BSNL యూజర్లకు OTT చందాల కోసం అందుబాటులో కొత్త సర్వీస్...
ఇండియాలో ప్రభుత్వం నేతృత్వంలో పనిచేసే ఏకైక టెల్కో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు వైర్డు బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లను అధికంగా కోల్పోతోంది. అదే సమయంలో ఈ వైర్‌లెస్ చందాదారుల సంఖ్యను భారతి ఎయిర్‌టెల్ తన వృద్ధిలో భాగంగా ఆకర్షిస్తున్నది. అయితే చందాదారులను ఆకర్షించడానికి బిఎస్ఎన్ఎల్ 'సినిమా ప్లస్' వంటి కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఇది అన్ని రకాల OTT చందాలను ఒకే ప్యాకేజీగా కలుపుతుంది.

బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం OTT యాడ్-ఆన్ ప్యాక్‌లు ‘సినిమా ప్లస్‘ ప్యాక్లుగా లభిస్తాయి. ఇందులో ప్రాథమికంగా ‘యుప్ టివి స్కోప్ ఎంటర్టైన్మెంట్' సర్వీస్ లభిస్తుంది. ప్రస్తుతానికి బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు నెలకు కేవలం రూ.129 ధర వద్దనే 'సినిమా ప్లస్' ప్యాక్ ను అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్‌ఎన్‌ఎల్ సినిమా ప్లస్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ధరల వివరాలు
బిఎస్‌ఎన్‌ఎల్ సినిమా ప్లస్ ప్రస్తుతం ‘ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ' అనే పేరుతో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ యుప్ టివి స్కోప్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ గా కూడా లభిస్తుంది. ఇది రూ.129 ధర వద్ద లభిస్తూ యుప్ టివి, Zee5, సోనీలైవ్ మరియు వూట్ వంటి నాలుగు OTT చందాలను కలుపుతూ లభిస్తుంది. యుప్ టివి స్కోప్ / బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ అనేది ఒకేచోట OTT సభ్యత్వాలను కలుపుతుంది. సాధారణంగా రూ.199 ధర వద్ద లభించే అన్ని రకాల ప్రయోజనాలను యూజర్లు ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా రూ.129 ధర వద్ద పొందవచ్చు.

బిఎస్‌ఎన్‌ఎల్ సినిమా ప్లస్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ OTT సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు
యుప్ టివి స్కోప్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ అందించే OTT సబ్స్క్రిప్షన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 100 కంటే ఎక్కువ లైవ్ టివి ఛానెళ్ళను అందించే యుప్ టివి చందా, మరియు 80 కి పైగా లైవ్ టివి ఛానెల్స్, 500+ టివి సిరీస్, ఒరిజినల్ టివి షోలు మరియు 2000 కి పైగా సినిమాలను కలిగి ఉన్న ZEE5 చందాను పొందుతారు. వీటితో పాటుగా 15+ లైవ్ టీవీ ఛానెల్‌లు మరియు 200+ సినిమాలతో కూడిన సోనీలైవ్ చందాను కూడా పొందుతారు. చివరగా వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వూట్ సభ్యత్వాన్ని పొందుతారు. ఇది 35 ఛానెళ్ల లైవ్ టివిని చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అలాగే ఇందులో 400 కి పైగా సినిమాలు ఉన్నాయి.

YuppTV స్కోప్ యాప్ సబ్స్క్రిప్షన్
బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు సినిమా ప్లస్ ప్యాక్‌కు సభ్యత్వాన్ని పొందిన తరువాత యూజర్లు YuppTV స్కోప్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ YuppTV స్కోప్ యాప్ ఆండ్రాయిడ్ టివి మరియు అమెజాన్ ఫైర్‌టివి ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications