సీఈఎస్ 2015: స్మార్ట్‌బ్యాండ్‌ను ఆవిష్కరించిన లెనోవో

Posted By:

సీఈఎస్ 2015 వేదికగా లెనోవో ‘వైబ్ బ్యాండ్ వీబీ10' పేరుతో తన మొట్టమొదటి స్మార్ట్ బ్యాండ్‌ను ఆవిష్కరించింది. ఇ-ఇంక్  డిస్‌ప్లేతో పనిచేసే ఈ బ్యాండ్ 7 రోజులు సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సీఈఎస్ 2015: స్మార్ట్‌బ్యాండ్‌ను ఆవిష్కరించిన లెనోవో

పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థతో రూపకల్పన కాబడిన ఈ వైబ్ బ్యాండ్‌లో ప్రత్యేకమైన ఫిట్నెస్ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ వ్యవస్థ యూజర్ ఫిట్నెస్ స్థాయిని మానిటర్ చేస్తూ తగు ఆరోగ్య సూచనలను చేస్తుంది. పొందుపరిచిన యాంటీ గ్లేర్ స్ర్కీన్ ఎండలో సైతం బ్యాండ్ డిస్‌ప్లేను క్రిస్టల్ క్లియర్ క్వాలిటీలో కనిపించేలా చేస్తుంది.

మైక్రోసాఫ్ట్ చౌక ధర ఇంటర్నెట్ ఫోన్ ‘నోకియా 215'

స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేయటం ద్వారా కాల్స్, ఎస్ఎమ్ఎస్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వుయ్‌‌చాట్ తదితర అంశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లను ఆన్‌టైమ్‌లో బ్యాండ్ తన డిస్‌ప్లే చూపుతుంది. 150 పదాలతో కూడిన ఎస్ఎంఎస్‌లను ఈ బ్యాండ్ ద్వారా పంపుకోవచ్చు.

ప్రపంచం ముందుకు వొంపు తిరిగిన ఎల్‌‍జీ స్మార్ట్‌ఫోన్ ‘జీ ఫ్లెక్స్ 2'
ఈ స్మార్ట్‌బ్యాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రాక్సిమిటీ రిమైండర్ ఎప్పటికప్పుడు యూజర్‌ను అప్రమత్తం చేయటం ద్వారా ఫోన్‌ను పోగొట్టుకునే ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్ మొబైల్ డివైస్‌లను ఈ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ధర 89 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.5643). ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

English summary
CES 2015: Lenovo Enters Wearable Segment With Launch of Vibe Band VB10. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot