భూ ప్రళయం తప్పింది..అయినా పెను ముప్పే

Posted By:

భూమికి ఇప్పుడిప్పుడే అంతం లేదని ప్రళయం వంటి విపత్కర పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సోమవారం హామీ ఇచ్చింది. దాదాపు 2.5కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గ్రహ శకలం భూమిపైకి దూసుకొస్తుందని దీని వేగం..సాంద్రతను అంచనా వేసినప్పుడు ఒక వేళ అది భూమిని ఢీ కొంటే విశ్వ వినాసనం తప్పదన్న వార్తలను నాసా కొట్టి పారేసింది. ఆస్టరాయిడ్ 86666 అనే పేరు గల గ్రహ శకలం శనివారం భూమికి అతి సమీపం నుంచి వెళ్తుందని ముందుగానే నాసా శాస్ర్తవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే.

Read more:ఆశలు ఆవిరై పోతున్నాయా..?

అది భూమిని ఢీ కొంటుందని దాని వల్ల ప్రపంచం క్షణాల్లో నాశనమవుతుందని గత నెలరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని ప్రయాణం గురించి నాసా శనివారం తెలిపింది. ఆస్టరాయిడ్ 86666 అక్టోబర్ 10న భూమిని 15 మిలియన్ మైళ్ల దూరం నుంచి సురక్షితంగా దాటుతుంది అని పేర్కొంది. రానున్న వందేళ్లలో గ్రహశకలాల వల్ల భూమిపైకి ప్రమాదం 0.001 శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. నాసా ధీమా వ్యక్తం చేసినప్పటికీ పై నుంచి వేరొక విధంగా ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. అదేంటో స్లైడర్ లో చూడండి.

Read more: పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భూమిపైనుంచి వస్తున్న మెరుపును చూసి..

ఈ ఏడాది మార్చిన కేరళలోని పలుజిల్లాల్లోని ప్రజలు భూమిపైనుంచి వస్తున్న మెరుపును చూసి భీతిల్లిపోయారు. ఉన్నట్టుండి ఆకాశంలో చుట్టూ నీలిరంగులో అగ్నిగోళంలా మండుతూ కనిపించిన మెరుపును చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎవరైనా శత్రువులు దాడి చేసి ఉండవచ్చని, లేదా భారీ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని కొందరు... మరికొందరు ఆకాశం నుంచి భారీ గ్రహశకలం కిందికి పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

శాంపిళ్లను అధ్యయనం

రాత్రి 10గంటల నుంచి 10.30 వరకు అరగంటపాటు కొనసాగాయి. మిగతా ప్రాంతాల్లోనూ ఈ దృశ్యాన్ని చూసిన జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.అయితే విపత్తు నివారణ సంస్థ అధికారులు కరిమల్లూరుకు చెరుకొని పరిశోధనలు మొదలుపెట్టారు. మెరుపు కారణంగా పరిసరాల్లో పడిన శకలాల శాంపిళ్లను అధ్యయనం కోసం సేకరించారు. ఇది ఎలాంటి దాడికి, అగ్నిప్రమాదానికి సంబంధించినది కాదని తేల్చిచెప్పారు.

రాకెట్ లేదా శాటిలైట్ వ్యవస్థలో విఘాతం కలిగి భారీగా మెరుపులు

రాకెట్ లేదా శాటిలైట్ వ్యవస్థలో విఘాతం కలిగి భారీగా మెరుపులు వచ్చి ఉండవచ్చని, కిందపడిన శకలాలను అధ్యయనం చేస్తే వివరాలు తెలుస్తాయని శాస్త్రవేత్త రాజగోపాల్ కామత్ అన్నారు.మరి ఆ వివరాలు ఇంకా బయటి ప్రపంచానికి అందాయో లేదో ఇప్పటికైతే తెలియదు.

ఏడు సెకండ్లలోనే పేలిపోయింది

ఇక గతేడాది అక్టోబర్ చివరలో అమెరికా రోదసీ పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన ఒక ప్రయివేటు రాకెట్‌ ప్రయోగించిన ఏడు సెకండ్లలోనే పేలిపోయింది. ఈ ప్రయోగం ఫలితంగా ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదని నాసా ప్రకటించింది.

ఆకాశంలో పెద్ద పేలుడు

అంతా అనుకున్నట్టే జరుగుతుందనుకున్న సమయంలో ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రయోగం జరిగింది. కొన్ని వేల మంది ఈ ప్రయోగాన్ని చూస్తుండగానే ఆకాశంలో పెద్ద పేలుడు సంభవించింది. రాకెట్‌ ముక్కలు ముక్కలైపోయింది. రాకెట్‌లోని ఇంధనం మొత్తం ఒక్కసారిగా అంటుకోవడంతో ఆకాశంలో మంటలు వ్యాపించాయి. రాకెట్‌ శకలాలు శరవేగంగా నేలకూలాయి.

ఈ రాకెట్‌లో మనుషులు ఎవ్వరూ లేరు

ఈ రాకెట్‌లో మనుషులు ఎవ్వరూ లేరు. ఈ మానవ రహిత రాకెట్‌ ద్వారా దాదాపు 5000 పౌండ్ల బరువు ఉన్న రకరకాల సామగ్రిని రోదసిలోకి పంపిస్తున్నారు.రోదసీలో పనిచేస్తున్న వ్యోమగాముల కోసం ఈ సామాగ్రిని పంపిస్తుండగా ఈ భారీ పేలుడు జరిగింది.

మెరుస్తూ కనిపించి మాయమయ్యేవే ఉల్కలు

మాములుగా ఆకాశంలో అయితే మెరుస్తూ కొన్ని మాయమవుతుంటాయి. ఇలా ఆకాశంలో మెరుస్తూ కనిపించి మాయమయ్యేవే ఉల్కలు. వాస్తవానికి ఇవన్నీ గ్రహ శిథిలాలు. ఇవి ఎప్పటి నుంచో మనకు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి.

ఒక్కోసారి గ్రహాలకు చేరువుగా

మన సౌరమండలంలో ఇలాంటి ఉల్కలు, వాటికన్నా పెద్దవైన తోకచుక్కలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిలో ఇసుకరేణువంత పరిణామం మొదలుకొని కొన్ని వందల కిలోమీటర్ల వ్యాసం ఉన్నవాటినీ శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షంలో పరిభ్రమిస్తూ ఒక్కోసారి గ్రహాలకు చేరువుగా వస్తాయి.

వీటిచుట్టూ విపరీతమైన వేడి

ముఖ్యంగా మనకు చేరువలోకి వచ్చినవప్పుడు.. భూవాతావరణంతో సంగమించడం వల్ల.. వీటిచుట్టూ విపరీతమైన వేడి మొదలవుతుంది. వేగంగా దూసుకొని వస్తాయి కాబట్టి రాపిడికి.. మంటలు ఏర్పడతాయి. అవే మనకు కాంతిపుంజాల్లా కనిపిస్తాయి.

నింగినుంచి రాలిపడుతూ కనిపిస్తాయి

ఇలా వాతావరణంలోనే మండిపోవడం వల్ల.. భూమికి చేరకుండానే నాశనం అయిపోతున్నాయి. ఒక్కొక్కటి ఎక్కువగా కనిపించినా.. కొన్నిసార్లు పెద్ద మొత్తంలో ఇలా నింగినుంచి రాలిపడుతూ కనిపిస్తాయి. వీటిని.. ఉల్కాపాతాలుగా భావిస్తారు. గ్రహశకలాలు పెద్ద మొత్తంలో భూమికి చేరువలోకి వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కారమవుతాయి.

పెద్దపెద్ద ఉల్కలు భూమిపైకి ప్రచండవేగంతో ..

అయితే.. ఒక్కోసారి.. పెద్దపెద్ద ఉల్కలు భూమిపైకి ప్రచండవేగంతో దూసుకువస్తాయి. వీటిని ఆపడం చాలా కష్టం. భూవాతావరణంలోకి కూడా చొచ్చుకుని వచ్చి.. భూమిని ఢీకొడతాయి. భూమికి ఇలాంటి వాటినుంచి ముప్పుకూడా పొంచి ఉంది.

ప్రపంచదేశాలు కొత్త కొత్త అస్త్రాలను..

అయితే.. ఇటీవలకాలంలో మాత్రం భారీ స్థాయిలో ఉల్కలు మన భూమిపైకి దూసుకొని రాలేదు. ఒకవేళ వచ్చినా.. వాటిని విశ్వంలోనే నాశనం చేయడానికి ప్రపంచదేశాలు కొత్త కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి.

డైనోసార్ల కాలంలో ఓ పెద్ద ఉల్క మన భూమిని ఢీకొని ఉంటుందన్న అంచనా

మానవపరిణామక్రమం మొదలుకానప్పుడు.. అంటే.. డైనోసార్ల కాలంలో ఓ పెద్ద ఉల్క మన భూమిని ఢీకొని ఉంటుందన్న అంచనా.. శాస్త్రవేత్తలది. డైనోసార్లతో పాటు భూమిపై ఉండే జీవరాశులను ఈ ఉల్కాపాతం నాశనం చేసిఉండొచ్చని భావిస్తున్నారు.

డైనోసార్లు అంతం కావడంతో పాటు..

డైనోసార్లు అంతం కావడంతో పాటు .. భూమిపైన అనూహ్యమార్పులు చోటుచేసుకోవడానికి ఇలాంటి ఉల్కలు ఢీకొనడమే కారణం అన్న అభిప్రాయం ఉంది. అయితే.. దీన్ని ఇంతవరకూ శాస్త్రీయంగా రుజువు చేయలేకపోయారు. రెండు శతాబ్దాలుగా చూస్తే.. దాదాపు 11 వందల ఉల్కలు భూమిపై పడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గ్రహాంతరవాసుల రూపంలో కాకపోయినా..

గ్రహాంతరవాసుల రూపంలో కాకపోయినా.. సూర్యమండలంలో తిరుగుతున్న ఉల్కల వల్ల మనకు ప్రమాదం ఉండొచ్చన్న అనుమానాలూ భయపెడుతూనే ఉన్నాయి. అయితే.. ఏ ఉల్కలు ఎప్పుడు వస్తాయన్నది కచ్చితంగా లెక్కలు కట్టగలిగారు శాస్త్రవేత్తలు.

భూమికి ముప్పు పొంచి ఉందంటూ ప్రమాద సంకేతాలు

అయితే.. 2036లో మాత్రం అపోఫిస్ అనే ఓ శకలం వల్ల మన భూమికి ముప్పు పొంచి ఉందంటూ ప్రమాద సంకేతాలు ఇస్తున్నారు ఖగోళ పరిశోధకులు. ప్రస్తుతం మనకు కనిపించనంత దూరంలో ఉన్న ఈ శకలం.. 2029 నాటికి భూమికి దగ్గరలోకి రానుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అంతవరకూ ఆగాల్సిందే.

సూర్యమండలం ఏర్పడినప్పుడు..

ప్రాథమిక అంచనాల ప్రకారం.. సూర్యమండలం ఏర్పడినప్పుడు.. గ్రహాల్లోకి చేరని పదార్థాలు విడిగా మిగిలిపోయి.. ఆస్టరాయిడ్లుగా సంచరిస్తున్నాయన్న భావనలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

అంగారకుడికి.. బృహస్పతికి మధ్య..

ఇక మరో వాదన ప్రకారం.. అంగారకుడికి.. బృహస్పతికి మధ్య.. ఓ గ్రహం గతంలో ఉండేదని.. అది విచ్ఛిన్నం కావడం వల్లే ఈ ఆస్టరాయిడ్ బెల్డ్ ఏర్పడిందన్నది కొంత మంది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ రెండు గ్రహాల మధ్య ఉన్న దూరం దీనికి ఆధారంగా చూపిస్తున్నారు. అయితే.. శాస్త్రీయంగా మాత్రం ఈ వాదన రుజువు కాలేదు.

ప్లూటోను దాటిన తర్వాత క్యూపర్ బెల్ట్

ఆస్టరాయిడ్ బెల్ట్ తరహాలోనే.. ప్లూటోను దాటిన తర్వాత క్యూపర్ బెల్ట్ ఉంది. ఇందులోనూ ఎన్నో గ్రహశకలాలు ఉన్నాయి. ఆస్టరాయిడ్ బెల్డ్‌తో పోల్చితే.. ఈ క్యూపర్ బెల్డ్ పరిమాణంలో చాలా పెద్దది. ఇక్కడి నుంచే తోకచుక్కలు ఉద్భవించాయని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు.

ఆస్టరాయిడ్ బెల్డ్ నుంచే మనకు ఎక్కువగా సమస్యలు

అయితే.. ఆస్టరాయిడ్ బెల్డ్ నుంచే మనకు ఎక్కువగా సమస్యలు ఎదురుకానున్నాయి. దాదాపు 40 వేల ఏళ్ల క్రితమే.. ఓ భారీ ఆస్టరాయిడ్.. అమెరికాలోని ఆరిజోనాలో పడింది. దీని దాటికి కిలోమీటరుకు పైగా వ్యాసం ఉన్న ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది.

ఒకటీ రెండు ఉల్కలు మాత్రం భూమిని ఢీకొట్టే అవకాశాలు

ఇలాంటి ఆస్టరాయిడ్‌లు పెద్ద ఎత్తున భూమిపై పడితే జరిగేది వినాశనమే. అయితే.. ఒకేసారి మాకుమ్మడిగా ఇంతవరకూ పడలేదు కాబట్టి.. భవిష్యత్తులోనూ పడతాయని ఊహించలేం. కానీ... అప్పడప్పుడూ.. ఒకటీ రెండు ఉల్కలు మాత్రం భూమిని ఢీకొట్టే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజకీకి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot