ఉద్యోగాలిస్తామంటున్న సైబర్ నేరగాళ్లు

Written By:

ఉద్యోగాలిస్తామంటే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా పాపులర్ అయిన సోషల్ సైట్లకు బదులుగా నకీలీ అకౌంట్లను సృష్టించి ఉద్యోగాలిస్తామంటున్నారు. వీళ్ల భారీన ఇప్పుడు లింక్డ్ ఇన్ పడింది. నకిలీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ ద్వారా బిజినెస్ ప్రొఫెషనల్స్‌ను మోసం చేస్తున్నారని సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే సిమాంటిక్ సంస్థ తెలిపింది.

Read more: మైక్రోసాఫ్ట్‌‌కి మిగిలిన చేదు జ్జాపకాలు

ఉద్యోగాలిస్తామంటున్న సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు ఉద్యోగాలిస్తామంటూ నకిలీ ప్రొఫైల్స్ ద్వారా బిజినెస్ ప్రొఫెషనల్స్ సమాచారాన్ని సేకరిస్తారని పేర్కొంది. ఆ తర్వాత ఈ సమాచారంతో ఫిషింగ్ ఈమెయిల్స్ పంపిస్తారని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా లింక్డ్‌ఇన్‌కు 40 కోట్ల మంది యూజర్లున్నారని, గత ఏడాది ఈ తరహా మోసాలు చాలా జరిగాయని పేర్కొంది.

Read more: గాల్లో తేలినట్లుందే..గుండె పేలినట్టుందే

ఉద్యోగాలిస్తామంటున్న సైబర్ నేరగాళ్లు

కంపెనీలు నిర్వహిస్తున్నామని లేదా స్వయం ఉపాధి పొందుతున్నామని ఉద్యోగులు కావాలంటూ సైబర్ నేరగాళ్లు మహిళల ఫొటోలతో బిజినెస్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షిస్తారని వివరించింది. టిన్‌ఐ, గూగుల్ ఇమేజ్ సెర్చ్ వంటి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ నకిలీ ప్రొఫైల్స్‌ను గుర్తించగలిగామని పేర్కొంది.

ఉద్యోగాలిస్తామంటున్న సైబర్ నేరగాళ్లు

ఇతరులను తమ నెట్‌వర్క్‌కు జత చేసుకునేముందు లింక్డ్‌ఇన్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఉద్యోగాలిస్తామంటూ ఆఫర్లిచ్చే లింక్డ్‌ఇన్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

English summary
Here Write Cybercriminals using fake LinkedIn accounts to scam users: report
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot