Airtel టెలికాం నుంచి ఈ నెలలో ఉపయోగకరంగా ఉన్న ప్లాన్‌లు ఇవే

|

ఇండియాలోని టెలికాం సంస్థలలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న జియోపై భారతి ఎయిర్‌టెల్ తన యొక్క ఆధిపత్యాన్ని గత మూడు నెలలుగా చెలాయిస్తున్నది. ప్రస్తుతం నెమ్మదిగా రిలయన్స్ జియో కంటే లాభపడుతూ ఉండడమే కాకుండా దేశంలోని నంబర్ వన్ టెలికం ఆపరేటర్‌ స్థానాన్ని పొందడానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ఇందుకోసం టెల్కో తన వినియోగదారులకు అద్భుతమైన ప్రయోజనాలతో కొత్త కొత్త ప్లాన్ లను అందించడం ప్రారంభించింది.

భారతి ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ టన్నుల కొద్దీ ప్రయోజనాలతో పలు రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇప్పటికి ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న వారికి అధిక డేటా అవసరం ఉంది. అటువంటి వారు 3GB రోజువారీ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవడం ఉత్మమంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ సంస్థ 3GB రోజువారి డేటా ప్రయోజనంతో మూడు అపరిమిత ప్లాన్‌లను కలిగి ఉంది. ఇది అందించే ఇతర ఉచిత ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ 3GB రోజువారీ డేటాను రూ.398 చౌకైన ధర వద్ద నుండి అందిస్తుంది. ఇది దేశంలోని అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటుగా రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో మాత్రమే లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, ఉచిత హెలొటూన్స్, షా అకాడమీతో 1 సంవత్సరాల ఉచిత కోర్సులు మరియు ఫాస్టాగ్ లావాదేవీపై రూ .100 క్యాష్‌బ్యాక్ వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ.448 ప్లాన్ ప్రయోజనాలు
 

3GB రోజువారీ డేటాతో లభించే ఎయిర్‌టెల్ యొక్క రెండవ ప్లాన్ 448 రూపాయల ధర వద్ద లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ కూడా 28 రోజుల చెల్లుబాటుతో మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్ కు మరియు రూ.398 ధర వద్ద లభించే ప్లాన్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఒక సంవత్సరం ఉచిత యాక్సిస్ తో డిస్నీ + హాట్స్టార్ విఐపి అదనపు ప్రయోజనం. ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, ఉచిత హెలొటూన్స్, షా అకాడమీతో 1 సంవత్సరాల ఉచిత కోర్సులు మరియు ఫాస్టాగ్ లావాదేవీపై రూ .100 క్యాష్‌బ్యాక్ వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ.558 ప్లాన్ ప్రయోజనాలు

3GB రోజువారీ డేటాతో చివరగా లభించే ఎయిర్‌టెల్ యొక్క రూ.558 ప్లాన్ కూడా దేశంలోని అన్ని నెట్ వర్క్ లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటుగా రోజుకు 100 SMS ‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల సుదీర్ఘ చెల్లుబాటుతో లభిస్తుంది. ఎయిర్‌టెల్ టెల్కో 3GB రోజువారీ డేటాను ప్రయోజనంను జియో (రూ. 999 ప్లాన్) మాదిరిగా గరిష్ట 84 రోజుల చెల్లుబాటుతో అందించే ప్లాన్ లేదు. కస్టమర్‌లు మెరుగైన యాక్సిస్ తో అధిక డేటాను అందించే ప్లాన్‌ల కోసం వెతుకుతున్నందున ఇది కొద్దిగా నిరుత్సాహపరుస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, ఉచిత హెలొటూన్స్, 1 సంవత్సరం షా అకాడమీ ఉచిత కోర్సులు మరియు ఫాస్టాగ్ లావాదేవీపై రూ .100 క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ నుండి యూజర్లు కూడా ప్రయోజనం పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Bharti Airtel Some Useful 3GB Daily Data Prepaid Plans: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X