Home
News

రూ.47 తక్కువ ధరకే కొత్తగా FRC ప్లాన్‌ను విడుదల చేసిన BSNL...

ప్రీపెయిడ్ చందాదారులను మరింత అధికంగా ఆకట్టుకోవడానికి ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే బిఎస్ఎన్ఎల్ టెల్కో ఇప్పుడు కొత్తగా రూ.47 ధర వద్ద ఫస్ట్ రీఛార్జ్ (FRC) ను ప్రవేశపెట్టింది. అయితే ఇది మొదటిసారి రీఛార్జ్ చేస్తున్న కొత్త వినియోగదారులకు మాత్రమే FRC 47 ప్లాన్ వర్తిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వాయిస్ కాలింగ్, డేటా మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో వస్తుంది.

బిఎస్ఎన్ఎల్

ప్రస్తుతం భారతదేశంలో ఏ టెలికాం ఆపరేటర్ అందించని చౌకైన మరియు అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్ ఇదే కావడం విశేషం. కొత్త చందాదారులను మరింత పెంచడానికి టెల్కో ఈ రీఛార్జిని ప్రవేశపెట్టి ఉండవచ్చు. బిఎస్ఎన్ఎల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4G లాంచ్ కు ముందు ప్రస్తుతం 110-120 మిలియన్ల మధ్య ఉన్న చందాదారుల సంఖ్యను పెంచాలని చూస్తోంది. చందాదారుల సంఖ్య ప్రకారం జాబితాలో బిఎస్ఎన్ఎల్ నాల్గవ స్థానంలో ఉంది.

BSNL FRC 47 ప్రయోజనాలు

BSNL FRC 47 ప్రయోజనాలు

FRC 47 తో అందించే ఫ్రీబీస్‌ యొక్క ప్రయోజనాలలో హోమ్ LSAలో అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్ (ఆన్-నెట్ / ఆఫ్-నెట్ / లోకల్ / ఎస్‌టిడి) మరియు MTNL రోమింగ్ ప్రాంతాలు అయిన ముంబై ఢిల్లీతో సహా జాతీయ రోమింగ్‌ ప్రయోజనాలతో లభిస్తుంది. ఇది 14GB డేటా మరియు రోజుకు 100 SMS లతో ఫ్రీబీస్ 28 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది అని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. కేవలం రూ.47 ధర వద్దనే బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లు అపరిమిత కాంబో ప్లాన్‌ను ఆస్వాదించగలుగుతారు.

BSNL FRC 47 ప్లాన్ నిబంధనలు

BSNL FRC 47 ప్లాన్ నిబంధనలు

బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త FRC 47 ప్లాన్ యొక్క ఇతర నిబంధనలు మరియు షరతుల విషయానికి వస్తే ఈ ప్లాన్ నిమిషానికి ప్రీమియం ప్లాన్ PV107 ప్రకారం ఉన్నాయని బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. దీని అర్థం FRC 47 అనేది 100 రోజుల ప్రారంభ ప్లాన్ యాక్సిస్ ను అందిస్తుంది. ఆ తరువాత వినియోగదారులు తమ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును యాక్టీవ్ గా ఉంచడానికి మరొక రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా మార్చి 31, 2021 వరకు మాత్రమే ఈ FRC 47 ను ప్రవేశపెట్టబడినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి చెన్నై మరియు తమిళనాడు టెలికాం సర్కిల్‌లలో కొత్త వినియోగదారుల కోసం FRC47 అందుబాటులో ఉంటుందని ధృవీకరించబడింది. అయితే ఇది త్వరలోనే ఇతర సర్కిల్‌లలో కూడా ప్రారంభించబడుతుందని మేము ఆశిస్తున్నాము.

BSNL Vs Jio Vs ఎయిర్‌టెల్ Vs Vi

BSNL Vs Jio Vs ఎయిర్‌టెల్ Vs Vi

ప్రైవేట్ టెల్కోస్ భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా ఫస్ట్ రీఛార్జ్ (FRC ) ప్లాన్‌లను రూ.97 నుండి ప్రారంభిస్తాయి. అయితే బిఎస్‌ఎన్‌ఎల్ ఫస్ట్ రీఛార్జ్ (FRC ) ప్లాన్‌ను రూ.47 ధర వద్ద నుండి అందిస్తుంది. ఇది తక్కువ ధరను కలిగి ఉన్నప్పటికీ అధిక ప్రయోజనంతో లభిస్తుంది. రిలయన్స్ జియో టెల్కో ఫస్ట్ రీఛార్జ్ (FRC )ను జియోప్రైమ్ సభ్యత్వంతో కలుపుకొని రూ.99 ధర వద్ద అందిస్తుంది. Jio యొక్క ప్రస్తుత మరియు క్రొత్త వినియోగదారులు ఒకే ప్లాన్‌ను కలిగి ఉన్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Released FRC 47 Cheapest Plan For New Prepaid Users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X