Samsung Galaxy M11 & M01: బడ్జెట్ ధరలో కొత్త ఫోన్‌లు!!! నేటి నుంచే సేల్స్...

|

శామ్సంగ్ సంస్థ ఈ రోజు ఇండియాలో తన తాజా గెలాక్సీ M 1 మరియు గెలాక్సీ M 01 బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లను ఇప్పుడు అన్ని శామ్‌సంగ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌తో పాటు ఆన్‌లైన్ స్టోర్స్‌ నుండి కొనుగోలు చేయవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ

శామ్‌సంగ్ గెలాక్సీ

అలాగే ఈ రోజు నుంచి వినియోగదారులు శామ్‌సంగ్.కామ్ మరియు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ పోర్టల్స్ ద్వారా కూడా వీటిని పొందవచ్చు. కొత్తగా ప్రారంభించిన శామ్‌సంగ్ గెలాక్సీ M 11 మరియు గెలాక్సీ M 01 యొక్క అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు మధ్యాహ్నం 3:00 గంటల నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.  Realme Smart TV: గొప్ప ఆఫర్లతో నేటి నుంచే మొదటి సేల్ ప్రారంభం....

శామ్సంగ్ గెలాక్సీ M 1 మరియు గెలాక్సీ M 01 ధరల వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ M 1 మరియు గెలాక్సీ M 01 ధరల వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ M 1 ను రెండు వేరియంట్లలో విడుదల అయ్యింది. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ బేస్ మోడల్ యొక్క ధర రూ.10,999. అలాగే 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.12,999. ఇది బ్లూ,బ్లాక్ మరియు వైలెట్ వంటి మూడు కలర్లలో లభిస్తుంది. మరోవైపు శామ్‌సంగ్ గెలాక్సీ M01 ను కేవలం ఒకే ఒక వేరియంట్ లో విడుదల చేసారు. 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.8,999. ఇది బ్లాక్,బ్లూ మరియు రెడ్ కలర్ ఎంపికలలో లభిస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ M 11 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M 11 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M11 ఫోన్ 19.5: 9 కారక నిష్పత్తితో 6.4-అంగుళాల HD + డిస్ప్లే ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 తో వన్ యుఐ 2.0 మరియు స్నాప్‌డ్రాగన్ 450 SoC తో రన్ అవుతుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్నాలజీ మద్దతు గల 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ M 11 కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ M 11 కెమెరా సెటప్

శామ్సంగ్ గెలాక్సీ M 11 ఫోన్ యొక్క వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్ ఏపర్చర్ తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ తో సెకండరీ కెమెరా మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో గల మూడవ కెమెరా అమర్చబడి ఉన్నాయి. అలాగే దీని ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ M 11 ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M 11 ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M 11 ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. తాజా శామ్‌సంగ్ ఫోన్ 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, GPS/ A-GPS, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ల మద్దతును కలిగి ఉన్నాయి. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ M01 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M01 స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M01 స్నాప్‌డ్రాగన్ 439 SoC మరియు ఆండ్రాయిడ్ 10 పై UI 2.0 తో రన్ అవుతుంది. ఇది 5.71-అంగుళాల HD + డిస్ప్లే ను 19.5: 9 కారక నిష్పత్తితో ఇన్ఫినిటీ-వి డిస్ప్లే ప్యానెల్ కలిగి ఉంది. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్నాలజీ మద్దతు గల 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీని వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో f / 2.2 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా అమర్చబడి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ M01 ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M01 ఫీచర్స్

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు FM రేడియోలకు మద్దతు ఇస్తుంది. మైక్రో-యుఎస్‌బి పోర్ట్, మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M11 & Galaxy M01 Launched in India: Price, Specifications, Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X