Samsung Galaxy A21s లాంచ్!!! మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇదే!!!

|

ప్రముఖ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఇప్పుడు ఇండియాలో మరొక సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ A21s ను విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొత్త కొత్త ఫోన్ లను విడుదల చేస్తున్నారు.

 

Samsung Galaxy A21s స్మార్ట్‌ఫోన్ లాంచ్

Samsung Galaxy A21s స్మార్ట్‌ఫోన్ లాంచ్

ముఖ్యంగా మిడ్ రేంజ్ విభాగంలో విడుదల అయిన రియల్‌మి 6 సిరీస్ మరియు షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రోలకు గట్టి పోటీని ఇవ్వడానికి తన సరికొత్త గెలాక్సీ A 21s స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ ను మరియు పెద్ద బ్యాటరీ గల ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:OPPO A12 అద్భుతమైన ఫీచర్స్ మరియు గేమ్ ఇన్నోవేషన్‌లతో రూ.9,990 లకే స్మార్ట్‌ఫోన్

శామ్‌సంగ్ గెలాక్సీ A21s ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A21s ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A21s మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో వేరియంట్ లలో విడుదల చేసారు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.16499 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 18,499 రూపాయలు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Also Read: Rs.30,000 పైన ధర గల స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇవే...

శామ్‌సంగ్ గెలాక్సీ A21s సేల్స్ డేట్
 

శామ్‌సంగ్ గెలాక్సీ A21s సేల్స్ డేట్

శామ్‌సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ యొక్క సేల్స్ జూన్ 19 న నుండి మొదలు కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరియు శామ్‌సంగ్ యొక్క వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దీనిని కొనుగోలు చేయవచ్చు. శామ్‌సంగ్ యొక్క ఆఫ్‌లైన్ రిటైలర్ల దుకాణాల ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A21s స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A21s స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల హెచ్‌డి + ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను 720 X 1,600 పిక్సెల్స్ పరిమాణంలో మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI మరియు ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. అలాగే ఇది 15W వైర్డ్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Samsung Galaxy A21s ఫీచర్స్

Samsung Galaxy A21s ఫీచర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A21s స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను దీర్ఘచతురస్ర కారంలో ఉంటుంది. ఇందులో ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్‌తో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో జత చేయబడి ఉంటాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్ లోపల 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అమర్చబడి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A21s Launched in India: Price, Specs, Sale date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X