హాట్‌స్టార్,Voot యాప్ లను ఉచితంగా అందిస్తున్న జియోఫైబర్

|

రియోలెన్స్ జియో OTT యాప్ ల యొక్క చందా విషయంలో కొంత స్పష్టతను ఇచ్చింది. జియోఫైబర్ వినియోగదారులు వారు ఎంచుకొనే ప్లాన్లతో ఈ యాప్ లను పొందబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియోఫైబర్ వాణిజ్య ప్లాన్లు OTT యాప్ ల చందాలతో వస్తాయని ప్రకటించాయి. కాని కంపెనీ మరిన్ని వివరాలను తెలుపలేదు.

జియోఫైబర్

ఇప్పుడు రిలయన్స్ జియో నుండి ఒక అధికారిక అప్డేట్ లభించింది. రిలయన్స్ జియోఫైబర్ ప్లాన్ వినియోగదారులు కనీసం గోల్డ్ ప్లాన్‌లలో నాలుగు ప్రీమియం OTT యాప్ చందాల ద్వారా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వాటికి యాక్సెస్ పొందుతారు. ఇంకా చాలా OTT యాప్ల చందాలు త్వరలో తమ ప్లాట్‌ఫాంలో చేరుతాయని కంపెనీ తెలిపింది. వీటన్నిటిని జియోఫైబర్ వినియోగదారులకు జియో 4K సెట్-టాప్ బాక్స్ ద్వారా అందించబడతాయి.

 

నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లునెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

OTT

ఇవి వివిధ నగరాల్లోని వినియోగదారులకు కూడా ఇవి అందుబాటులో ఉంచబడుతున్నాయి. ఈ OTT సేవా సభ్యత్వాలతో క్రొత్త జియోఫైబర్ కనెక్షన్ ISP ఇతర కంటెంట్ ప్రొవైడర్లతో కూడా పనిచేస్తున్నందున ఎంపిక ఇప్పుడు చాలా పరిమితం. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్ అందిస్తున్న OTT యాప్ సభ్యత్వాలు

జియోఫైబర్ అందిస్తున్న OTT యాప్ సభ్యత్వాలు

రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రివ్యూ ఆఫర్ జియోఫైబర్ వినియోగదారులను పేమెంట్ ప్లాన్లకు తరలించే ప్రక్రియలో ఉంది. ప్రివ్యూ ప్లాన్ ఉన్న ప్రతి జియోఫైబర్ వినియోగదారుడు ఈ నెలాఖరులోగా పేమెంట్ ప్లాన్ కు తరలించబడతారు. జియో తన 4K సెట్-టాప్ బాక్స్ మరియు వాణిజ్య ప్లాన్ లను ప్రకటించినప్పుడు సంస్థ అన్ని వివరాలను అందించలేదు. కానీ నెమ్మదిగా జియో సెట్-టాప్ బాక్స్ గురించి మరియు ఇది ఎలా పనిచేస్తుందో వంటి వివరాలు తెలిపాము. ఇప్పుడు జియోఫైబర్ పేమెంట్ ప్లాన్ వినియోగదారులకు అందించబడుతున్న OTT సేవా సభ్యత్వాలకు సంబంధించి ఒక అధికారిక సమాచారం గురించి పూర్తి వివరాలు.

జియోఫైబర్

రిలయన్స్ జియోఫైబర్ వినియోగదారులు తమ ప్రణాళికలో భాగంగా హాట్‌స్టార్, SonyLIV, Voot మరియు JioCinema సభ్యత్వాలకు యాక్సిస్ ను పొందుతారు. రాబోయే రోజుల్లో Zee5, SUN NEXT వంటి చందాలను కూడా అందిస్తామని కంపెనీ తెలిపింది. హాట్‌స్టార్ విషయానికొస్తే రూ.365 విలువైన హాట్‌స్టార్ విఐపి సభ్యత్వాన్ని జియో ఉచితంగా అందిస్తోంది.

జియో సెట్-టాప్ బాక్స్

రిలయన్స్ జియో సెట్-టాప్ బాక్స్ ముందు ‘JioTV +' అనే యాప్ తో వస్తుంది. ఈ OTT యాప్ చందాలను STB లోపల పొందవచ్చు. సాధారణంగా JioTV + అనేది కంటెంట్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్. ఇది వివిధ యాప్ ల నుండి కంటెంట్‌ను కలుపుతుంది. అలాగే జియో STB పైన పేర్కొన్న OTT యాప్ లతో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ OTT సభ్యత్వాలను మరే ఇతర మొబైల్ / టీవీ / డెస్క్‌టాప్‌లో ఉపయోగించవచ్చో లేదో వంటి వివరాలు తెలియలసీ ఉంది.

జియోఫైబర్ OTT యాప్ లకు అర్హత గల ప్లాన్లు

జియోఫైబర్ OTT యాప్ లకు అర్హత గల ప్లాన్లు

రిలయన్స్ జియో ప్రస్తుతం మొత్తంగా ఆరు జియోఫైబర్ ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తోంది. ఈ ప్లాన్‌లు రూ.699 నుండి ప్రారంభమవుతాయి. జియో ఫైబర్ యొక్క రూ.899 ప్లాన్‌ ఒటిటి యాప్ చందాలను అందిస్తోంది. రూ.699 యొక్క బేస్ ప్లాన్ జియో సినిమా మరియు జియోసావ్న్ చందాలను మాత్రమే అందిస్తుంది. ఉదాహరణకు నెలవారీ ప్రాతిపదికన రూ.699 ప్లాన్‌ను ఎంచుకున్న జియోఫైబర్ వినియోగదారులు మొదటి మూడు సార్లు మాత్రమే జియో సినిమా మరియు జియోసావ్న్ చందాలను పొందుతారు. అన్ని OTT యాప్ చందాలు మొదటి మూడు సార్లు మాత్రమే అందించబడతాయి కాబట్టి ఇదే కేసు 849 JioFiber ప్లాన్‌కు వర్తిస్తుంది.

జియోఫైబర్

రూ. 699 జియోఫైబర్ ప్లాన్ వినియోగదారుడు ఒక సంవత్సరం ఎంచుకున్నప్పటికీ ఎటువంటి ప్రీమియం OTT యాప్ సభ్యత్వాలను అందించదు. కాబట్టి ఉత్తమ ఎంపిక ఏమిటంటే రూ.849 లేదా అంతకంటే ఎక్కువ జియోఫైబర్ ప్లాన్‌ను ఎంచుకోవడం. కానీ ఉత్తమ ప్రయోజనాలను ఆస్వాదించడానికి మీరు 1,249 రూపాయల జియోఫైబర్ గోల్డ్ ప్లాన్‌ను పొందడం అన్నిటికన్న ఉత్తమం.

Best Mobiles in India

English summary
JioFiber Offering Hotstar, Voot and 2 More OTT App Subscriptions at Free of Cost

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X