Home
News

Tata Sky బ్రాడ్‌బ్యాండ్ 300Mbps స్పీడ్ అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు!!!ధర కూడా తక్కువే...

ఇండియాలో డిటిహెచ్ రంగంలో టాటా స్కై అద్భుతమైన సేవలను అందిస్తూ అధిక మంది వినియోగదారులను కలిగి ఉండి పరిశ్రమలో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ ఆపరేటర్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా తన ఇంటర్నెట్ ఆఫర్లతో కస్టమర్ బేస్ను మరింత సమర్థవంతంగా పెంచుకోవడానికి కృషి చేస్తున్నది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

టాటా స్కై ఇప్పుడు తన వినియోగదారుల కోసం పరిమితి మరియు అన్‌లిమిటెడ్ డేటా రెండింటి ప్రయోజనాలతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లను 1 నెల, 3 నెలలు, 6 నెలలు మరియు 12 నెలల చెల్లుబాటు కాలంతో కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. టాటా స్కై అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఇంటర్నెట్ యొక్క వేగం 300Mbps వరకు ఉంది. టాటా స్కైకి పోటీగా ఉన్న ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వంటివి 1 Gbps వరకు డేటా వేగాన్ని అందిస్తుంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న అన్‌లిమిటెడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

1 నెల చెల్లుబాటుతో గల టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

1 నెల చెల్లుబాటుతో గల టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

టాటా స్కై యొక్క నెలవారి బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీలో నాలుగు ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటి ప్లాన్ యొక్క ధర 950 రూపాయలు. ఇది 25 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. రెండవ ప్లాన్ 1,050 రూపాయల ధర వద్ద వస్తుంది. ఇది అపరిమిత డేటాను 50 Mbps వేగంతో అందిస్తుంది. మూడవ ప్లాన్ రూ.1,150 ధర వద్ద అపరిమిత డేటాను 100 Mbps వేగంతో అందిస్తుంది. చివరి ప్లాన్ రూ.1,900 ధర వద్ద అపరిమిత డేటాను 300 Mbps వేగంతో అందిస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని కూడా డేటా రోల్‌ఓవర్ మరియు ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను కలిగి ఉండదు.

3 నెలల చెల్లుబాటుతో గల టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

3 నెలల చెల్లుబాటుతో గల టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

టాటా స్కై మూడు నెలల బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీలో నాలుగుప్లాన్‌లను అందిస్తున్నది. ఇందులో మొదటి ప్లాన్ రూ.2,700 ధర వద్ద 25 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. రెండవ ప్లాన్ రూ.3,000 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 50 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. మూడవ ప్లాన్ 100 Mbps వేగంతో అపరిమిత డేటా ప్రయోజనాలను రూ.3,300 ధర వద్ద అందిస్తుంది. చివరి ప్లాన్ రూ.5,400 ధరను కలిగి ఉండి 300 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని మీకు ఉచిత రౌటర్, ఉచిత ఇన్‌స్టాలేషన్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

6 నెలల చెల్లుబాటుతో గల టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

6 నెలల చెల్లుబాటుతో గల టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఆరు నెలల చెల్లుబాటుతో గల ప్లాన్‌లను కొనుగోలు మీద 10% వరకు తగ్గింపును అందిస్తుంది. ఇందులో మొదటి ప్లాన్ రూ.4,860 ధర వద్ద 25 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. రెండవ ప్లాన్ రూ.5,400 ధర వద్ద 10% తగ్గింపుతో 50 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. మూడవ ప్లాన్ రూ.5,940 ధర వద్ద 100 Mbps వేగంతో అపరిమిత డేటాను అందించగా నాల్గవ ప్లాన్ రూ.9,720 ధర వద్ద 300 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ లాంగ్ టర్మ్ అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ లాంగ్ టర్మ్ అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు

టాటా స్కై యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ ప్లాన్‌లను ఎంచుకున్న వారికి వాటి యొక్క ధరలో 15% వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో మొదటి ప్లాన్ రూ.9,180 ధర వద్ద 25 Mbps వేగంతో లభిస్తుంది. రెండవ ప్లాన్ రూ.10,200 ధర వద్ద 50 Mbps వేగంను , మూడవ ప్లాన్ రూ.11,220 ధర వద్ద 100 Mbps వేగంతో మరియు రూ.18,360 ధర వద్ద గల ప్లాన్ 300 Mbps వేగంతో లభిస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని కూడా అపరిమిత డేటాను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Tata Sky Broadband Plan 1,900 Gives 300 Mbps Speed with Unlimited Data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X