Home
News

BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న ఆఫర్ల మీద ఓ లుక్ వేయండి....

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క రూ.499 ప్రమోషనల్ లభ్యతను 2020 జూన్ 29 వరకు పొడిగించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బిఎస్ఎన్ఎల్ ప్రారంభించిన రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 100GB డేటాను 20Mbps వేగంతో అందిస్తుంది.

భారత్ ఫైబర్

ఇంతకు ముందు ఈ ప్లాన్ యొక్క లభ్యత పరిమిత కాలంలో మార్చి 31, 2020 వరకు మాత్రమే ప్రవేశపెట్టారు. ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) అయిన బిఎస్ఎన్ఎల్ తన సరసమైన భారత్ ఫైబర్ ప్లాన్ లభ్యతను మరికొంత కాలం విస్తరించింది. ఇది భారత్ ఫైబర్ లైనప్‌లో భాగం కాబట్టి రూ.499 ప్లాన్ బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ల్యాండ్‌లైన్ సర్వీస్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంను కూడా అందిస్తుంది. 100GB FUP పరిమితి పూర్తయిన తర్వాత వినియోగదారులు 2 Mbps వేగంతో బ్రౌజ్ చేయవచ్చు.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ 499 భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ 499 భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ వివిధ ప్రచార ప్లాన్ లను ప్రారంభించడానికి ప్రసిద్ది చెందింది. అందులో భాగమే రూ.499 భారత్ ఫైబర్ ప్లాన్. ఈ పరిమిత కాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 20 Mbps వేగంతో మొత్తంగా ఒక నెల చెల్లుబాటు కాలానికి 100GB FUP పరిమితి డేటాను అందిస్తుంది. FUP తర్వాత దీని యొక్క వేగం 2 Mbpsకు తగ్గించబడుతుంది. 100GB FUP పరిమితిని అయిపోయిన తర్వాత వినియోగదారులు 2 Mbps వేగంతో అపరిమిత డేటాను బ్రౌజ్ చేయవచ్చు. ఈ ప్లాన్ చందాదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.

ఇతర ప్రయోజనాలు

ఇతర ప్రయోజనాలు

అండమాన్ & నికోబార్ వినియోగదారులు మినహా అన్ని సర్కిల్‌లలో దీనిని పొందవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్ జూన్ 29, 2020 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ చందాను ఉచితంగా అందించదు. అలాగే దీనిని నెలవారీ ప్రాతిపదికన మాత్రమే పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్ రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ చందాను రూ.399 పైన ఉన్న అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అందిస్తోంది. వినియోగదారులు ఒక సంవత్సరం లాంగ్ వాలిడిటీ ప్లాన్‌లను ఎంచుకుంటే దీనికి లోబడి ఉంటుంది. అయితే రూ.499 భారత్ ఫైబర్ ప్లాన్ నెలవారీ సభ్యత్వం ద్వారా మాత్రమే లభిస్తుంది.

భారత్ ఫైబర్ ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

భారత్ ఫైబర్ ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లైనప్‌లో రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పాటు అద్భుతమైన ప్రయోజనాలను అందించే మరిన్ని ప్లాన్ లు కూడా ఉన్నాయి. రూ.499 ప్లాన్‌తో బిఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రస్తుతం ఎనిమిది భారత్ ఫైబర్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి. వీటి యొక్క ధరలు వరుసగా రూ .499, రూ .777, రూ .849 , రూ.1,277, రూ.2,499, రూ.4,499, రూ. 5,999, రూ .9,999, రూ.16,999.

బిఎస్‌ఎన్‌ఎల్ ప్రమోషనల్ ఆఫర్‌

బిఎస్‌ఎన్‌ఎల్ ప్రమోషనల్ ఆఫర్‌

బిఎస్‌ఎన్‌ఎల్ పరిమిత కాల ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా కొన్ని ప్లాన్ లను కూడా అందిస్తోంది. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా చెన్నై, తమిళనాడు సర్కిల్‌లలో రూ.1,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క అన్ని భారత్ ఫైబర్ ప్లాన్‌లు కనీసం 50Mbps వేగంతో మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో వస్తాయి.

Best Mobiles in India

English summary
BSNL Bharat Fibre Broadband Plan Availability Extends: Check Full Details Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X