అధిక డేటా కోసం BSNL అందిస్తున్న ఉత్తమ డేటా వోచర్ ప్లాన్లు ఇవే...
కరోనా వైరస్ విజృంభణతో ప్రజా అందరూ వారి వారి ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఉద్యోగులు కూడా తమ యొక్క కార్యకలాపాలను ఇంటి వద్ద నుండి కొనసాగిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది ముందు కంటే ఇప్పుడు అధిక మొత్తంలో డేటాను వినియోగిస్తున్నారు.

BSNL ఉత్తమ డేటా STV వోచర్ ప్లాన్లు
అధిక డేటాను వాడుతున్న వినియోగదారులకు డేటా కోసం స్పెషల్ టారిఫ్ వోచర్లు చాలా ముఖ్యమైనవి. కొన్నిసార్లు యూజర్లు ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్ వారి డేటా అవసరాలకు సరిపోకపోవచ్చు. అటువంటి వారి కోసం అన్ని సంస్థలు డేటా ఎస్‌టివిలను అందిస్తున్నాయి. ఇతర టెల్కోల మాదిరిగానే బిఎస్ఎన్ఎల్ కూడా తన వినియోగదారులకు డేటా STVలను అందిస్తుంది. ఈ టెలికం యొక్క సర్కిల్ లలో వేర్వేరు ధరల వద్ద అద్భుతమైన ప్రయోజనాలతో STV ప్లాన్లను అందిస్తున్నాయి. BSNL తన వినియోగదారులకు అందిస్తున్న ఉత్తమ డేటా STV ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL PRBTSTV 548 డేటా వోచర్ ప్లాన్ వివరాలు
BSNL యొక్క కస్టమర్ అవసరాలలో డేటా ప్రాముఖ్యత కూడా ముఖ్యమైనది. రోజువారి అధిక డేటా అవసరమయ్యే కస్టమర్‌ల కోసం బిఎస్‌ఎన్‌ఎల్ రూ.548 ధర వద్ద విలువైన డేటా ఎస్‌టివిని అందిస్తోంది. PRBT STV 548 పేరుతో వస్తున్న ఈ డేటా వోచర్ రోజువారీ 5GB డేటాతో వస్తుంది. ఈ వోచర్ 90 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ వోచర్‌లో ఎటువంటి అదనపు ప్రయోజనం లేదు. ఈ వోచర్ మొత్తం చెల్లుబాటు కాలంలో మొత్తంగా 450GB డేటాను అందిస్తున్నది.

BSNL DATA 1098 డేటా వోచర్ ప్లాన్ వివరాలు
బిఎస్‌ఎన్‌ఎల్ అందించే అత్యంత ఖరీదైన డేటా వోచర్ ప్లాన్లలో మొదటి స్థానంలో ఇది ఉంటుంది. రూ.1098 డేటా వోచర్ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంను కూడా అదనంగా అందిస్తుంది. దానితో పాటు ఇది రోజుకు 100 SMSలను అన్ని నెట్వర్క్ లకు పంపడానికి అనుమతిస్తుంది. ఈ వోచర్‌తో అపరిమిత డేటా డేటా ప్రయోజనంను ఎటువంటి వేగ పరిమితులు లేకుండా పొందవచ్చు. దీని ద్వారా ఏవైనా ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడానికి మరియు అప్‌లోడ్ చేయడానికి పరిమితం చేసే FUP పరిమితి ఉండదు. ఈ వోచర్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

BSNL STV 998 డేటా వోచర్ ప్లాన్ వివరాలు
రూ. 998 ధర వద్ద లభించే ఈ డేటా వోచర్ 2GB రోజువారీ డేటాను అధిక వేగంతో అందిస్తుంది. ఇందులో రోజువారి డేటా FUP పరిమితి అయిపోయిన తర్వాత డేటా వేగం 80 Kbps కు తగ్గించబడుతుంది. దానితో పాటు ఈ వోచర్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు లోక్‌ధమ్ యాక్సెస్‌తో రింగ్‌టోన్‌ను 2 నెలల పాటు ఉచితంగా పొందుతారు. ఈ వోచర్ యొక్క మరొక గొప్ప విషయం ఏమిటంటే ఇది 270 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ వోచర్ ఎటువంటి ఇతర ప్రయోజనాలను అందించదు.


Click it and Unblock the Notifications








