జియో "హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్" వివరాలు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో పండుగల సందర్భాలలో వారి యొక్క చందాదారులకు మరియు కొత్త వినియోగదారుల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రారంభిస్తుందని అందరికి తెలిసిన విషయం. రిలయన్స్ జియో ఇప్పటికే కొన్ని ప్రసిద్ధ మాన్‌సూన్ ఆఫర్లు మరియు మరిన్నిటిని అందించింది.

ఈ సంవత్సరం చివరిలో రిలయన్స్ జియో వినియోగదారుల కోసం "హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను" విడుదల చేసింది. తాజాగా డేటా టారిఫ్ ప్లాన్‌ల పెంపుతో రిలయన్స్ జియో చందాదారులు ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద చాలా రకాలైన ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇవే కాకుండా పెంపును అందుకున్న ప్లాన్‌లు కూడా కొద్దిగా తగ్గింపు ధరకు లభిస్తాయి.

ఈ ఆఫర్‌లలో రెండు భాగాలు ఉంటాయి. అందులో ఒకటి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం మరియు మరొకటి కొత్త జియోఫోన్‌లను కొనుగోలుచేయాలనుకునే వినియోగదారుల కోసం. రిలయన్స్ జియో నుండి కొత్తగా వస్తున్న "హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్" గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్
రిలయన్స్ జియో అందిస్తున్న ఆఫర్లలో మొదటిది ఇప్పటికే జియో సిమ్ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల కోసం. ఇందులో భాగంగా రిలయన్స్ జియో తన వార్షిక ప్రణాళికను రూ.2,020ల ధర వద్ద అందిస్తోంది. రిలయన్స్ జియో వెబ్‌సైట్ కూడా ఇప్పటికే ఈ కొత్త ఆఫర్‌ను చూపిస్తున్నది. ఈ రోజు నుండి ఈ ప్లాన్‌ను ఉపయోగించి చందాదారులు రీఛార్జ్ చేసుకోవడానికి రిలయన్స్ జియో యొక్క వెబ్‌సైట్ లో ఇప్పటికే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ఆఫర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే అని గమనించాలి. అంటే సంవత్సరం మొత్తం చెల్లుబాటుతో రీఛార్జ్ పొందాలనుకునే చందాదారులు ఈ ప్లాన్‌ను తక్కువ రేటుకు పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 1.5GB రోజువారీ డేటాను, రోజుకు 100 SMSలను మరియు జియో to జియో అపరిమిత కాలింగ్‌తో పాటు 12,000 నిమిషాల నాన్-జియో FUPను కూడా అందిస్తుంది. చందాదారులు రిలయన్స్ జియో యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను కూడా పొందుతారు. ఆఫర్ లేకుండా ఈ ప్లాన్ వినియోగదారులకు రూ.2,199 లకు లభిస్తుంది. అంటే చందాదారులు ఈ ప్లాన్ ద్వారా 120 రూపాయలను ఆదా చేయవచ్చు.

కొత్త జియోఫోన్ వినియోగదారులకు జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్
రిలయన్స్ జియో నుండి వచ్చిన ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా మరొక కోణం కూడా ఉంది. ఇది జియోఫోన్‌ను పొందాలనుకునే కొత్త కస్టమర్ల కోసం ఈ ప్లాన్ వర్తిస్తుంది. రూ.2,020 ధర వద్ద వినియోగదారులు కొత్త జియోఫోన్ ను పొందగలుగుతారు. అలాగే చందాదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 500MB డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా చందాదారులు రిలయన్స్ జియో యొక్క అన్ని యాప్ లకు కూడా యాక్సిస్ ను పొందుతారు.

రిలయన్స్ జియో యొక్క చందాదారులు చాలా మంది దీర్ఘకాలిక ప్రణాళికలను ఇష్టపడతారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లాన్ లలో ఇవి తక్కువ ఖర్చుతో ఉంటాయి. అందువల్ల 365 రోజుల చెల్లుబాటుతో ఒక ప్రణాళికను పొందాలనుకునే జియో చందాదారులు ఈ ప్రణాళికను కొత్త ఆఫర్ కింద మంచి ప్రయోజనాలతో పొందవచ్చు.

ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు
డేటా టారిఫ్ ప్లాన్‌ల పెంపు తర్వాత ఇటీవలి కాలంలో రిలయన్స్ జియో ఇతర ఆపరేటర్లతో కలిసి తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను 40% పెంచింది. ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే ఈ ప్లాన్‌కు సమానమైన ప్రయోజనాలతో కూడిన ప్లాన్లు సుమారు 2,400 రూపాయలకు లభిస్తుంది.

ఏదేమైనా మరొక ఆపరేటర్స్ మరియు రిలయన్స్ జియోల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే అపరిమిత కాలింగ్ ఇప్పుడు జియో యొక్క అన్ని ప్లాన్‌లు దీనిని అందించడం లేదు. చందాదారులు తమ అకౌంట్లో 1,000 నిమిషాల నాన్-జియో అవుట్గోయింగ్ కాల్స్ మాత్రమే అందిస్తున్నారు. కాని జియో టు జియో కాల్స్ వినియోగదారులకు మాత్రం ఉచితంగా అపరిమిత కాల్స్ లను అందిస్తుంది. సంవత్సరకాల ప్లాన్‌లతో పాటు 84 రోజుల చెల్లుబాటు, మరియు 56 రోజుల చెల్లుబాటుతో జియో వివిధ రకాల ప్లాన్‌ల ఎంపికలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








