BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క బొనాంజా ఉచిత ఆఫర్స్ ....
ఇండియాలోని ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలలో పదేళ్ళకు పైగా జాబితాలో బిఎస్‌ఎన్‌ఎల్ అగ్రస్థానంలో నిలిచింది. ఏదేమైనా ఇటీవలి కాలంలో ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISP) భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందటం వలన దీనికి పోటీగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను ప్రవేశపెట్టడంతో పాటు ప్రభుత్వానికి చెందిన సంస్థకు ఎటువంటి ఎంపిక లేకుండా పోయింది.

సాధారణంగా క్రొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం చూస్తున్న చాలా మంది చందాదారులు ఎల్లప్పుడూ దీర్ఘకాలిక ప్రణాళికలను ఎంచుకుంటారు. ఎందుకంటే ఇవి అదనపు ప్రయోజనాలతో కూడి ఉంటాయి. బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఇటువంటి ప్రయోజనాలతో ఒక ఆఫర్‌ను రన్ చేస్తున్నది. ఇందులో భాగంగా కొత్త మరియు ఇప్పటికే ఉన్న వినియోగదారులు ఒకే ప్లాన్‌ను లాంగ్ టర్మ్ ప్లాన్ గా ఎంచుకోవడం ద్వారా నాలుగు నెలల అద్దెను ఉచితంగా పొందవచ్చు. కంపెనీ ఈ ఆఫర్‌ను ‘బొనాంజా' అని పిలుస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఈ ఆఫర్‌కు అర్హులు అవుతారు. బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల యొక్క పూర్తి నిబంధనలు మరియు షరతుల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌ల మీద ఉచిత సభ్యత్వం
బిఎస్ఎన్ఎల్ యొక్క విస్తృత శ్రేణి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు రూ.99 ధర నుండి ప్రారంభించి రూ.16,999 వరకు వివిధ రకాల ధరల వద్ద అందిస్తున్నది. బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రత్యేకమైన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు కొత్త కస్టమర్ల కోసం 777 రూపాయలు మరియు ప్రస్తుత వినియోగదారులకు 849 రూపాయల నుండి ప్రారంభమవుతాయి.

బిఎస్ఎన్ఎల్ బొనాంజా ఆఫర్
ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బొనాంజా ఆఫర్ విషయానికి వస్తే వినియోగదారులు 12 నెలల పాటు ఒకే ప్లాన్‌ను ఎంచుకుంటే అటువంటి వారికి ఒక నెల ఉచిత సేవను అందిస్తుంది. అలాగే దానిని 24 నెలలకు ఎంచుకుంటే కనుక బిఎస్ఎన్ఎల్ అదనంగా మూడు నెలల సేవలను ఉచితంగా అందిస్తుంది. అంటే ఇది మొత్తంగా 27 నెలల సర్వీసును అందిస్తుంది. చివరగా బిఎస్ఎన్ఎల్ చందాదారుడు 36 నెలల పాటు ఒకే ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక సంస్థ అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా మరో నాలుగు నెలల సేవలను అందిస్తుంది. అంటే ఇది మొత్తంగా 40 నెలల సర్వీసును అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యొక్క అన్ని సర్కిల్‌లలోని ల్యాండ్‌లైన్, డిఎస్‌ఎల్, భారత్ ఫైబర్, BB ఓవర్ వై-ఫై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఈ ఆఫర్ చెల్లుతుందని బిఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది.

BSNL బొనాంజా ఆఫర్‌ను ఎలా పొందాలి?
BSNL బొనాంజా ఆఫర్‌ను పొందాలనుకొనే క్రొత్త వినియోగదారులు కనెక్షన్ పొందటానికి కంపెనీ యొక్క టోల్ ఫ్రీ నంబర్ 18003451500 కు కాల్ చేయవచ్చు. అలాగే ప్లాన్‌ను ఎన్నుకునే సమయంలో వినియోగదారులు నాలుగు నెలల వరకు అదనపు సర్వీసుతో వచ్చే వార్షిక లేదా ద్వైవార్షిక లేదా త్రైమాసిక ప్లాన్‌లను ఎంచుకోవాలి. వినియోగదారులు కొత్త కనెక్షన్ అభ్యర్థనను నమోదు చేయడానికి సమీపంలోని BSNL కస్టమర్ పోర్టల్‌ను కూడా సందర్శించవచ్చు. ప్రస్తుతం ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు తమ సభ్యత్వాన్ని సెల్ఫ్-కేర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా సుబ్స్క్రిప్షన్ చేయవచ్చు మరియు నాలుగు నెలల వరకు ఉచిత సేవలను పొందవచ్చు.

బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
BSNL యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు వేర్వేరు వేగంతో మరియు వేర్వేరు ధరల వద్ద వస్తాయి. కంపెనీ అన్ని సర్కిల్‌లలో 1.5GB రోజువారీ డేటా మరియు 20 Mbps వేగంతో రూ .99 ప్లాన్‌ను అందిస్తోంది. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత వేగం 512 Kbps కి తగ్గించబడుతుంది. ఏదేమైనా సంస్థ యొక్క భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు కనీసం 50 Mbps వేగంతో, 170GB వరకు రోజువారీ డేటా ప్రయోజనం, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం అదనపు ఖర్చులు లేకుండా నెలవారీ సభ్యత్వం మరియు ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో అదనపు ఖర్చు లేకుండా వస్తాయి.


Click it and Unblock the Notifications








