Tata Sky, Dish TV అందిస్తున్న లోన్ ఆఫర్స్ & వివిధ రకాల ఉచిత ఆఫర్స్...

|

భారతదేశంలోని మూడు ప్రధాన డిటిహెచ్ ఆపరేటర్లు టాటా స్కై, డిష్ టీవీ, d2h వంటివి కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో వారి యొక్క చందాదారులకు తక్షణ క్రెడిట్ సదుపాయాన్ని అందిస్తున్నారు. టాటా స్కై మరియు డిష్ టివి ఇండియా లిమిటెడ్ మరియు డి 2 హెచ్ చందాదారులు లాక్డౌన్ పరిమితుల కారణంగా లేదా ఇతర కారణాల వలన వారి యొక్క డిటిహెచ్ సెట్-టాప్-బాక్స్‌లను (STB) రీఛార్జ్ చేయలేకపోతున్న చందాదారులకు కొన్ని రకాల అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది.

డిష్ టీవీ

డిష్ టీవీ

డిష్ టీవీ ప్రస్తుతం తన వినియోగదారులందరికీ ‘పే లేటర్ సర్వీస్' ను రన్ చేస్తోంది. ఈ సర్వీస్ సహాయంతో లాక్డౌన్ సమయంలో చందాదారులు అంతరాయం లేకుండా వారి నిరంతర సేవలను ఆస్వాదించేలా డిటిహెచ్ ఆపరేటర్ చూస్తున్నారు. అందువల్ల తక్షణ క్రెడిట్ / లోన్ కోరుకునే చందాదారులు వారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 1800-274-9050 వద్ద మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారి అకౌంటుల్లో తక్షణ క్రెడిట్ సదుపాయాన్ని పొందవచ్చు.

D2h

D2h

డిష్ టీవీ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న d2h కూడా తన చందాదారులకు తక్షణ క్రెడిట్ సదుపాయాన్ని అందిస్తోంది. కాని ఇందులో ఒక క్యాచ్ తో D2h తక్షణ క్రెడిట్ సదుపాయంను అందిస్తోంది. కాబట్టి డి 2 హెచ్ ఇన్‌స్టంట్ క్రెడిట్ సదుపాయాన్ని ఎంచుకునే చందాదారులు తరువాత అదనపు ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ ఛార్జ్ ఫీజు రూ .10.

టాటా స్కై

టాటా స్కై

చివరగా టాటా స్కై కూడా "అత్యవసర క్రెడిట్ సర్వీస్" అనే పేరుతో తన వినియోగదారులకు లోన్ సౌకర్యాన్ని అందిస్తున్నది. సమీపంలోని రిటైల్ దుకాణాల నుండి రీఛార్జ్ చేయలేని చందాదారుల కోసం ఈ క్రెడిట్ సర్వీస్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. టాటా స్కై చందాదారులు అత్యవసర క్రెడిట్ సేవను ఎంచుకున్న వారు తరువాత రీఛార్జ్ చేస్తున్నప్పుడు అదనపు క్రెడిట్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కంపెనీ ఎటువంటి ప్రస్తుతం ఎటువంటి సర్వీస్ ఛార్జీలు విధించడం లేదు. చందాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 080-61999922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా అత్యవసర క్రెడిట్ సేవను పొందవచ్చు. డిటిహెచ్ ఆపరేటర్ ఈ మొత్తాన్ని టాటా స్కై ఖాతాలో క్రెడిట్ చేస్తుంది మరియు వారు సస్పెండ్ చేయబడితే వారి ఖాతాలను కూడా తిరిగి యాక్టివేట్ చేస్తుంది.

డిష్ టీవీ తన వంతు సహాయం

డిష్ టీవీ తన వంతు సహాయం

DTH సంస్థ కరోనావైరస్కు వ్యతిరేకంగా పోరాడటానికి ఒకటి కాకుండా అనేక విధాలుగా సహాయం అందించింది. డిష్ టీవీ యొక్క పే లేటర్ సర్వీసు తాజాది. దీని కంటే ముందు మరిన్ని అమలుచేసింది.

డిష్ పాజిటివ్ - కరోనావైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు ఈ సమయంలో తమను మరియు ఇతరులను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి డిష్ పాజిటివ్ ఛానెల్ ను సంస్థ ప్రారంభించింది.

 

ఉచిత సర్వీస్ ఛానెల్స్

ఉచిత సర్వీస్ ఛానెల్స్

వాచో 6 నెల సభ్యత్వం - సంస్థ యొక్క వెబ్‌సైట్ హోమ్‌పేజీ ప్రకారం లాక్డౌన్ సమయంలో వినోదాన్ని ఉంచడానికి డిష్ టివి తన వినియోగదారులకు ఆరు నెలల ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది.


ఉచిత సర్వీస్ ఛానెల్స్ - డిష్ టివి తన వినియోగదారులకు నాలుగు సర్వీస్ ఛానెళ్లను ఉచితంగా అందిస్తోంది. ఈ ఛానెల్‌లు - కిడ్స్ యాక్టివ్ టూన్స్, కిడ్స్ యాక్టివ్ రైమ్స్, ఆయుష్మాన్ యాక్టివ్ మరియు ఫిట్‌నెస్ యాక్టివ్.

 

Best Mobiles in India

English summary
Tata Sky, Dish TV and d2h Provides Instant Loan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X