రెండు నెలల అదనపు వాలిడిటితో BSNL RS.1,699 ప్రీపెయిడ్ ప్లాన్‌

|

BSNL తన వినియోగదారుల కోసం కొన్ని ఆసక్తికరమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది. అయినప్పటికి ఇంకా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరో ప్రత్యేకమైన అడుగు వేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ టెలికం ఆపరేటర్ ఇప్పుడు తన రూ.1,699 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై రెండు నెలల అదనపు వాలిడిటిను అందిస్తోంది.

బిఎస్ఎన్ఎల్
 

గతంలో బిఎస్ఎన్ఎల్ 1,699 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులకు తన అన్ని రకాల ప్రయోజనాలను అందించింది. అయితే ఈ తాజా మార్పుతో చెల్లుబాటు కాలం ఇప్పుడు 425 రోజులకు పొడిగించబడింది. చందాదారులు నవంబర్ 30 లోపు తమ నంబర్‌ను రూ.1,699తో రీఛార్జ్ చేసుకుంటేనే ఈ రెండు నెలల ఈ అదనపు వాలిడిటిను ఆస్వాదించవచ్చు.

 ప్రీపెయిడ్ ప్లాన్‌

ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్ ప్రతిరోజూ ఉచిత స్థానిక మరియు జాతీయ కాల్‌లను 250 నిమిషాల క్యాపింగ్‌తో అందిస్తున్నది. దీనితో పాటు రోజుకు 100SMSలు మరియు 2GB రోజువారీ డేటాను ఈ ప్లాన్ కింద అందిస్తున్నది. అదనపు డేటా ప్రయోజనంలో భాగంగా చందాదారులకు నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో 1 జిబి అదనపు డేటా లభిస్తుంది. అంటే ఈ రెండు నెలలో రోజుకు 3GB డేటాను పొందవచ్చు.

మారుతం ప్లాన్

మారుతం ప్లాన్

బిఎస్ఎన్ఎల్ తన రూ .1,188ల మారుతం ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలాన్ని కూడా పొడిగించింది. ఈ ప్లాన్ అక్టోబర్ 23 వరకు చెల్లుబాటు అవుతుందని గతంలో చెప్పబడింది కాని కంపెనీ దాని చెల్లుబాటును మరొక 90 రోజులకు పొడిగించింది. అంటే ఇప్పుడు ఈ ప్లాన్ జనవరి 21, 2020 వరకు అందుబాటులో ఉంది.

మారుతం ప్లాన్ ప్రయోజనాలు
 

మారుతం ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ యొక్క మారుతం ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ రోజుకు 250 నిమిషాల క్యాప్ తో గల అపరిమిత స్థానిక మరియు జాతీయ కాలింగ్‌ను అందిస్తుంది. ఇందులో 5GB డేటా ప్రయోజనం కూడా ఉంది. కాకపోతే ఇది మొత్తం 345 రోజుల చెల్లుబాటు కాలానికి అందించబడుతుంది.

క్యాష్‌బ్యాక్ ఆఫర్

క్యాష్‌బ్యాక్ ఆఫర్

బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్ల విషయానికి వస్తే చందాదారులు తాము మాట్లాడే ప్రతి ఐదు నిమిషాల వాయిస్ కాల్‌లకు 6 పైసలను తమ అకౌంట్ లో క్రెడిట్ చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్ గత వారం ప్రకటించింది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ BSNL యొక్క వైర్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ మరియు FTTH వినియోగదారులు అందరికి వర్తిస్తుంది. జియో నుండి మరొక నెట్‌వర్క్‌కు అవుట్‌గోయింగ్ కాల్‌ల కోసం నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తుంటే జియో యొక్క తాజా చర్యకు వ్యతిరేకంగా BSNL ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యం.

BSNL & MTNL

BSNL & MTNL

ముంబై, డిల్లీలో నివసిస్తున్న MTNL వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్ ప్రకటించింది. MTNL అనేది డిల్లీ మరియు ముంబై సర్కిళ్లలో పనిచేస్తున్న ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. ఇది రూ.429, రూ.485 మరియు రూ.666 అనే మూడు ప్లాన్లను కలిగి ఉన్నాయి. రూ. 429 ప్లాన్ ఎమ్‌టిఎన్‌ఎల్‌తో సహా అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజుకు 1జిబి డేటాను 81 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే రూ.485ల ప్లాన్ 90 రోజుల చెల్లుబాటు కోసం ఉచిత కాల్స్ మరియు రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది. రూ .666 ప్లాన్‌ కూడా ఉచిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజుకు 1.5GB డేటాను కూడా అందిస్తుంది. దీని చెల్లుబాటు కాలం 122 రోజులు.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL RS.1,699 Prepaid Plan Comes With Two Months Extra Service

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X