Home
News

జియో ప్లాన్‌లకు సమానమైన డేటా బెనిఫిట్‌లతో BSNL పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలు

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక టెల్కో బిఎస్‌ఎన్‌ఎల్ గత నెలలో తన యొక్క ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో రూ.199, రూ.798, రూ.999 వంటి సరసమైన ప్లాన్లను జోడించడంతో పాటుగా తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కూడా సవరించింది. ప్రభుత్వ టెల్కో సవరించిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో రూ.399 మరియు రూ.525 ప్లాన్‌లు ఉన్నాయి. ఘర్ వాప్సీ పేరుతో పిలువబడే బిఎస్ఎన్ఎల్ రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ 70GB డేటా బెనిఫిట్ తో పాటు 210GB వరకు డేటా రోల్ఓవర్ సదుపాయాన్ని అందిస్తుంది.

BSNL

ప్రస్తుతానికి దీని యొక్క ప్రయోజనాలు రిలయన్స్ జియో యొక్క రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు సమానంగా ఉన్నాయి. జియో కూడా 200GB వరకు రోల్ఓవర్ సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తుంది. అయినప్పటికీ జియో తన అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో కొన్ని OTT చందాలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. అయితే BSNL అటువంటి ప్రయోజనాలను అందించడం లేదు. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.525 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలకు 85GB డేటా బెనిఫిట్‌తో పాటుగా 255GB వరకు డేటా రోల్‌ఓవర్‌ను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ సవరించిన దాని ప్రకారం కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రిలయన్స్ జియో మాదిరిగానే రూ.199 నుండి ప్రారంభమవుతాయి. ఈ కొత్త ప్లాన్‌లతో బిఎస్ఎన్ఎల్ ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని టెల్కోకు గట్టి పోటీని ఇస్తున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో రూ.399 ధర వద్ద అందించే ఘర్ వాప్సీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలకు 70GB డేటాను అందించడంతో పాటుగా 210GB వరకు రోల్‌ఓవర్ సదుపాయాన్ని అందిస్తుంది. అలాగే భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను అనుమతించదు.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో యొక్క రూ.599 ప్లాన్‌కు పోటీగా అద్భుతమైన డేటా ఆఫర్లను అందించే బిఎస్‌ఎన్‌ఎల్ యొక్కరూ.525 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు నెలకు 85GB డేటాను అందించడంతో పాటుగా 255GB వరకు రోల్‌ఓవర్ సదుపాయాన్ని అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.525 ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటుగా ఒక యాడ్-ఆన్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. అయితే అదనపు యాడ్-ఆన్‌కు డేటా ప్రయోజనం ఉండదు. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దాని పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో వాయిస్ కాలింగ్ మరియు డేటా యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా అందిస్తోంది.

జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

జియో టెల్కో సంస్థ రూ.399 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లో 75GB డేటా బెనిఫిట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇందులో యాడ్-ఆన్ కనెక్షన్లు ఏవి లేవు. రూ.399 ప్లాన్‌తో లభించే OTT చందాలలో రూ.199 విలువైన నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్, రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మరియు రూ.399 విలువైన డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ వంటివి ఉచితంగా అందిస్తున్నాయి. అలాగే రూ.599 ధర వద్ద లభించే జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్ 100GB డేటాతో పాటుగా 200GB రోల్‌ఓవర్ సౌకర్యం ప్రయోజనాలతో రవాణా అవుతుంది. మిగిలిన అన్ని ప్రయోజనాలు రూ.399 జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌కు సమానంగా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
BSNL New Postpaid Plans Offers Data Benefits Similar to Jio Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X