Airtel యొక్క 'మీ & మై ఫ్యామిలీ' పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల మీద ఓ లుక్ వేయండి...
ఇండియాలోని టెలికాం ఆపరేటర్లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్నది. ఇది తన యొక్క వినియోగదారులకు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లను ఉచిత యాడ్-ఆన్ కనెక్షన్‌లతో, అదనపు ఖర్చు లేకుండా OTT లకు యాక్సిస్ మరియు నెలవారి డేటా ప్రయోజనాన్ని కేవలం 399 రూపాయల నుండి అందిస్తున్నాయి.

పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ల అవసరం అధికంగా మొత్తం కుటుంబం కోసం సరసమైన ధరలో అన్ని ప్రయోజనాలను కోరుకునే చందాదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి. సాధారణంగా ప్రత్యేక రెగ్యులర్ యాడ్-ఆన్ కనెక్షన్ కోసం నెలకు రూ.249 ఖర్చు అవుతుంది. అయితే డేటా యాడ్-ఆన్ కోసం నెలకు రూ.99 ఖర్చు అవుతుంది. అయితే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఎయిర్‌టెల్ ఈ యాడ్-ఆన్‌లను ఉచితంగా అందిస్తుంది. ‘మీ & మై ఫ్యామిలీ' కోసం ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రూ.749, రూ.999 మరియు రూ.1,599 వంటి మూడు రకాల ధరల వద్ద లభిస్తాయి. ఈ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ 'మీ & మై ఫ్యామిలీ' రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
రూ.749 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ కింద భారతి ఎయిర్‌టెల్ రెండు యాడ్-ఆన్ నంబర్లను, ఒక రెగ్యులర్ మరియు వన్ డేటా ఓన్లీలను ఉచితంగా అందిస్తోంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 125GB నెలవారీ డేటాతో పాటుగా 200GB వరకు డేటా రోల్‌ఓవర్‌తో అందిస్తుంది. అలాగే ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో వస్తుంది.

ఎయిర్‌టెల్ 'మీ & మై ఫ్యామిలీ' రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
రూ.999 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులకు నాలుగు ఉచిత యాడ్-ఆన్ కనెక్షన్లు లభిస్తాయి. ఇందులో మూడు రెగ్యులర్ మరియు ఒక డేటా యాడ్-ఆన్ ఉంటాయి. ఈ నాలుగు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో వస్తాయి. ఎయిర్టెల్ కనెక్షన్లు అధికంగా ఉన్న కుటుంబానికి ఇది సరైన పోస్ట్ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ వినియోగదారులకు 200GB వరకు డేటా బెనిఫిట్ ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ 'మీ & మై ఫ్యామిలీ' రూ.1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
రూ.1,599 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రీమియం సమర్పణను మరియు ఒక ఉచిత యాడ్-ఆన్ (రెగ్యులర్) ను అందిస్తుంది. అలాగే 200GB వరకు డేటా రోల్‌ఓవర్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లతో పాటుగా 500GB డేటా బెనిఫిట్‌తో ఈ ప్లాన్ లబిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ ఉచితంగా 200 ISD నిమిషాలు మరియు IR ప్యాక్‌లపై 10% ఆఫ్ అందిస్తుంది.
పైన పేర్కొన్న ఈ మూడు ప్లాన్‌లు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్, షా అకాడమీ లైఫ్‌టైమ్ యాక్సెస్, జగ్గర్‌నాట్ బుక్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం మరియు వింక్ ప్రీమియం వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ రివార్డులకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.


Click it and Unblock the Notifications








