తెలంగాణ సర్కిల్‌లలోని BSNL యూజర్లకు గుడ్ న్యూస్!!! మరొక కొత్త ప్లాన్

|

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన యొక్క సేవలతో ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ప్లాన్ లను దశల వారిగా అన్ని ప్రాంతాలలో విడుదల చేస్తున్నది. ఆపరేటర్ 200Mbps ప్లాన్‌ను ఇప్పుడు తెలంగాణ సర్కిల్‌లో "ఫైబ్రో కాంబో ULD 1999 CS55" ప్లాన్ పేరుతో ప్రవేశపెట్టారు.

తెలంగాణలో BSNL 200Mbps ప్లాన్‌
 

తెలంగాణలో BSNL 200Mbps ప్లాన్‌

ఆపరేటర్ ప్రారంభంలో తన 200 Mbps ప్లాన్‌ను జనవరిలో తెలంగాణ మరియు చెన్నై సర్కిల్‌లలో ప్రవేశపెట్టారు. తరువాత 200Mbps ప్లాన్‌ను తమిళనాడులోని పాండిచేరితో సహా ఇతర సర్కిల్‌లలో కూడా ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ సర్కిల్‌లలో 200Mbps ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్ తన సైట్‌లో ప్రకటించింది.

BSNL ఫైబ్రో కాంబో ULD 1999 CS55 ప్లాన్ వివరాలు

BSNL ఫైబ్రో కాంబో ULD 1999 CS55 ప్లాన్ వివరాలు

BSNL తెలంగాణ సర్కిల్‌లలో కొత్తగా ప్రారంభించిన ఫైబ్రో కాంబో ULD 1999 CS55 ప్లాన్ తో వినియోగదారులు 1500GB వరకు డేటాను 200Mbps వేగంతో బ్రౌజ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. డేటా యొక్క పరిమితి దాటిని తర్వాత డేటా యొక్క వేగం 2Mbps ‌కు తగ్గించబడుతుంది. ఇతర BSNL ప్లాన్‌ల మాదిరిగానే ఆపరేటర్ ఫైబ్రో కాంబో ULD 1999 CS55 ప్లాన్‌కు సభ్యత్వం పొందిన వినియోగదారులకు అపరిమిత స్థానిక మరియు STD కాల్‌లను కూడా అదనంగా అందిస్తుంది. BSNL వినియోగదారులు నెలకు రూ.1999 ధర వద్ద ఫైబ్రో కాంబో ULD 1999 CS55 ప్లాన్‌ యొక్క సభ్యత్వాన్ని పొందవచ్చు.

BSNL ఫైబ్రో కాంబో ULD 1999 CS55 ప్లాన్ ధరల వివరాలు
 

BSNL ఫైబ్రో కాంబో ULD 1999 CS55 ప్లాన్ ధరల వివరాలు

BSNL తన వినియోగదారులకు కొత్త ప్లాన్‌ను 6నెలలు, సంవత్సరం, రెండు సంవత్సరాలు మరియు మూడు సంవత్సరాల చందాలతో కూడా అందుబాటులో ఉంది. ఫైబ్రో కాంబో యుఎల్‌డి 1999 సిఎస్ 55 ప్లాన్ యొక్క సెమీ-వార్షిక ప్యాక్‌కు సభ్యత్వంను రూ.11,994 ధర వద్ద, ఒక సంవత్సరం ప్యాక్ ధర రూ.23,988 వద్ద పొందవచ్చు. అలాగే ఈ ప్లాన్ యొక్క రెండు మరియు మూడు సంవత్సరాల సభ్యత్వం ప్యాక్‌లను వరుసగా రూ.47,976 మరియు రూ.71,964 ధర వద్ద పొందవచ్చు.

తెలంగాణలో బిఎస్ఎన్ఎల్ FTTH సేవలు

తెలంగాణలో బిఎస్ఎన్ఎల్ FTTH సేవలు

బిఎస్ఎన్ఎల్ ఆపరేటర్ తన భారత్ ఫైబర్ సేవలను తెలంగాణ సర్కిల్‌లో విస్తరించడానికి ఫ్రాంచైజ్ ప్లేయర్‌లను ఆహ్వానిస్తున్నారు. జూలై ప్రారంభంలో ఆపరేటర్ హైదరాబాద్ సర్కిల్‌లోని ఫ్రాంచైజ్ ఆటగాళ్లకు "కొత్త వ్యాపార అవకాశాన్ని" అందించింది. హైదరాబాద్‌లోని ఫ్రాంచైజ్ కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకునే "వ్యాపార భాగస్వాములకు" "ఆకర్షణీయమైన భాగస్వామ్య ఒప్పందం" ఇవ్వబడుతుందని ఒక ప్రకటనలోని ఆపరేటర్ హైలైట్ చేశారు. "ఫైబర్ టు హోమ్ ఎక్విప్మెంట్" యొక్క సంస్థాపనతో పాటు వ్యాపార భాగస్వాములు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తారని ప్రకటన తెలిపింది. జూన్‌లో తెలంగాణ సర్కిల్‌లోని వరంగల్ ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఇలాంటి టెండర్ జారీ చేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Brings Back 200 Mbps Speed Plan in the Telangana Circle

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X