Airtel, JioFiber: ప్రత్యేక ప్రయోజనాలతో 1Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

|

ప్రస్తుతం మరొక నెల పాటు ఇండియాలో లాక్ డౌన్ ను పొడిగించిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అధిక వేగంతో డేటాను అందించే వారి ప్రత్యేక 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మీద అద్భుతమైన ఆఫర్ల మీద ఇస్తున్నారు.

1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఇవి కొనడానికి చాలా ఖరీదైనప్పటికి దీని యొక్క ధరకు తగ్గట్టుగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇతరులతో సంబంధం లేకుండా కేవలం ఒకే ఒక వై-ఫై నెట్‌వర్క్‌కు చాలా మంది కనెక్ట్ అయ్యే కార్యాలయాలు వంటి ప్రదేశాలలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. Samsung Galaxy M11 & M01: బడ్జెట్ ధరలో కొత్త ఫోన్‌లు!!! నేటి నుంచే సేల్స్...

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు

ఎయిర్‌టెల్, స్పెక్ట్రా, జియో, ACT, మరియు ఎమ్‌టిఎన్‌ఎల్ వంటివి కూడా తమ వినియోగదారులకు 1Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో కొన్ని ఉత్తమ ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ ప్రతి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాన్‌తో ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తున్నారో తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Vodafone Idea Rs.251 Data Voucher: అధిక డేటా వినియోగదారులకు సరైన ప్లాన్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 1Gbps ప్లాన్‌ను రూ .3,999 ధర వద్ద అందిస్తుంది. ఇది టెల్కో నుండి వస్తున్న అత్యంత ఖరీదైన ప్లాన్ దీనిని సంస్థ యొక్క విఐపి ప్లాన్ అని కూడా అంటారు. ఇది 1 Gbps వేగంతో అపరిమిత డేటా ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఫైబర్ యొక్క ఈ ప్లాన్‌లతో అపరిమిత ఇంటర్నెట్ అంటే సుమారు 3.3TB డేటాను అందిస్తుంది. Facebook "Collab app": ఫేస్‌బుక్ నుంచి మరో కొత్త వీడియో యాప్...

ఎయిర్‌టెల్ ఫైబర్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ ఫైబర్ ప్లాన్ ప్రయోజనాలు

దీని తరువాత ఫైబర్ ప్లాన్ యొక్క డేటా స్పీడ్ తగ్గించబడుతుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక నెల వ్యవధిలో వినియోగించడానికి అధిక మొత్తం డేటా. అలాగే ఇది అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ ప్రయోజనమును కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఈ ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్, Zee5 ప్రీమియం, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను కూడా ఉచితంగా అందిస్తుంది.

ACT 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ACT 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ACT నుండి వస్తున్న 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను ACT గిగా అని కూడా అంటారు. ఇది నెలవారీ పరిమితికి మొత్తంగా 3500GB డేటాను అందిస్తుంది. ఈ మొత్తం డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ యొక్క వేగం 5 Mbps కి తగ్గించబడి అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ధర ఒక నెలకు రూ.5,999. ACT యొక్క సర్వీస్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి నగరంలో అందుబాటులో లేదు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇదే ప్లాన్‌ను చెన్నైలో 2,999 రూపాయలకు, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5,999 రూపాయల ధర వద్ద సంస్థ ఆఫర్ చేస్తున్నారు.

జియోఫైబర్ 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

జియోఫైబర్ 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి అడుగుపెట్టిన జియోఫైబర్ కూడా తన వినియోగదారులకు 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది. దీనిని వినియోగదారులకు టైటానియం ప్లాన్ అనే పేరుతో రూ.8,499 నెలవారీ ధర వద్ద అందిస్తున్నది. ఇది ప్రతి నెలా సుమారు 5000GB డేటా ప్రయోజనంను అందిస్తుంది. అలాగే మొదటిసారి రీఛార్జ్ చేసిన వినియోగదారులకు 5000GB అదనపు ప్రయోజనం కూడా లభిస్తుంది. కాబట్టి మీరు ప్లాన్ కోసం మొదటిసారి చందా పొందినప్పుడు 10000GB డేటాను పొందుతారు.

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫైబర్ 1 Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో సంవత్సరానికి 1,200 రూపాయల విలువైన టీవీ వీడియో కాల్స్ మరియు సున్నా లేటెన్సీ గేమింగ్ వంటి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి. అలాగే హోమ్ గేట్‌వే + ఎస్‌టిబి మరియు వినోదం OTT యాప్ లతో పాటు VR అనుభవం మరియు ప్రీమియం కంటెంట్‌ని కూడా పొందుతారు. రూ.3,999 ధర వద్ద జియోఫైబర్ ప్లాటినం ప్లాన్ ను కూడా అందిస్తున్నది. ఇది నెలకు 1Gbps వేగంతో 2500GB డేటా ప్రయోజనంను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel, JioFiber, ACT Fibernet Offers 1Gbps Broadband Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X