Samsung Galaxy Tab S6 Lite యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం మరియు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ విడుదల చేసే డివైస్ ల కోసం దీని యొక్క అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో ఇండోనేషియాలో విడుదల చేసిన గెలాక్సీ టాబ్ S6 లైట్‌ను ఇప్పుడు ఇండియాలో విడుదల చేసారు.

గెలాక్సీ టాబ్ S6 లైట్
ఈ గెలాక్సీ టాబ్ S6 లైట్ వై-ఫై మరియు LTE ఆప్షన్లలో విడుదల చేయబడింది. దీనిని ప్రస్తుతం వివిధ రకాల డిస్కౌంట్ ఆఫర్లతో ప్రీ-బుకింగ్ చేసుకోవడం కోసం అందుబాటులో ఉంచారు. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Flipkart TV Days Sale: బ్రహ్మాడమైన ఆఫర్లతో టీవీల కొనుగోలుకు సరైన సమయం.....

గెలాక్సీ టాబ్ S6 లైట్ ధరల వివరాలు
శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ S6 లైట్‌ను కంపెనీ ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ యొక్క వై-ఫై వేరియంట్ యొకస్ ధర రూ.27,999 మరియు LTE వేరియంట్ యొక్క ధర 31,999 రూపాయలుగా సంస్థ నిర్ణయించింది. ఈ టాబ్లెట్‌ను ఆక్స్ఫర్డ్ గ్రే, అంగోరా బ్లూ మరియు చిఫాన్ పింక్ వంటి మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. Also Read:Samsung Galaxy A31 వచ్చేసింది!! ఫీచర్స్ అదుర్స్.. ధర కూడా తక్కువే...

గెలాక్సీ టాబ్ S6 లైట్ ప్రీ-బుకింగ్ & ఆఫర్స్
శామ్‌సంగ్ సంస్థ కొత్తగా విడుదల చేసిన తన సరికొత్త టాబ్లెట్ గెలాక్సీ టాబ్ S6 లైట్‌ను పొందాలనుకునే వారి కోసం సంస్థ వీటిని ఇప్పుడు ప్రీ-ఆర్డర్స్ ద్వారా మార్కెట్లో ఉంచింది. ఈ టాబ్లెట్ యొక్క ప్రీ-ఆర్డర్స్ జూన్ 8 న మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలయ్యాయి. ఈ ఆర్డర్స్ జూన్ 16 న ముగుస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శామ్‌సంగ్ ఇండియా యొక్క వెబ్ సైట్ మరియు అమెజాన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టాబ్లెట్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులు గెలాక్సీ బడ్స్ + ను కేవలం 2,999 రూపాయలకు పొందవచ్చు. లేదా గెలాక్సీ టాబ్ S6 లైట్ బుక్ కవర్‌ను రూ.2,500 ధర వద్ద పొందవచ్చు. Also Read: Online Rummyకి బానిసైన బ్యాంక్ క్యాషియర్!!!

గెలాక్సీ టాబ్ S6 లైట్ లభ్యత వివరాలు
గెలాక్సీ టాబ్ S6 లైట్ టాబ్లెట్ జూన్ 17 నుండి శామ్సంగ్ ఒపెరా హౌస్, శామ్సంగ్.కామ్, అమెజాన్ ఇండియా మరియు ఇతర రిటైల్ దుకాణాల ద్వారా కూడా అమ్మకాలు జరగనున్నాయి. కానీ దీని యొక్క వై-ఫై వేరియంట్ కేవలం అమెజాన్ ఇండియా మరియు శామ్‌సంగ్.కామ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

గెలాక్సీ టాబ్ S6 లైట్ స్పెసిఫికేషన్స్
గెలాక్సీ టాబ్ S6 లైట్ 10.4 అంగుళాల TFT డిస్ప్లే ప్యానెల్‌ను కలిగిఉండి Sపెన్ సపోర్ట్‌తో కూడా వస్తుంది. అలాగే ఈ టాబ్లెట్ 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికను కలిగి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ సహాయంతో వినియోగదారులు మెమొరీని మరింత విస్తరించవచ్చు. సంగీత ప్రియుల కోసం ఈ టాబ్లెట్‌లో డ్యూయల్ AKG స్పీకర్లతో పాటు డాల్బీ అట్మోస్ 3Dసరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉన్నాయి.

గెలాక్సీ టాబ్ S6 లైట్ ఫీచర్స్
గెలాక్సీ టాబ్ S6 లైట్ యొక్క కెమెరా సెటప్ విషయంలో దీని వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా మరియు సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ జోడించింది. వై-ఫై, బ్లూటూత్ V5.0, వై-ఫై డైరెక్ట్, 3.5mm ఆడియో సాకెట్, USB టైప్-సి పోర్ట్ మరియు GPS వంటి ఇతర ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత మరియు ఆక్టా-కోర్ CPUతో రన్ అవుతుంది. చివరిగా ఇది 7,040mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








