Home
News

D2h నుంచి కొత్త సర్వీస్... రీఛార్జ్ మీద క్యాష్‌బ్యాక్ పొందే గొప్ప ఛాన్స్....

డిష్ టివి యాజమాన్యంలోని డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) బ్రాండ్ అయిన డి 2 హెచ్ తన వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్తగా మరొక రీఛార్జ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తమ స్నేహితుల యొక్క ఇతర డి 2 హెచ్ కనెక్షన్లను రీఛార్జ్ చేయడానికి వీలుకల్పిస్తుంది.

D2h ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రీఛార్జ్

D2h ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రీఛార్జ్

అలాగే ఈ రీఛార్జ్ మీద క్యాష్‌బ్యాక్ రూపంలో కొంత డబ్బు సంపాదించడానికి వీలుగా ‘ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రీఛార్జ్' సర్వీసును ప్రవేశపెట్టింది. డిటిహెచ్ ఆపరేటర్ ఒక్కొక్క రీఛార్జింగ్‌కు రూ.10 క్యాష్‌బ్యాక్‌గా ఇవ్వనున్నారు. ఈ క్యాష్‌బ్యాక్ వినియోగదారుడి అకౌంటులో 24 గంటల్లో జమ అవుతుంది.

డి 2 హెచ్ న్యూ సర్వీస్

డి 2 హెచ్ న్యూ సర్వీస్

డి 2 హెచ్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం రీఛార్జ్ సర్వీస్' ను వినియోగదారులు నేరుగా D2h వెబ్‌సైట్ లేదా D2h ఇన్ఫినిటీ యాప్ ద్వారా ఉపయోగించవచ్చు. వినియోగదారులు మీ యొక్క స్నేహితుల యొక్క RTN లు లేదా కస్టమర్ ID లను ఉపయోగించి ఇందులో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కొత్త సర్వీస్ ద్వారా రీఛార్జ్ చేసిన ప్రతిసారి రూ.10 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తం రీఛార్జ్ చేసే వ్యక్తి యొక్క అకౌంటుకు జమ చేయబడుతుంది.

డి 2 హెచ్ ఫ్రీ బుకింగ్ ఆఫర్

డి 2 హెచ్ ఫ్రీ బుకింగ్ ఆఫర్

డి 2 హెచ్ సంస్థ తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రీ-బుకింగ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా d2h మ్యాజిక్ స్టిక్ మరియు HD RF సెట్-టాప్ బాక్స్ కాంబో ఆఫర్ ను కేవలం రూ.1,599 ధర వద్ద మాత్రమే అందిస్తున్నది. ఈ ప్రీ-బుకింగ్‌లో భాగంగా డిష్ టివి యాజమాన్యంలోని డిటిహెచ్ సంస్థ గోల్డ్ హెచ్‌డి కాంబో ఛానల్ ప్యాక్ యొక్క ఒక నెల సభ్యత్వాన్ని కూడా ఉచితంగా అందిస్తోంది.

డి 2 హెచ్ STB బాక్స్

డి 2 హెచ్ STB బాక్స్

డి 2 హెచ్ యొక్క స్టాండర్డ్ బాక్స్ యొక్క ధరను కేవలం రూ.1,799 ల వద్ద నిర్ణయించారు. కాని కాంబో ఆఫర్లో భాగంగా రూ.200 తక్కువ ధరకు పొందవచ్చు. మరోవైపు డి 2 హెచ్ యొక్క మ్యాజిక్ స్టిక్ ప్రస్తుతం రూ.399 పరిచయ ధర వద్ద పొందవచ్చు. ఇటీవల కంపెనీ తన హెచ్డి మరియు ఎస్డి సెట్-టాప్ బాక్సుల ధరలను రూ.100 తగ్గించింది. Android- ఆధారిత సెట్-టాప్ బాక్స్ d2h స్ట్రీమ్ మరియు మ్యాజిక్ స్టిక్ గత నెలలో లాంచ్ చేయబడింది.

డిష్ టివి - MX ప్లేయర్

డిష్ టివి - MX ప్లేయర్

డిష్ టివి మరియు డి 2 హెచ్ లను కలిగి ఉన్న డిటిహెచ్ ఆపరేటర్ డిష్ టివి ఇండియా లిమిటెడ్ గత వారం డిజిటల్ వీడియో-ఆన్-డిమాండ్ MX ప్లేయర్‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ వ్యూహాత్మక అనుబంధంతో డిష్ టివి మరియు డి 2 హెచ్ ప్లాట్‌ఫాంలు ఇప్పుడు ప్రముఖ MX ప్లేయర్ యొక్క ఒరిజినల్స్, టివి షోలు, మ్యూజిక్ వీడియోలు మరియు చలన చిత్రాల యొక్క కంటెంట్‌ను వివిధ రకాల శైలులు మరియు వివిధ భాషలలో ప్రసారం చేస్తాయి. ఇది డిష్ టీవీ యొక్క ఆండ్రాయిడ్-ఆధారిత పరికరాల్లో ముందే ఇంస్టాల్ చేయబడి ఉంటుంది. దీనిని ప్రస్తుతం అందిస్తున్న వాటిలో వరుసగా డిష్ SMRT Hub మరియు డి 2 హెచ్ స్ట్రీమ్ వంటివి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
D2h Announced Friends and Family Recharge Service
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X