రీఛార్జ్ ధరలు పెంచమంటూనే.. వరుస షాక్‌లు ఇస్తున్న BSNL..!
భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల కాలంలో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటోంది. గత సంవత్సరం ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. ఈ సంవత్సరం చివర్లో మరోసారి రీఛార్జ్ ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉందంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ గతంలోనే ధరలపై కీలక ప్రకటనచేసింది. ఇప్పట్లో రీఛార్జ్ ధరలను పెంచబోమని స్పష్టం చేసింది.
అయితే తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ధరలు పెంచకుండానే అనేక రీఛార్జ్ ప్లాన్ల ప్రయోజనాల్లో కోత విధిస్తోంది. రూ.99 ప్లాన్ నుంచి రూ.1499 ప్లాన్ వరకు అనేక ప్లాన్‌ల డేటా, వ్యాలిడిటీని తగ్గించింది. మరోవైపు రూ.225, రూ.251 రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది.

రూ.99 రీఛార్జ్ ప్లాన్‌లో గతంలో 15 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం వ్యాలిడిటీని 14 రోజులకు తగ్గించింది. ప్రస్తుతం ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్‌ను పొందవచ్చు. 50MB డేటాను పొందవచ్చు. రూ.107 రీఛార్జ్ ప్లాన్‌లోనూ మార్పులు చేసింది. గతంలో గతంలో ఉన్న 28 రోజుల వ్యాలిడిటీని 22 రోజులకు కుదించింది. ఈ ప్లాన్‌లో 200 నిమిషాల కాలింగ్, 3GB డేటాను అందిస్తోంది.
రూ.147 రీఛార్జ్ ప్లాన్‌లో గతంలో 28 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. ప్రస్తుతం 24GB డేటాను అందిస్తోంది. దీంతోపాటు గతంలో 10GB డేటాను అందించగా.. ప్రస్తుతం 5GB డేటాను మాత్రమే అందిస్తోంది. రూ.197 రీఛార్జ్ ప్లాన్‌లో 54 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. ప్రస్తుతం 48 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. మరియు 300 నిమిషాల కాలింగ్, 100 SMS లు, 4GB డేటాను అందిస్తోంది.
రూ.319 రీఛార్జ్ ప్లాన్‌లో 65 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. ప్రస్తుతం 60 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 10GB డేటాను అందిస్తోంది. రూ.439 రీఛార్జ్ ప్లాన్‌లో గతంలో 90 రోజుల వ్యాలిడిటీ ఉండగా.. ప్రస్తుతం 80 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS లను మాత్రమే అందిస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.599 ప్లాన్‌లో గతంలో 84 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రస్తుతం 70 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజువారీ 100 SMS లు, రోజువారీ 3GB డేటాను అందిస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.897 రీఛార్జ్ ప్లాన్‌లో గతంలో 180 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం ఈ ప్లాన్ 165 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తోంది. గతంలో 90GB డేటాను వినియోగించుకొనే అవకాశం ఉండగా... ప్రస్తుతం 24GB డేటాను మాత్రమే అందిస్తోంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను కూడా అందిస్తోంది.
రూ.1499 రీఛార్జ్ ప్లాన్‌లోనూ మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం 300 రోజుల వ్యాలిడిటీనే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లు, మొత్తంగా 32GB డేటాను అందిస్తోంది.


Click it and Unblock the Notifications







