Home
News

150 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో బెస్ట్ ఛాయస్ ఇవే....

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో మన జీవితంలో ఒక భాగంగా మారింది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను పొందిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మీరు కూడా మరింత సురక్షితమైన మరియు స్థిరమైన వేగంగా లభించే ఇంటర్నెట్ కనెక్షన్‌ను పొందాలనుకుంటే కనుక బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం.

బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌

బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌

గత కొన్ని సంవత్సరాల నుండి అనేక ప్రైవేట్ కంపెనీలు వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను అందిస్తున్నాయి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను పొందడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. యు బ్రాడ్‌బ్యాండ్, యాక్ట్ ఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ వంటి సంస్థలు ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతాలలో అద్భుతమైన ఆఫర్లతో వివిధ రకాల ధరల వద్ద కొన్ని ప్లాన్లను అందిస్తున్నాయి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లభించిన తర్వాత దాని యొక్క ప్లాన్‌ను ఎంచుకోవడం ముఖ్యమైన అంఖం. మీరు ప్రత్యేకంగా 150 Mbps స్పీడ్ తో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే వాటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

You బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల వివరాలు

You బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల వివరాలు

యు బ్రాడ్‌బ్యాండ్ సంస్థ తన సేవలను భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అందిస్తున్నది. ఇది దేశంలోని ఉత్తమ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. దీని యొక్క ప్లాన్‌ల ధరల వివరాలు ఒకొక ప్రాంతాలను బట్టి మారుతూ ఉన్నాయి.

You బ్రాడ్‌బ్యాండ్ 150 Mbps ప్లాన్ వివరాలు

You బ్రాడ్‌బ్యాండ్ 150 Mbps ప్లాన్ వివరాలు

యు బ్రాడ్‌బ్యాండ్ సంస్థ తన వినియోగదారులకు 150 Mbps వేగంతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను అందిస్తున్నది. మీరు ఒకవేళ నవీ ముంబై , హైద్రారాబాద్ ప్రాంతంలో నివసిస్తుంటే కనుక 90 రోజుల చెల్లుబాటుతో 150Mbps వేగంతో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ.3,182 ధర వద్ద పొందవచ్చు. దీని మొత్తం చెల్లుబాటు కాలంలో మీరు 3000GB డేటాను పొందుతారు. అలాగే చెన్నైలో ఉన్న వారు ఈ 150Mbps స్పీడ్ ప్లాన్‌ను రూ.3,357 ధర వద్ద 97 రోజుల చెల్లుబాటు కాలంతో పొందవచ్చు. ఇది మొత్తం చెల్లుబాటు కాలంలో 4101GB డేటాను అందిస్తుంది.

ACT ఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల వివరాలు

ACT ఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల వివరాలు

ACTఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ ముందు నుంచి అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్న మరొక గొప్ప ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లలో ఒకటి. ఇది కూడా ఇండియాలోని అన్ని నగరాలలో తమ సేవలను అందిస్తున్నది. ACT ఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ తన కొన్ని ప్లాన్‌లతో OTT సేవలను కూడా ఉచితంగా అందిస్తున్నది.

ACT ఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ 150 Mbps ప్లాన్ వివరాలు

ACT ఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ 150 Mbps ప్లాన్ వివరాలు

ACT ఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ యొక్క 150 Mbps వేగంతో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కోరుకునే వారికి మంచి ఎంపికలు ఉన్నాయి. మీరు బెంగళూరులో నివసిస్తుంటే కనుక నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనంతో వచ్చే ‘ఆక్ట్ స్టార్మ్' ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇది 150 Mbps వేగంతో 650GB నెలవారీ డేటాను అందిస్తుంది. దీని ధర కేవలం రూ.1,185 మాత్రమే. హైద్రారాబాద్ మరియు చెన్నైలో నివసించే వారి కోసం ACT బ్రాడ్‌బ్యాండ్ యొక్క 150 Mbps స్పీడ్ ప్లాన్ ధర మారుతుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనంతో వచ్చే ‘ఆక్ట్ బ్లాస్ట్ ప్రోమో' ప్లాన్‌ను రూ.1,075 ధర వద్ద పొందవచ్చు. ఇది 1000GB నెలవారీ డేటాను 150Mbps వేగంతో లభిస్తుంది. ఇతర నగరం మరియు ప్రాంతంలో దాని ప్లాన్ లు మరియు వాటి ధరలు భిన్నంగా ఉంటాయి.

BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ రంగంలో కూడా అద్భుతమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తున్నది. ఇది 10Mbps నుండి 300Mbps వేగం వరకు వివిధ ధరల వద్ద చాలా రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తున్నది. ఇది దేశం మొత్తం మీద తన సర్వీసులను కలిగి ఉంది.

BSNL బ్రాడ్‌బ్యాండ్ 150 Mbps ప్లాన్ వివరాలు

BSNL బ్రాడ్‌బ్యాండ్ 150 Mbps ప్లాన్ వివరాలు

బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ తన వినియోగదారులకు ‘ఫైబ్రో కాంబో ULD 1999 CS 311' పేరుతో 150Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 1500GB డేటాను పొందుతారు. దీని తరువాత దీని వేగం 2 Mbps కు తగ్గించబడుతుంది. ప్రస్తుతానికి ఈ ప్లాన్ బెంగళూరులో నివసించే ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనితో వినియోగదారులు అపరిమిత కాల్స్ యొక్క టెలిఫోన్ లైన్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్ నెలకు రూ.1,999 ధర వద్ద లభిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలు మరియు టెలికాం సర్కిల్‌లలో బిఎస్‌ఎన్‌ఎల్ తన 150Mbps స్పీడ్ ప్లాన్‌ను అందించనున్నది.

Best Mobiles in India

English summary
BSNL Broadband vs ACT Fibernet vs You Broadband: Plans and Offers Comparison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X