Home
News

BSNL Cashback ఆఫర్ : మెసేజ్ పంపడం ద్వారా క్యాష్‌బ్యాక్

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) గత నెలలో ప్రకటించిన ఆరు పైసల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను మరింత సరళీకృతం చేసింది. గత నెల చివర్లో లాంచ్ చేయబడిన వినియోగదారులకు ఈ ఆఫర్ కేవలం వాయిస్ కాల్స్ మీద ఆరు పైసలు క్యాష్‌బ్యాక్‌ను అందించే విధంగా రూపొందించబడింది.

క్యాష్‌బ్యాక్

అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని ఆపరేటర్ ఇప్పుడు వినియోగదారులకు SMS మెసేజ్ పంపడం ద్వారా కూడా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందటానికి అనుమతిస్తుంది. క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందటానికి ఎక్కువ మంది వినియోగదారులను ప్రోత్సహించడమే తమ సరికొత్త ప్రణాళిక అని బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.

బిఎస్ఎన్ఎల్

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్రయోజనం ద్వారా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 9478053334 కు "ACT 6 పైసా" అనే SMS మెసేజ్ ను పంపడం ద్వారా ఆరు పైసలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇంతకు ముందు వినియోగదారులు క్యాష్‌బ్యాక్ సంపాదించడానికి కనీసం ఐదు నిమిషాలు వాయిస్ కాల్ చేయవలసి ఉంటుంది కానీ ఇప్పుడు ఒక మెసేజ్ పంపడం ద్వారా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

FTTH

ముఖ్యంగా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ BSNL వైర్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ మరియు ఫైబర్-టు-హోమ్ (FTTH) చందాదారులకు వర్తిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో లభిస్తుంది.

జియో

రిలయన్స్ జియో చేసిన ఒక ప్రకటనకు ప్రతిచర్యగా బిఎస్ఎన్ఎల్ యొక్క ఆరు పైసల క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రారంభించబడింది. జియో ముంబైకి చెందిన టెల్కో మరియు ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసే చందాదారులకు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయడం ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ మార్పు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్ణయించిన ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి) లో ఒక భాగమని టెల్కో పేర్కొంది.

ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియో

క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం దేశంలో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను కూడా జోడించి ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఆపరేటర్ ఇటీవల గత వారం 210 రోజుల చెల్లుబాటు కాలానికి 2GB రోజువారీ డేటా ప్రయోజనాలతో రూ.998 ప్రీపెయిడ్ ప్లాన్ ను మరియు రూ.365 మరియు రూ.97 ల ధర వద్ద 2 జీబీ రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ మెసేజ్ లను అందించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రారంభించింది.

Best Mobiles in India

English summary
BSNL 6 Paise Cashback Can Be Availed By Sending An SMS
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X