Jio VS BSNL న్యూ ఇయర్ ప్లాన్స్... ఈ ఆఫర్ల పోటీలో గెలుపు ఎవరిదీ?

|

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) టెలికాం ఆపరేటర్ కు దేశంలో బలమైన మరియు విలువైన 4G నెట్‌వర్క్ లేకపోయినప్పటికీ తన వినియోగదారుల కోసం ఇప్పటికీ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆకర్షణీయమైన ప్రయోజనాలతో అందిస్తుంది. చాలా సార్లు బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల నుండి వచ్చిన అన్ని కౌంటర్ ఆఫర్లను ట్రంప్ చేసాయి. ఇప్పుడు పోటీగా రిలయన్స్ జియోతో తలపడనున్నది.

 

జియో

ఇటీవల రిలయన్స్ జియో తన చందాదారుల కోసం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద టెలికం ఆపరేటర్ తన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.2,020 ధరతో అందిస్తుంది. అదే ధర పరిధిలో బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఈ రెండు ప్లాన్‌ల మధ్య పోలికల విషయానికి వస్తే రిలయన్స్ జియో అన్ని ఇతర ప్రీపెయిడ్ ఆపరేటర్ల మాదిరి చౌకైన డేటాను అందిస్తున్నప్పటికీ బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. వాటి గురించి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

పాత ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్పాత ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్

జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్
 

జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్

రిలయన్స్ జియో అందిస్తున్న న్యూ ఇయర్ ఆఫర్లలో భాగంగా తన వార్షిక ప్లాన్‌ను రూ.2,020ల ధర వద్ద అందిస్తోంది. ఈ కొత్త ఆఫర్‌తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు గొప్ప ప్రయోజనాలు పొందుతారు. ఈ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 1.5GB రోజువారీ డేటాను, రోజుకు 100 SMSలను మరియు జియో to జియో అపరిమిత కాలింగ్‌తో పాటు 12,000 నిమిషాల నాన్-జియో FUPను కూడా అందిస్తుంది. చందాదారులు రిలయన్స్ జియో యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను కూడా పొందుతారు. ఆఫర్ లేకుండా ఈ ప్లాన్ వినియోగదారులకు రూ.2,199 లకు లభిస్తుంది. అంటే చందాదారులు ఈ ప్లాన్ ద్వారా 120 రూపాయలను ఆదా చేయవచ్చు. రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ఆఫర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే అని గమనించాలి.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

పండుగ సందర్భ సమయంలో పరిమిత కాల ఆఫర్లను ప్రారంభించడానికి బిఎస్ఎన్ఎల్ ప్రసిద్ది చెందింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును ఇప్పుడు మరొక 60 రోజుల పాటు పొడిగించింది. అంటే ఈ ప్లాన్ ఇప్పుడు రీఛార్జ్ చేసిన తేదీ నుండి 425 రోజుల కాలానికి అన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

 

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్లను 2020లో ఆశించవచ్చువాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్లను 2020లో ఆశించవచ్చు

ప్రయోజనాల

ఇంక ప్రయోజనాల విషయానికొస్తే వినియోగదారులు ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 3 జిబి డేటా మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ మరియు బిఎస్ఎన్ఎల్ టివి చందాను ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ చందాల యొక్క చెల్లుబాటు 365 రోజులు మాత్రమే. ఈ ఆఫర్ 2019 డిసెంబర్ 25 నుండి 2020 జనవరి 31 వరకు అన్ని టెలికాం సర్కిల్‌లలో లభిస్తుంది.

 

 ముఖ్యమైన 26 ఛానెల్‌ల ధరలను తగ్గించిన టాటా స్కై ముఖ్యమైన 26 ఛానెల్‌ల ధరలను తగ్గించిన టాటా స్కై

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ 1,699 రూపాయల ధర వద్ద మొత్తం సంవత్సరం చెల్లుబాటుతో మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. రూ.1,699 ప్రీపెయిడ్ ప్లాన్ కింద చందాదారులు రోజుకు 2 జిబి డేటాను పొందుతారు.అలాగే ఇతర ఆపరేటర్లకు కాల్ చేయడానికి ప్రతిరోజూ 250 నిమిషాల పరిమిత కాల్ క్యాప్ తో వస్తుంది. అలాగే చందాదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

ప్రీపెయిడ్ ప్లాన్‌

రిలయన్స్ జియో అందిస్తున్న రూ.2,020 ప్రీపెయిడ్ ప్లాన్‌తో పోలిస్తే బిఎస్‌ఎన్‌ఎల్ నుండి రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ రూ.300ల తక్కువ ఖర్చు అవుతుంది. ధర వ్యత్యాసంతో పాటుగా రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌తో పోల్చితే బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ చాలా మంచి ఆఫర్లను అందిస్తున్నది. 365 రోజుల చెల్లుబాటు ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్న ఇతర టెలికాం ఆపరేటర్లతో పోల్చినప్పుడు దాదాపు 700 రూపాయల ధర వ్యత్యాసం ఉంది.

Best Mobiles in India

English summary
BSNL New Year Plan VS Jio News Year Plan: Check Price,Validity,Benefits and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X