గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 &10+ ప్రీ-ఆర్డర్ డీల్స్

|

భారతదేశంలో శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 మరియు గెలాక్సీ నోట్ 10+ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ప్రీ-ఆర్డర్‌లు కొంతకాలంగా అందుబాటులో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు కంపెనీ మొదట బండిల్ చేసిన ఆఫర్‌ల జాబితాలో మరికొన్నిటిని జతచేసింది. ఇందులో భాగంగా గెలాక్సీ వాచ్ యాక్టివ్‌ను ఫోన్‌తో పాటు కేవలం 9,999 రూపాయలకు అందివ్వనున్నారు. ఇప్పుడు ప్రీ-బుకింగ్ ఆఫర్ సవరించబడింది మరియు శామ్సంగ్ గెలాక్సీ బడ్స్‌ను కేవలం 4,999 రూపాయలకు అందివ్వనున్నారు.

Samsung Galaxy Note, Galaxy Note 10+ pre-order Live: Price in India, Offers, Cashback and More

ఇప్పుడు శామ్సంగ్ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ స్మార్ట్‌ఫోన్‌ యొక్క 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధరను కూడా నిశ్శబ్దంగా వెల్లడించింది. శామ్సంగ్ ట్విట్టర్ ద్వారా తాను సవరించిన ప్రీ-బుకింగ్ ఆఫర్ను ప్రకటించింది. దీనిని ముంబైకి చెందిన రిటైలర్ మనీష్ ఖాత్రి ఆఫ్‌లైన్ రిటైలర్లకు కూడా ఈ ప్రీ-బుకింగ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని ధృవీకరించబడింది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ స్మార్ట్‌ఫోన్‌ యొక్క 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 89,999 రూపాయలతో ట్యాగ్ చేస్తున్నట్లు కంపెనీ ఇ-స్టోర్లో జాబితా చేయబడింది.

ప్రీ-బుకింగ్ ఆఫర్స్:

ప్రీ-బుకింగ్ ఆఫర్స్:

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 మరియు గెలాక్సీ నోట్ 10+ రెండు ఆగస్టు 22 వరకు ప్రీ-ఆర్డర్‌ల కోసం ఉంటాయి. ఆగస్టు 23 నుండి వీటిని అమ్మకానికి ఉంచుతారు. వినియోగదారులు ఫోన్‌లను ఎంచుకోవడానికి రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా మరియు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ రిటైలర్ల ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు. పేటీఎం మాల్, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ మరియు టాటా క్లిక్ వంటి వాటిలో ప్రీ-బుకింగ్ ఆఫర్లలో భాగంగా వినియోగదారులు గెలాక్సీ బడ్స్‌ను దాని సాధారణ ధర 9,999 రూపాయలకి బదులుగా కేవలం 4,999 రూపాయలకు పొందవచ్చు. కొనుగోలుదారులు శామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్‌ను ప్రస్తుతం ఉన్న రిటైల్ ధర 19,990 రూపాయలకు ప్రత్యామ్నాయంగా కేవలం 9,999 రూపాయలకు బుక్ చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్స్:

బ్యాంక్ ఆఫర్స్:

ఇతర ప్రీ-బుకింగ్ ఆఫర్ల విషయంలో రిటైల్ అవుట్‌లెట్‌లు మరియు శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నప్పుడు 6,000 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ మరియు టాటా క్లిక్ వంటి ఆన్లైన్ స్టోర్ లలో ప్రీ-బుకింగ్ కొరకు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా 6,000 రూపాయలు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి అలాగే వీటితో పాటు క్యాషిఫై ద్వారా కొనుగోలుపై 10 శాతం అదనపు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉన్నాయి.

ధరల వివరాలు:

ధరల వివరాలు:

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 యొక్క 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర సుమారు 69,999 రూపాయలు. మరోవైపు భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10+ యొక్క బేస్ వేరియంట్‌ 12 GB ర్యామ్ మరియు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ ధర సుమారు 79,999 రూపాయలు.అలాగే 12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ మోడల్ యొక్క ధర సుమారు 89,999 రూపాయలు. ఈ రెండు ఫోన్లు ఆరా బ్లాక్, ఆరా గ్లో మరియు ఆరా వైట్ కలర్ వేరియంట్లలో లబిస్తాయి. శామ్సంగ్ ఆగస్టు 20 న ఇండియాలో కొత్త గెలాక్సీ నోట్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క అధికారిక లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం సంస్థ యొక్క ఇంగ్లీష్ మరియు హిందీ వెబ్‌సైట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 స్పెసిఫికేషన్స్:

శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 స్పెసిఫికేషన్స్:

శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత కంపెనీ OneUI తో రన్ అవుతుంది. ఇది 8GB RAM మరియు 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని విస్తరించడానికి వీలులేదు. ఇది డ్యూయల్ సిమ్ (నానో) సిమ్ స్లాట్లను కలిగి ఉంటుంది. ఫోన్ 6.3-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080x2280 పిక్సెల్‌లు) హెచ్‌డిఆర్ 10 + మరియు డైనమిక్ టోన్ మ్యాపింగ్‌కు మద్దతిచ్చే డైనమిక్ AMOLED ప్యానల్‌తో ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ ఆక్టా-కోర్ Exynos 9825 SoC చేత శక్తినిస్తుంది.

కెమెరా మరియు కనెక్టివిటీ :

కెమెరా మరియు కనెక్టివిటీ :

గెలాక్సీ నోట్ 10 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో వైడ్ యాంగిల్ (77 డిగ్రీల) లెన్స్‌తో వేరియబుల్ ఎపర్చరు (ఎఫ్ / 1.5-ఎఫ్ / 2.4) తో పాటు ఆప్టికల్ ఇమేజ్ కూడా ఉంది. ఈ సెటప్‌లో అల్ట్రా-వైడ్ యాంగిల్ (123 డిగ్రీలు) లెన్స్ మరియు ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. చివరగా ఫోన్లో 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఎఫ్ / 2.1 టెలిఫోటో లెన్స్ (45 డిగ్రీలు) మరియు OISఉన్నాయి. ముందు భాగంలో హోల్-పంచ్ హౌసింగ్‌లో 10 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ సెల్ఫీ షూటర్ ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G (LTE Cat. 20), వై-ఫై 802.11 యాక్స్, బ్లూటూత్ వి 5.0, ఎన్‌ఎఫ్‌సి, ఎంఎస్‌టి, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ స్పెసిఫికేషన్స్:

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ స్పెసిఫికేషన్స్:

మరోవైపు తేడాల పరంగా శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ లో 6.8-అంగుళాల క్యూహెచ్‌డి + (1440x3040 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే ఉంది. ఇది 12GB RAM తో వస్తుంది. 256GB మరియు 512GB వంటి రెండు స్టోరేజ్ ఆప్షన్స్ తో వస్తుంది. రెండూ మైక్రో SD కార్డ్ ద్వారా మెమరీని 1TB వరకు విస్తరించడానికి వీలు ఉంటుంది. కెమెరాల విషయానికొస్తే గెలాక్సీ నోట్ 10+ గెలాక్సీ నోట్ 10 వలె దాదాపుగా అదే సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది గెలాక్సీ నోట్ 10 కంటే కాస్త పెద్ద 4,300 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు ఇది 45W వరకు వేగంగా ఛార్జింగ్ చేయడానికి మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
శామ్సంగ్ ట్విట్టర్ ద్వారా తాను సవరించిన ప్రీ-బుకింగ్ ఆఫర్ను ప్రకటించింది. దీనిని ముంబైకి చెందిన రిటైలర్ మనీష్ ఖాత్రి ఆఫ్‌లైన్ రిటైలర్లకు కూడా ఈ ప్రీ-బుకింగ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని ధృవీకరించబడింది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ స్మార్ట్‌ఫోన్‌ యొక్క 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 89,999 రూపాయలతో ట్యాగ్ చేస్తున్నట్లు కంపెనీ ఇ-స్టోర్లో జాబితా చేయబడింది.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X