మీ ఫోన్ నెంబరిస్తే కొంప కొల్లేరే!

Written By:

ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో మీ మొబైల్ నెంబర్‌ను పోస్ట్ చేస్తున్నారా..? జాగ్రత్త!, అలా చేసినట్లయితే మీ పేరు, మీరు ఉన్న లోకేషన్ ఇంకా మీకు సంబంధించి ఇతరత్రా వ్యక్తిగత వివరాలను సులువుగా దొంగిలించేందుకు ఆస్కారం ఉందని సాల్ట్ ఏజెన్సీకి చెందిన రెజా మోయావుద్దీన్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

లెనోవో కే3 నోట్@3 లక్షలు

ఈ సెక్యూరిటీ లోపాన్ని బయటపెట్టే క్రమంలో తాను బ్రిటన్, యూఎస్, కెనడాలకు చెందిన కొన్ని లక్షల ప్రాబబుల్ నెంబర్లను ర్యాండమ్‌గా ఫేస్‌బుక్ యాప్ బిల్లింగ్ ప్రోగ్రామ్ (ఏపీఐ)కు పంపించానని, ఆ ఫోన్ నెంబర్లతో ట్యాలీ అయిన ప్రతి యూజర్ ప్రొఫైల్ వివరాలు తనకు అందాయని ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెల్లడించారు.

శ్యాం‌సంగ్ ఫోన్లు ఇంత ఛీప్ గానా...

ఈ లూప్‌హోల్‌ను సైబర్ క్రిమినల్స్ ఉపయోగించుకుని ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత వివరాలను దొంగిలించే అవకాశముందని కాబట్టి యూజర్లు తమ ఫోన్ నెంబర్‌లను ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేేసే ముందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని మోయావుద్దీన్ హెచ్చరిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీకు తెలయని ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా. సదరు వ్యక్తి అభ్యర్థనను అంగీకరించే ముందు ఆ అకౌంట్ మంచిదో నకిలీదో తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది

మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను పంపిన అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి ప్రొఫైల్‌ను తెరచి ఫోటోల కోసం శోధించండి. ప్రొఫైల్‌లో ఒక ఫోటో మాత్రమే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఫేక్ అకౌంటే.

ఆ అకౌంట్‍కు సంబంధించి స్టేటస్ అప్‌డేట్‌లతో పాటు వాల్ పోస్టులు ఇంకా కామెంట్‌లను చూడండి.

సదరు ఫేస్‌బుక్ అకౌంట్ యూజర్ చాలా కాలం క్రితం నుంచి ఎటువంటి పోస్టింగ్స్ ఇంకా కామెంట్లకు పాల్పడనట్లయితే నకిలీ అకౌంట్ గానే భావించాల్సి ఉంటుంది.

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి స్నేహితుల జాబితాను తిరగవేయండి. అందులో ఎక్కువ శాతం మంది స్నేహితులు వ్యతిరేక జెండర్ అయినట్లయితే ఆ అకౌంట్ సరదా కోసం సృష్టించనదని నిర్థారణకు రావచ్చు.

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి వ్యక్తిగత సమాచారమైన ఎడ్యుకేషన్, ఉద్యగం ఇంకా ఇతర ఆసక్తిలకు సంబంధించిన వివరాలను అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి.

సదరు అకౌంట్ హోల్డర్.. డేటింగ్ ఇంకా మహిళలు ఇంకా పురుషుల పట్ల ఆసక్తి వంటి అంశాలను ప్రస్తావించినట్లయితే నకిలీ అకౌంట్‌గా గుర్తించాల్సి ఉంటుంది.

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి పుట్టిన రోజు వివరాలను క్షుణ్నంగా పరిశీలించండి. 1-1-1990, 31-12-1988 వంటి ఫ్యాన్సీ తేదీలు మీరు తారసపడినట్లయితే ఓ సారి ఆలోచించండి.

ఆడవారి ప్రొఫైల్స్‌ను కలిగి ఉన్న నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లు ఫోన్ నెంబర్లను కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని మరిచిపోవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sharing phone number on Facebook can give access to your personal details: Research.Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot