BSNL Add-on ప్యాక్‌లలో కొత్త మార్పులు!!! డబుల్ డేటా ప్రయోజనం....
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఇప్పుడు తన ఎడిఎస్ఎల్ మరియు ఫైబర్-టు-హోమ్ (FTTH) సేవలకు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను సవరించింది. ఈ ఆపరేటర్ ఇప్పుడు అదే ధర వద్ద 100% అదనపు డేటాను అందిస్తోంది.

BSNL యాడ్-ఆన్ ప్యాక్
వినియోగదారు ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) పరిమితిని దాటిని తర్వాత కూడా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ యొక్క స్పీడ్ ను పెంచుకోవడానికి యాడ్-ఆన్ ప్యాక్‌లను వినియోగదారులు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆపరేటర్ ఇప్పుడు నాలుగు ప్రధాన స్పీడ్ రిస్టోరేషన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను కలిగి ఉంది. వీటి యొక్క ధరలు రూ .50 నుండి 250 రూపాయలలోపు ఉంటాయి. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ఎఫ్‌యుపి డేటా మార్పుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Samsung Galaxy M11 & M01: బడ్జెట్ ధరలో కొత్త ఫోన్‌లు!!! నేటి నుంచే సేల్స్...

బిఎస్ఎన్ఎల్ స్పీడ్ రిస్టోరేషన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.50 ధర గల బేస్ స్పీడ్ రిస్టోరేషన్ యాడ్-ఆన్ ప్యాక్ మునుపటి నెలల్లో అందిస్తున్న 2GB డేటాతో పోలిస్తే ఇప్పుడు 5GB డేటాను అందించే విధంగా సవరించబడింది. వినియోగదారులు ఈ 5GB పరిమితిని అధిక వేగంతో బ్రౌజ్ చేయవచ్చు. అదేవిధంగా స్పీడ్ పునరుద్ధరణలో భాగంగా 5GB ప్లాన్ ను ఇప్పుడు 12GB అదనపు పరిమితికు సవరించబడింది. స్పీడ్ రిస్టోరేషన్ 12 జిబి ప్లాన్‌ను దాని మునుపటి ధర 100 రూపాయల ధర వద్దనే అందిస్తూనే ఉంది. Airtel, JioFiber: ప్రత్యేక ప్రయోజనాలతో 1Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

బిఎస్ఎన్ఎల్ టాప్ టైర్డ్ యాడ్-ఆన్ ప్యాక్‌లు
బిఎస్ఎన్ఎల్ తన టాప్ టైర్డ్ యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా సవరించింది. వీటిలో స్పీడ్ రిస్టోరేషన్ 10GB ప్లాన్ ను స్పీడ్ రిస్టోరేషన్ ప్లాన్ కింద 20GB డేటాకు పెంచారు. అయితే ఈ ప్లాన్ ను మునుపటి రూ.150 ధర వద్దనే అందిస్తున్నారు.స్పీడ్ పునరుద్ధరణలో 10 జిబి ప్లాన్‌ను స్పీడ్ రిస్టోరేషన్ 20 జిబి ప్లాన్ అని పిలుస్తారు. ఇప్పుడు వినియోగదారులు 20GB అదనపు డేటాను అధిక వేగంతో బ్రౌజ్ చేయగలుగుతారు.

బిఎస్ఎన్ఎల్ 40GB యాడ్-ఆన్ ప్యాక్
బిఎస్ఎన్ఎల్ యొక్క టాప్ టైర్డ్ యాడ్-ఆన్ ప్యాక్‌లలో గల మరొక ప్లాన్ మునుపటి నెలలో రూ.250 ధర వద్ద 20GB డేటాను అందించేది. అయితే స్పీడ్ రిస్టోరేషన్ కింద ఈ 20GB డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ను 40GB అదనపు డేటాకు సవరించారు. అంటే ఇప్పుడు వినియోగదారులు అదే ధర వద్ద డబుల్ డేటాను పొందుతున్నారు.

బిఎస్ఎన్ఎల్ స్పీడ్ రిస్టోరేషన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్ లభ్యత
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ కొత్త ప్లాన్‌లను వినియోగదారులు BSNL FUP టాప్ అప్ సైట్ మరియు BSNL పోర్టల్ సెల్ఫ్ కేర్ సైట్‌లో పొందవచ్చు. FUP పరిమితిని చేరుకున్న BSNL వినియోగదారులు అధిక వేగంతో బ్రౌజింగ్ కొనసాగించడానికి BSNL FUP టాప్ అప్ సైట్‌ను ఓపెన్ చేసి ఈ కొత్త ప్లాన్లతో రీఛార్జ్చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








