70-inch డిస్ప్లేతో రెడ్‌మి టీవీ: ధర & స్పెసిఫికేషన్స్

|

ప్రముఖ చైనా సంస్థ షియోమి ఇండియాలో తనకంటూ ఒక గుర్తింపును పొందింది.షియోమి మొదట మొబైల్ రంగంలోకి ప్రవేశించి అక్కడ చాలా బాగా విజయం సాధించింది.షియోమి యొక్క ఉప-బ్రాండ్ రెడ్‌మి కూడా మొబైల్ రంగంలో తనకంటూ మంచి గుర్తింపును పొందింది. ఇప్పుడు తన గుర్తింపును విస్తరించడానికి టీవీ రంగంలోకి కూడా ప్రవేశించబోతోంది. షియోమి యొక్క Mi టివి లైనప్ ఇప్పటికే భారతీయ టెలివిజన్ పరిశ్రమలో అద్భుతాలను సృష్టిస్తోంది.

Redmi TV with 70-inch Display: India Price & Specifications

ఇప్పుడు షియోమి సంస్థ యొక్క ఉప-బ్రాండ్ రెడ్‌మి తన మొట్టమొదటి స్మార్ట్ టీవీని ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది.రెడ్‌మి సంస్థ ఇప్పటికే తన రెడ్‌మి టీవీ యొక్క టీజర్ ను Weibo ద్వారా రిలీజ్ చేసింది. రెడ్‌మి టీవీ లాంచ్‌ను వీక్షించడానికి రెడ్‌మి Weibo ద్వారా ప్రసారం చేయబోతోంది.

రెడ్‌మి టీవీ లాంచ్ వివరాలు:

రెడ్‌మి టీవీ లాంచ్ వివరాలు:

Weiboలో రిలీజ్ అయిన టీజర్ ప్రకారం రెడ్‌మి టీవీ ఆగస్టు 29 న చైనాలో లాంచ్ అవుతుంది. ఇది 70 అంగుళాల స్మార్ట్ టీవీగా ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. షియోమి స్మార్ట్ టీవీల మాదిరిగానే రాబోయే రెడ్‌మి టీవీ కూడా ప్యాచ్‌వాల్ UIని అమలు చేస్తుంది. ఇది 4K HDR సపోర్ట్, డాల్బీ సౌండ్ సపోర్ట్ మరియు బ్లూటూత్ వాయిస్ రిమోట్‌తో బండిల్ చేయబడి వచ్చే అవకాశం ఉంది.

ధర వివరాలు:

ధర వివరాలు:

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెడ్‌మి టీవీ (మోడల్ నంబర్ L70M5) ఇటీవల చైనాలో 3C సర్టిఫికేషన్‌ను ఆమోదించింది. టీజర్ మరియు మోడల్ నంబర్ ద్వారా వెళితే ఇది కేవలం ఒకే ఉత్పత్తిగా రిలీజ్ అవుతోంది. షియోమి సంస్థ ప్రస్తుతం చైనాలో 75-అంగుళాల Mi టివి మోడళ్లను విక్రయిస్తోంది. దీని ధర సుమారు 52,000 రూపాయలు . Mi టీవీ కంటే కొంచెం చిన్న డిస్ప్లేతో రాబోయే రెడ్‌మి టీవీ దాని కంటే కాస్త చౌక ధరకు అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి CEO:

రెడ్‌మి CEO:

గత నెలలోనే రెడ్‌మి సబ్-బ్రాండ్ యొక్క కొత్త CEO Wu లీబింగ్ రెడ్‌మి టీవీని ప్రారంభించబోతున్నట్లు సూచించాడు. రెడ్‌మి మార్కెట్ లోకి ప్రవేశించినప్పటి నుండి రెడ్‌మి ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బాగానే అభివృద్ధి చెందింది. దీని పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఉపకరణాలు ఉన్నాయి.

రెడ్‌మి మార్కెట్:

రెడ్‌మి మార్కెట్:

టీవీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాలలోకి కూడా ప్రవేశించడం వల్ల రెడ్‌మి బ్రాండ్ ఎక్కువ మంది వినియోగదారుల జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. షియోమి ఇప్పటికే భారతదేశం మరియు చైనా రెండింటిలోనూ టీవీ మార్కెట్లో అగ్రగామిగా ఉంది. దాని ఉత్పత్తులు షియోమిచే బాగా ప్రేరణ పొందినందున ఉప బ్రాండ్ విజయవంతం కావడానికి బలమైన అవకాశం ఉంది.

రెడ్‌మి నోట్ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు:

రెడ్‌మి నోట్ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు:

రెడ్‌మి టీవీతో పాటు కంపెనీ తన అభిమానులకు మరోక ఆశ్చర్యకరమైన మరొక వార్తను తెలపబోతోంది. అదే రోజున చైనాలో పుకార్లు ఉన్న రెడ్‌మి 8 మరియు రెడ్‌మి నోట్ 8 సిరీస్‌లను కూడా రెడ్‌మి సంస్థ ఆవిష్కరించబోతోంది.ఈ రెండు సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో పలు సందర్భాల్లో గుర్తించబడ్డాయి. ఆగష్టు 29న జరగబోయే తన లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో రెడ్‌మి తన అభిమానుల కోసం అదనంగా మరొక ప్రోడక్ట్ ను రిలీజ్ చేస్తున్నారు.

Best Mobiles in India

English summary
Redmi TV with 70-inch Display: India Price & Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X