Mi NoteBook 14 Series ల్యాప్‌టాప్‌లతో దూసుకొస్తున్న షియోమి!!! ఫీచర్స్ బ్రహ్మాండం...
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో విజయం సాధించిన సంస్థ షియోమి ఇప్పుడు ఇండియాలో హై-ఎండ్ ఫీచర్స్ గల తన Mi నోట్‌బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. నాలుగు వేరు వేరు వేరియంట్లతో Mi నోట్‌బుక్ మరియు Mi నోట్‌బుక్ హారిజోన్ ఎడిషన్ వంటి రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను షియోమి సంస్థ విడుదల చేసింది.

Mi NoteBook 14 Series ల్యాప్‌టాప్‌లు
ఈ ల్యాప్‌టాప్‌లు రెండు కూడా 14-అంగుళాల డిస్ప్లేను సన్నని బెజెల్స్ నిర్మాణంతో మరియు 90 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:ఎయిర్‌టెల్, జియో,వొడాఫోన్ ఐడియా నుంచి షాకింగ్ న్యూస్....

Mi నోట్‌బుక్ ల్యాప్‌టాప్‌లు
10 వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో పనిచేసే ఈ షియోమి ల్యాప్‌టాప్‌లు బడ్జెట్ ధరల విభాగంలో కాకుండా అధిక ధరలను కలిగి ఉన్నాయి. షియోమి యొక్క Mi నోట్‌బుక్ ల్యాప్‌టాప్‌లు ఆసుస్, HP, ఎసెర్ మరియు డెల్ వంటి బ్రాండెడ్ కంపెనీల హై-రేంజ్ ధరలు గల అల్ట్రాబుక్ ల్యాప్‌టాప్‌లతో పోటీపడనున్నాయి. Also Read:Disney+ Hotstar VIP ను ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్,జియోలలో ఏది బెస్ట్?

Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్
Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ల్యాప్‌టాప్ యొక్క 14 అంగుళాల డిస్‌ప్లే ఫుల్ HD రిజల్యూషన్ మరియు 91 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 1920 x 1080 పిక్సెల్‌ల పరిమాణంలో ఉంటుంది. Mi నోట్‌బుక్ ఇంటెల్ హైపర్-థ్రెడింగ్ టెక్నాలజీతో 10వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i7 1051U ప్రాసెసర్ తో రన్ అవుతుంది. అలాగే ఇది 8GB DDR4 ర్యామ్‌తో జతచేయబడి ఉంది. ఇందులో ఎన్విడియా జిఫోర్స్ MX350 GPU యూనిట్ ను కలిగి ఉండడమే కాకుండా ఈ నోట్‌బుక్‌లో 512GB SSD స్టోరేజ్ ను కలిగి ఉండి సరికొత్త విండోస్ 10 తో వస్తుంది. Also Read:Samsung Galaxy Tab S6 Lite యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!

Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఫీచర్స్
Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ల్యాప్‌టాప్ సొగసైన మరియు తేలికైన డిజైన్ ను కలిగి ఉంది. ఇది తక్కువ బరువును కలిగి ఉండి కేవలం ఒకే ఒక వేలితో తెరవడానికి కూడా అనువుగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు USB 3.1 పోర్ట్‌లు, ఒక USB 2.0 పోర్ట్‌తో పాటు HDMI పోర్ట్ కూడా ఉంటాయి. వీటితో పాటుగా 3.5mm ఆడియో జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌లు కూడా ఉన్నాయి. దీని బరువు కేవలం 1.35 కిలోలు మాత్రమే. ఇది 65W పాస్ట్ ఛార్జర్‌తో 46 Wh పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది.

Mi నోట్‌బుక్ 14 స్పెసిఫికేషన్స్
షియోమి సంస్థ ఇండియాలో స్టాండర్డ్ Mi నోట్‌బుక్ 14 ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ యొక్క డిస్‌ప్లే 14అంగుళాల పరిమాణంలో ఉంటుంది. దీని యొక్క డిస్‌ప్లే 1920 x 1080 పిక్సెల్‌లతో ఫుల్ - HD రిజల్యూషన్ మరియు 91 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 10వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ తో పనిచేస్తూ మూడు వేరియంట్లలో లభిస్తుంది.

Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ధరల వివరాలు
Mi నోట్‌బుక్ 14 ను ఇండియాలో మూడు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 256GB వేరియంట్ ధర రూ.41,999, 512GB వేరియంట్ ధర రూ.44,999 మరియు Nvidea గ్రాఫిక్స్ గల 512GB వేరియంట్ యొక్క ధర 47,999 రూపాయలు. అలాగే Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ను ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో ఇంటెల్ కోర్ i5 వేరియంట్ యొక్క ధర రూ.54,999 కాగా ఇంటెల్ కోర్ i7 వేరియంట్ యొక్క ధర 59,999 రూపాయలు.

Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌ల సేల్స్ డేట్ & ఆఫర్స్
Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌ల యొక్క అమ్మకాలు వచ్చే వారంలో జూన్ 17 నుంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మొదలుకానున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు వినియోగదారులకు రూ .2,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








