Rs.8000 ధర లోపు గల బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

|

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అన్ని రకాల ధరల వద్ద గల ‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అధిక ధరలో గల ఫోన్ల నుండి సున్నితమైన ధర విభాగంలో కూడా వివిధ రకాల ఆఫర్లతో మార్కెట్ మంచి ఊపు మీద ఉన్నది. సరసమైన ధరల జాబితాలో శామ్సంగ్, నోకియా, రియల్మే మరియు ఆసుస్ వంటి సంస్థల మొబైల్‌ ఫోన్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

రూ.8000 లోపు ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు

రూ.8000 లోపు ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారులు ఎవరైతే సెకండరీ ఫోన్ కోసం వెతుకుతున్న వారి కోసం సరిగ్గా సరిపోతాయి. మా జాబితాలోని అన్ని ఫోన్‌లు ఆండ్రాయిడ్ OS ని కలిగి ఉండి 4G LTE మద్దతుతో వస్తాయి. రూ.8000 లోపు ఉత్తమమైన ఫోన్ల జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ గెలాక్సీ M10 ధరల వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ M10 ధరల వివరాలు

శామ్సంగ్ సంస్థ తక్కువ ధరలో అందిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో ఇది ఒకటి. దీనిని ఆన్‌లైన్‌ అమ్మకాలలో ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ద్వారా 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.7,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా, వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లే వంట స్పెసిఫికేషన్లతో వస్తుంది. రూ.8000 ధర విభాగంలో మా అభిప్రాయం ప్రకారం ఇదే బెస్ట్ ఫోన్.

శామ్‌సంగ్ గెలాక్సీ A10 ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A10 ధరల వివరాలు

ప్రస్తుతం గెలాక్సీ A10 ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ యొక్క బేస్ మోడల్‌ను రూ.7,990 ధర వద్ద లభిస్తుంది. ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ పరంగా ఇది గెలాక్సీ M10 కు సమానంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది డ్యూయల్ రియర్ కెమెరా మరియు వాటర్‌డ్రాప్ స్టైల్ నోచ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Nokia 2.2 దరల వివరాలు

Nokia 2.2 దరల వివరాలు

ప్రముఖ హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ఇటీవల నోకియా 2.2 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 2GB ర్యామ్ బేస్ మోడల్ ను రూ.6,999 ధర వద్ద విడుదల చేసింది. అలాగే 3GB ర్యామ్‌ యొక్క వేరియంట్ ను రూ.7,999 ధర వద్ద లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌ మరియు స్టాక్ ఆండ్రాయిడ్ పై ఓఎస్‌తో రన్ అవుతుంది. ఇదికాకుండా ఇది 5.71-అంగుళాల డిస్ప్లే మరియు 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఫీచర్లతో వస్తుంది.

Infinix Smart 3 Plus దరల వివరాలు

Infinix Smart 3 Plus దరల వివరాలు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ యొక్క 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ను రూ.6,999 ధర వద్ద ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. స్పెసిఫికేషన్స్ పరంగా ఇది 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను మరియు 13-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది 3,500mAh బ్యాటరీని కలిగి ఉండి ఆండ్రాయిడ్ పై ఓఎస్ ద్వారా రన్ అవుతుంది.

వివో Y 91i దరల వివరాలు

వివో Y 91i దరల వివరాలు

వివో వై 91 ఐ వాటర్‌డ్రాప్ స్టైల్ నోచ్ డిస్‌ప్లే మరియు 4,030 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, సింగిల్ ఫ్రంట్ మరియు రియర్ కెమెరాను కలిగి ఉండి ఆండ్రాయిడ్ ఓరియో ద్వారా రన్ అవుతుంది. దీనిని అమెజాన్ ఇండియా ద్వారా రూ.7,990 ధర వద్ద స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

షియోమి రెడ్‌మి 7 దరల వివరాలు

షియోమి రెడ్‌మి 7 దరల వివరాలు

షియోమి రెడ్‌మి 7 ఇటీవల ఇండియాలో లాంచ్ అయింది. ఇందులో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ యొక్క బేస్ మోడల్ ను రూ.7,999 ధర వద్ద మరియు 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్‌ యొక్క వేరియంట్ ను రూ.8,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 632 SoC, 6.26 అంగుళాల డిస్ప్లే, 4,000mAh బ్యాటరీ మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.

షియోమి రెడ్‌మి గో దరల వివరాలు

షియోమి రెడ్‌మి గో దరల వివరాలు

అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ల యొక్క జాబితాలో షియోమి యొక్క రెడ్‌మి గో అన్నిటికన్నా ముందు వరుసలో ఉంది. షియోమి రెడ్‌మి గో ఆండ్రాయిడ్ గో ఓఎస్ మరియు 1GB RAM + 8GB స్టోరేజ్ ఫీచర్లతో రూ.4,499 ధర వద్ద లభిస్తుంది. అంతేకాకుండా 16GB స్టోరేజ్‌తో గల మరో వేరియంట్ ను రూ.4,799 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C2 దరల వివరాలు

రియల్‌మి C2 దరల వివరాలు

రియల్‌మి C2 డైమండ్ కట్ డిజైన్ స్మార్ట్‌ఫోన్ 4,000mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ వంటి మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్‌ల మద్దతుతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ పై కలర్ ఓఎస్ స్కిన్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 2GB ర్యామ్ + 16GB స్టోరేజ్ మోడల్‌ రూ.5,999 ధర వద్ద లభిస్తుంది. అంతేకాకుండా 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ మోడల్ ను రూ.7,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్

ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్

తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఆసుస్, శామ్‌సంగ్, నోకియా మరియు రియల్‌మి స్మార్ట్‌ఫోన్లు ఉత్తమ ఎంపికలుగా ఉంటాయి. ప్రస్తుతం ఇండియాలో చైనా యొక్క స్మార్ట్‌ఫోన్లను బ్యాన్ చేసిన కారణంగా అధిక మంది షియోమి మరియు రియల్ మి స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోవచ్చు. అటువంటి వారి కోసం శామ్‌సంగ్ మరియు నోకియా యొక్క ఫోన్లు ఉత్తమ ఎంపికలుగా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Best Smartphones Under Rs.8000 in India June 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X