జియోఫైబర్ సిల్వర్ ప్లాన్‌కు పోటీగా BSNL 600GB బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

|

BSNL టెలికాం రంగంలోనే కాకుండా బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా ఇప్పుడు తన సత్తా చాటుకుంటోంది. ప్రస్తుత కాలంలో 100 Mbps గరిష్ట వేగాన్ని అందించే బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్ లలో BSNL కూడా ఉంది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు 1 Gbps హై-స్పీడ్ ప్లాన్స్ లేకపోవడం వల్ల జియోఫైబర్‌ను ఇష్టపడుతున్నారు. MTNL ఇటీవల డిల్లీ నగరంలో 1 Gbps ప్రణాళికలను ప్రారంభించింది. కాని BSNL తన చందాదారులకు తీసుకువచ్చే సంకేతాలు మాత్రం లేవు.

బిఎస్‌ఎన్‌ఎల్
 

బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు తన చందాదారులకు 600GB బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను 849 రూపాయల ధరతో అందిస్తోంది. ఇది జియో ఫైబర్ యొక్క సిల్వర్ ప్లాన్‌ అందిస్తున్న అన్ని ప్రయోజనాలకు పోటీగా ఉంది. FUP పరిమితి విభాగంలో బిఎస్‌ఎన్‌ఎల్ జియోఫైబర్‌ను ఓడిస్తుండడంతో పాటు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో కాస్త వెనుకంజలో ఉంది. పూర్వం కేవలం 50mbps వేగంతో మాత్రమే డేటాను అందిస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క భారత్ ఫైబర్ ప్లాన్‌లలో భాగమైనప్పటికీ 600GB డేటా ప్లాన్‌కు రోజువారీ డేటా పరిమితి లేదు. ఈ విషయంలో మాత్రం ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందరికంటే పైచేయి ఉంది. మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

BSNL 600GB బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ VS జియోఫైబర్ సిల్వర్ ప్లాన్

BSNL 600GB బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ VS జియోఫైబర్ సిల్వర్ ప్లాన్

ఈ రెండు ప్లాన్‌ల ధర రూ.849 వద్ద ఉంటుంది. కాని ప్రయోజనాల విషయం మాత్రం రెండు ఒకేలా ఉండవు. బిఎస్‌ఎన్‌ఎల్ 50mbps వేగంతో నెలవారీ ఎఫ్‌యుపి పరిమితి 600 జిబి డేటాను అందిస్తోంది. FUP తరువాత దీని వేగం 2 mbps కు తగ్గుతుంది. మరోవైపు జియోఫైబర్ యొక్క సిల్వర్ ప్లాన్ 100 mbps వేగంతో 200GB వరకు డేటాను అందిస్తుంది. కొత్త కస్టమర్లు మొదటి ఆరు నెలలలో అదనపు 200GB డేటాను కలుపుకొని మొత్తంగా 400GB డేటా ప్రయోజనాన్ని పొందుతారు. జియోఫైబర్ స్పీడ్స్ విభాగంలో పైచేయి సాధించింది. కాని అదే నెలవారీ అద్దెకు బిఎస్ఎన్ఎల్ 50% ఎక్కువ FUP డేటాను అందిస్తోంది.

ఇతర ప్రయోజనాలు

ఇతర ప్రయోజనాలు

డేటా ప్రయోజనంతో పాటు రెండు ప్లాన్‌లు ఫిక్సడ్-లైన్ వాయిస్ కాలింగ్ సర్వీస్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తాయి. JioFiber లో JioFixedVoice సర్వీస్ ఉంది. దీనిని ఉపయోగించి కుటుంబంలోని ఆరు మందికి వారి స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్ చేయడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది. దీని లాగే బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వాయిస్ కాల్స్ చేయడానికి బిఎస్‌ఎన్‌ఎల్ వింగ్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

యాప్ యాక్సిస్ వివరాలు
 

యాప్ యాక్సిస్ వివరాలు

ఎంటర్టైన్మెంట్ విభాగంలో బిఎస్ఎన్ఎల్ యొక్క 600GB బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తమ కస్టమర్లకు రూ.999 విలువైన ఒక సంవత్సరపు అమెజాన్ ప్రైమ్ చందాను ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతం జియోఫైబర్ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా జియోసినిమా మరియు జియోసావన్ యాప్ లను ఆస్వాదించగలుగుతారు. జియోఫైబర్ సిల్వర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మూడు నెలల OTT యాప్ చందాలను అందిస్తుందని రిలయన్స్ జియో తెలిపింది.

సెక్యూరిటీ డిపాజిట్‌

సెక్యూరిటీ డిపాజిట్‌

ఇన్స్టాలేషన్ మరియు సెక్యూరిటీ డిపాజిట్‌ విషయాలకు వస్తే జియోఫైబర్ తన కొత్త కస్టమర్ల నుండి మొత్తంగా రూ.2,500 వసూలు చేస్తోంది. ఇందులో రూ.1,500లు మళ్ళి తిరిగి ఇవ్వబడుతుంది. అదనంగా రూ.1,000లు ఇన్‌స్టాలేషన్ ఛార్జీలుగా చెల్లించవలసి ఉంటుంది. ఇందులో భాగంగా జియోఫైబర్ వినియోగదారులకు 2.4 GHz రౌటర్‌ను అందిస్తుంది. ఈ రౌటర్‌ను మీ అకౌంట్ ను మూసివేసే సమయంలో తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. బిఎస్‌ఎన్‌ఎల్ విషయానికి వస్తే దీని సెక్యూరిటీ డిపాజిట్‌ కేవలం రూ.849లు. అలాగే ఇన్‌స్టాలేషన్ ఛార్జీల కోసం అదనంగా రూ.250 వసూలు చేస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ కొన్ని సర్కిల్‌లలోని వినియోగదారులకు స్మార్ట్‌హోమ్ వై-ఫై ఒఎన్‌టి పరికరాన్ని కూడా అందిస్తోంది.

క్యాష్‌బ్యాక్ ఆఫర్

క్యాష్‌బ్యాక్ ఆఫర్

చివరగా ఇందులో వార్షిక ప్లాన్ ఆఫర్లు కూడా ఉన్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క 600 జిబి ప్లాన్‌ను ఒక సంవత్సరానికి ఎంచుకునే కస్టమర్లు దానికి అయే ఖర్చు మొత్తంలో 20% క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అలాగే జియోఫైబర్‌ యొక్క సిల్వర్ ప్లాన్‌పై కూడా వార్షిక ఆఫర్ ఉంది. ఇందులో భాగంగా సంస్థ యొక్క అన్ని OTT యాప్ లకు ఒక సంవత్సరం పాటు సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తుంది. అదనంగా కస్టమర్లు మరో మూడు ఆఫర్లను ఎంచుకోవడానికి అర్హులు అవుతారు. ఇందులో మొదటిది 1,299 రూపాయల విలువైన థంప్ 2- 12W బ్లూటూత్ స్పీకర్ లేదా రెండు నెలల అదనపు సర్వీస్ లేదా డబుల్ డేటా బెనిఫిట్ ప్రతి నెల సంవత్సరం పొడవునా ఎంచుకోవచ్చు. JioFiber యొక్క వార్షిక ప్లాన్ వినియోగదారులు పైన పేర్కొన్న మూడు ఆఫర్లలో దేనినైనా ఎంచుకోవచ్చు కాబట్టి దాని ఎంపిక వినియోగదారుపై ఆధారపడి ఉంటుంది. JioFiber BSNL వలే క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అమలు చేయడం లేదు. ఇది కొంతమంది వినియోగదారులను నిరాశపరుస్తుంది.

తీర్పు

తీర్పు

డేటాను అందించడంలో వేగం పరంగా చూసుకుంటే జియోఫైబర్ మెరుగ్గా ఉంటుంది. కాని ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వంటి ఇతర ప్రయోజనాలు మరియు వార్షిక చందాపై క్యాష్‌బ్యాక్ విషయంలో బిఎస్ఎన్ఎల్ మెరుగ్గా ఉంది. జియోఫైబర్ విషయంలో ఇన్స్టాలేషన్ ఛార్జీలు BSNL తో పోటీకి దగ్గరగా కూడా లేవు. మీరు సంవత్సరం మొత్తం అధిక వేగంతో డేటాను పొందాలనుకుంటే కనుక జియోఫైబర్ యొక్క సిల్వర్ ప్లాన్‌ను ఎంచుకోని అందులోని డబుల్ డేటా ఆఫర్‌ను ఎంచుకోవడం చాలా ఉత్తమం. ఇది FUP డేటా పరిమితిని మరో 4800GB వరకు పెంచుతుంది. మీరు నెలవారీ ప్లాన్ కోసం వెళుతుంటే అప్పుడు BSNL 600GB FUP ప్లాన్ ను ఎంచుకోవడం చాలా మంచిది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL 600GB Broadband Plan vs JioFiber Silver Plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X