రెండు రోజులు వాట్సప్ బంద్

Written By:

బ్రెజిల్లో రెండు రోజుల పాటు వాట్సప్ మెసెంజర్ను సస్పెండ్ చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో సహకరించడంలో వాట్సప్ అనేకసార్లు విఫలమౌతోందంటూ సావో పాలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పుతో రెండు రోజుల పాటు బ్రెజిల్లో వాట్సప్ సేవలు అందుబాటులో లేకుండా పోనున్నాయి.

Read more: మళ్లీ వార్తల్లోకెక్కిన బాహుబలి

రెండు రోజులు వాట్సప్ బంద్

వాట్సప్పై రెండురోజుల పాటు సస్పెన్షన్ విధించడం పట్ల బ్రెజిల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వాట్సప్ మెసెంజర్ను ఫేస్బుక్ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బ్రెజిల్ ఇంటర్నెట్ వినియోగదారుల్లో 93 శాతం మంది వాట్సప్ను వాడుతున్నారు. ఫేస్బుక్ సీఈవో జుకర్బర్గ్ కోర్టు తీసుకున్న తీవ్ర నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Read more: దూసుకెళ్తున్న ఫ్లిప్ కార్ట్ ,పేటిఎం

రెండు రోజులు వాట్సప్ బంద్

'ఇది బ్రెజిల్కు బాధాకరమైన రోజు. ప్రజల వ్యక్తిగత సమాచార రక్షణకు వాట్సప్ ప్రాధాన్యత ఇవ్వడం ఫలితంగా ఈ తీర్పు వచ్చింది. బ్రెజిల్లోని ప్రతి వాట్సప్ వినియోగదారుడిని ఓ సింగిల్ జడ్జ్ ఈ నిర్ణయంతో శిక్షించాడు.

రెండు రోజులు వాట్సప్ బంద్

ఈ పరిస్థితిని బ్రెజిల్ కోర్టులో త్వరగా మారుస్తాయని మేం ఆశిస్తున్నాం. మీరు బ్రెజీలియన్ అయితే, మీ ప్రజల కోరికకు అనుకూలంగా మీ ప్రభుత్వం పనిచేసేలా సహాయం చేస్తూ మీ గొంతు వినిపించండి' అని జుకర్ అన్నారు.

English summary
Here Write Brazil court orders WhatsApp messaging to be suspended
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot