Home
News

BSNL 4G సేవలతో టెలికాం మార్కెట్ లో ఎటువంటి మార్పులు రానున్నాయో తెలుసా?

ఇండియా యొక్క ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకు దేశం అంతటా తన యొక్క 4G సేవలను ప్రారంభించలేదు. అయితే ఇటీవల 4 G సర్వీసెస్ లను పాన్-ఇండియా దేశం అంతటా ప్రారంభించినున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇది భారత టెలికాం రంగంలో గల ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీని ఇవ్వనున్నది. ప్రస్తుతానికి టెల్కో దాని పునరుద్ధరణ ప్యాకేజీ మరియు ఫిక్సడ్-లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల ద్వారా మనుగడ సాగిస్తోంది. టెల్కో యొక్క ప్రస్తుత 2G మరియు 3G నెట్‌వర్క్‌లను ఇప్పటికీ మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. కావున టెల్కో దాని ప్రస్తుత సాధారణ నెట్‌వర్క్‌లను మూసివేయకపోవచ్చు కానీ టెలికాం రంగంలోని పోటీని ఎదురుకోవడానికి 4G సేవలను ప్రారంభించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ APRU

బిఎస్ఎన్ఎల్ టెలికాం యొక్క 4G సేవల ప్రారంభంతో టెల్కో యొక్క వినియోగదారుల సగటు ఆదాయం (APRU) ప్రస్తుతం ఉన్న దాని కంటే మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే టెల్కో యొక్క మొత్తం సగటు ఆదాయాన్ని కూడా మరింత మెరుగుపరుస్తుంది. టెలికాం రంగంలోకి ప్రైవేట్ ఆపరేటర్లు రావడానికి ముందు రారాజులాగా ఉన్న బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభంతో తిరిగి అదే స్థానాన్ని పొందే అవకాశం ఉంది.

బిఎస్ఎన్ఎల్ 4G సేవలతో మార్కెట్ లో పోటీ

బిఎస్ఎన్ఎల్ 4G సేవలతో మార్కెట్ లో పోటీ

బిఎస్ఎన్ఎల్ టెల్కో ఇప్పుడు హైబ్రిడ్ 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించడంపై ఎక్కువగా దృష్టి సారించింది. డిపార్ట్మెంట్ అఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తో ఇదే విషయాన్ని తెలియజేసింది. కానీ దీనికి ఆపరేటర్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. బిఎస్ఎన్ఎల్ హైబ్రిడ్ 4G సేవలతో రావడానికి అనుమతిస్తే కనుక రాబోయే 10 నెలల్లో 4G సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రైవేట్ టెల్కో వినియోగదారులతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ యూజర్లకు తక్కువ ధర వద్దనే మెరుగైన డేటా పొందే అవకాశం ఉంది.

టెలికాం మార్కెట్ లో BSNL స్థానం

టెలికాం మార్కెట్ లో BSNL స్థానం

ప్రైవేట్ ఆపరేటర్లు అన్ని కూడా ప్రస్తుతం BSNL ని తమకు ముప్పుగా అస్సలు భావించారు. ఏది ఏమైనప్పటికీ Vi టెల్కో మాత్రం ప్రతి త్రైమాసికంలోను తన యొక్క చందాదారులను భారీ సంఖ్యలో కోల్పోతోంది. బిఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ టెల్కో 4Gని లాంచ్ చేసి ప్రత్యేకమైన ఆఫర్‌లతో వినియోగదారులకు తక్కువ ధర వద్దనే యూజర్లకు కావలసిన సేవలను అందిస్తే కనుక అది తన మార్కెట్ వాటాను వేగంగా పెంచుకోగలదు.

BSNL హైబ్రిడ్ 4G ప్లాన్‌లు

BSNL హైబ్రిడ్ 4G ప్లాన్‌లు

ప్రస్తుత సమయంలో ప్రతి టెల్కో కూడా తన యొక్క వినియోగదారులకు దూకుడుగానే ఆఫర్లను అందిస్తూ మరింత చురుకుగా ప్రవర్తిస్తున్నాయి. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ చౌకైన 4Gని అందిస్తుంటే కనుక టెల్కోలు సుంకం పెంపు గురించి కూడా ఆలోచించటానికి ఇష్టపడరు. బిఎస్‌ఎన్‌ఎల్‌ను తన హైబ్రిడ్ 4G ప్లాన్‌లతో వెళ్లడానికి ప్రభుత్వం అనుమతిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాకపోతే బిఎస్ఎన్ఎల్ ఇండియా కంపెనీల యొక్క డివైస్ లు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలంటే టెల్కో తన 4G సేవలను దేశంలో ప్రారంభించడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Plan to Launch 4G Services in Pan-India: Lot of Changes in Telecom Market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X