లెనోవో కే3 నోట్@3 లక్షలు

Posted By:

జూలై 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా నిర్వహించిన ఫ్లాష్‌సేల్స్‌లో భాగంగా 30 రోజుల్లో 3 లక్షల లెనోవో కే3 నోట్‌లను విక్రయించినట్లు లెనోవో పేర్కొంది. ఈ ఫోన్‌కు సంబంధించిన తదుపరి ఫ్లాష్‌సేల్ ఆగష్టు 19న జరగనుంది. రూ.10,000 ధర సెగ్మంట్‌లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపుతెచ్చుకున్న కే3 నోట్ 4జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

Read more : 1925కి కాల్ చేస్తే..?

లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లు... 5.5 అంగుళాల పూర్తి హైడెఫి‌నిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చైనా, అత్యధిక సంఖ్యలో శ్రామిక బలాన్ని కలిగి ఉంది. ఈ దేశంలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 112 మిలియన్‌లు.

ప్రపంచంలో అతిపెద్ద ఉత్పాదక దేశాల్లో చైనా ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న గొడుగుల్లో 70శాతం గొడుగులు చైనాలోనే తయారవుతాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే బటన్‌లలో 60శాతం చైనాలోనే తయారవుతాయి.

చైనా తయారు చేసిన ఉత్త్పత్తుల్లో 9శాతం సరుకు అమెరికాకు రవాణా అవుతుంది.

అమెరికా జనాభా వినియోగిస్తున్న బూట్లలో 72శాతం చైనాలో తయారుకాబడినవే.

క్రిస్మిస్ సీజన్‌ను పురస్కరించుకుని అమెరికాలో ఉపయోగించే కృత్రిమ క్రిస్మస్ దీపాలు పూర్తిగా చైనాలో తయారు కాబడినవే.

అమెరికాలో ఉపయోగించే 50 శాతం గృహోపకరణాలు చైనాలో తయారు కాబడినవే.

అమెరికాలో ఉపయోగించే 50 శాతం బొమ్మలు చైనాలో తయారైనవే.

మార్కెట్లో రూ.500, రూ. వెయ్యికు లభ్యమవుతున్న చైనా సెల్‌ఫోన్‌లకు రేడియేషన్ తాకిడి ఎక్కువ. ఉన్నత ప్రమాణాలు తక్కువ స్థాయిలో కలిగి ఉన్నఈ ఫోన్‌లు పలు సందర్భాల్లో విస్పోటనం చెందే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. పరిమాణం 152.6 x 76.2 x 7.99మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు, కలర్ వేరియంట్స్ (ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్, లేజర్ పసుపు).

Read more : శ్యాం‌సంగ్ ఫోన్లు ఇంత ఛీప్ గానా...

ఐడీసీ రెసెర్చ్ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక మేరకు ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 6శాతం వాటాను లెనోవో ఆస్వాదిస్తోంది. భారత మార్కెట్లో చైనా ఫోన్ కంపెనీలు తమ విక్రయాలను అంతకంతకు పెంచుకోగలుగుతున్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. 2015 రెండవ క్వార్టర్ కు గాను లెనోవో, షియోమీ, హువావీ, జియోనీ కంపెనీలు 12 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. చైనా కంపెనీలు ఇంతలా విజయం సాధించటంలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ వంటి ఈ-కామర్స్ వెబ్ సైట్ లు కీలక పాత్ర పోషించాయి.

English summary
Lenovo K3 Note: Over 3 lakh units sold in just one month. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot