు ప్రతి నెలా 200GB డేటాను ఎఫ్‌యుపితో 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 499 రూపాయలకు పొందవచ్చు.

 1,499 రూపాయల ప్లాన్:

1,499 రూపాయల ప్లాన్:

1,499 రూపాయల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ విషయానికి వస్తే ఇది వినియోగదారులకు రెండు నెలల పాటు లేదా 60 రోజుల వరకు 1000 GB డేటాను FUP పరిమితితో లభిస్తుంది. అంటే వినియోగదారులకు నెలకు 500GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ను మార్పు చేయకముందు అదే 1,499 రూపాయల ఎంట్రీ ప్లాన్ 500GB FUP పరిమితితో అందించేది. అంటే ఇది నెలకు 250GB డేటాను ఇస్తూఉండేది. సవరించిన తరువాత ఈ ప్లాన్ ప్రస్తుతం రెట్టింపు డేటాను అందిస్తున్నది.

2,499 రూపాయల ప్లాన్:
 

2,499 రూపాయల ప్లాన్:

అలాగే 2,499 రూపాయల ప్లాన్‌లో నెలవారీ ప్రాతిపదికన 300GB డేటా ఎఫ్‌యూపీ పరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ నాలుగు నెలల చెల్లుబాటుతో వస్తుంది. దీని యొక్క మొత్తం కాల పరిమితికి 1200GB పరిమితి డేటాను అందిస్తుంది. FUP పరిమితి దాటిన తరువాత ఇది 2 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ముఖ్యంగా ఏషియానెట్ నుండి పేర్కొన్న అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలతో ఉచిత కేబుల్ టివి సేవలను కంపెనీ అందిస్తున్నట్లు తెలిసింది. దీని గురించి కంపెనీ త్వరలో వెల్లడిస్తుందని భావిస్తున్నారు.

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్:

హాత్వే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్:

ఏషియానెట్ కాకుండా హాత్వే బ్రాడ్‌బ్యాండ్ కూడా 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 699 రూపాయలకు అందిస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. హాత్వే తన 150 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను నెలకు రూ .1,499 ధరలకు సర్దుబాటు చేసిందని కూడా ఒక నివేదిక పేర్కొంది. రిలయన్స్ జియో తన జియో గిగా ఫైబర్ లేదా జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును అధికారికంగా వెల్లడించిన తర్వాత ఈ ప్రకటనలు వచ్చాయి. రూ .699 ప్లాన్‌తో ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) లో భాగంగా మీకు 1TB డేటా లభిస్తుంది. దీని తరువాత వినియోగదారులు 3Mbps వేగంతో డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ ప్రస్తుతం ఎంచుకున్న నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Asianet Broadband 200Mbps Speed Plan Now Starts at Rs 499

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more