BSNL Broadband: రోజుకు 22GB డేటాతో కొత్త ప్లాన్!!! అందుబాటు ధరలోనే...
ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ముందు నుంచి అద్భుతమైన సేవలను అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. BSNL మరికొంత మందిని మరియు ఇప్పుడు ఉన్న వారిని ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త డేటా మరియు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను పరిచయం చేస్తూనే ఉంది.

BSNL కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
BSNL సంస్థ అందిస్తున్న ప్లాన్ లలో వినియోగదారులు ఇష్టపడే ముఖ్యమైన విషయం ఖచ్చితంగా దాని యొక్క అద్బుతమైన ప్రయోజనాలు. బిఎస్ఎన్ఎల్ తన అభిమానులకు ఇప్పుడు మరోక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. BSNL 22GB CUL పేరుతో వచ్చే ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అపరిమిత డేటా మరియు అపరిమిత కాలింగ్ వంటి ప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL 22GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలు
BSNL కొత్తగా ప్రారంభించిన 22GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ జూలై 1, 2020 నుండి అమల్లోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 10 Mbps డౌన్‌లోడ్ వేగంతో రోజువారి 22GB పరిమిత డేటాను అందిస్తుంది. దీని తరువాత ఇంటర్నెట్ వేగం 2 Mbps కు తగ్గించబడుతుంది. ఇందులో వేరే ప్రత్యేక డేటా పరిమితి లేదు కాబట్టి వినియోగదారులు ఈ ప్లాన్ కొనుగోలు చేస్తే అపరిమిత డేటాను పొందుతారు.

BSNL 22GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధరల వివరాలు
అండమాన్ మరియు నికోబార్ దీవుల మినహా ప్రతి టెలికాం సర్కిల్‌లలోను బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క కొత్త 22GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందుబాటులో ఉంది. కాబట్టి ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే వినియోగదారులకు మొత్తంగా నాలుగు ఎంపికలు ఉన్నాయి. మొదటిది నెలవారీ ఛార్జ్ విధానంలో ప్రతి నెలవారీ ఛార్జీ 1,299 రూపాయలు. రెండవది వార్షిక చెల్లింపు ఎంపిక. దీని కోసం వినియోగదారులు మొత్తం ఒక సంవత్సరం చెల్లుబాటుకి రూ.12,990 చెల్లించి పొందవచ్చు. నెలవారీ చెల్లింపుతో పోలిస్తే మొత్తం చెల్లుబాటు కాలానికి రూ.2,598 ఆదా అవుతుంది.

BSNL 22GB CUL బ్రాడ్‌బ్యాండ్ లాంగ్ టర్మ్ ప్లాన్ ధరలు
బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు కొత్త 22GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను 2 సంవత్సరాల మరియు 3 సంవత్సరాల ముందస్తు చెల్లింపు ఎంపికను కూడా పొందవచ్చు. ఈ ఎంపికలలో వారు ఇంకా పెద్ద మొత్తంలో తగ్గింపును పొందుతారు. 2 సంవత్సరాల ప్లాన్ కోసం వినియోగదారులు రూ.24,681 చెల్లించాల్సి ఉంటుంది అలాగే 3 సంవత్సరాల ప్లాన్ కోసం రూ.36,372 చెల్లించవలసి ఉంటుంది.

BSNL 22GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇతర ప్రయోజనాలు
BSNL 22GB CUL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను కొనుగోలు చేసిన కస్టమర్ 1GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ తో అనుబంధించబడిన ఒక ఉచిత ఇమెయిల్ చిరునామా అకౌంటును పొందుతారు. దానితో పాటు వినియోగదారులు సంవత్సరానికి రూ.2,000 చెల్లించి ఒక స్టాటిక్ ఐపి చిరునామాను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. ప్రతి ప్లాన్ మాదిరిగానే బిఎస్‌ఎన్‌ఎల్ కూడా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ప్రతి కస్టమర్ బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను పొందుతారు మరియు ఇది అపరిమిత కాలింగ్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








