సీఈఎస్ 2013: ‘మొదటి రోజు ఆవిష్కరణలు’

By Super
|
Day 1: Top 10 launches from CES 2013


ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల ప్రదర్శన ‘సీఈఎస్ 2013’ మంగళవారం అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్సన్ సెంటర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఎగ్జిబిషన్‌లో భాగంగా టెక్ ప్రపంచాన్ని అలరించిన టాప్-10 ఆవిష్కరణల వివరాలను ఇప్పుడు చూద్దాం......

 

సీఈఎస్ 2013లో ‘‘ది బెస్ట్ గాడ్జెట్‌లు’’

 

విచిత్ర వీడియోలు (సీఈఎస్ 2013)

ఎన్-విడియా టెగ్రా 4 ప్రాసెసర్: ప్రముఖ చిప్‌మేకర్ ఎన్-విడియా, టెగ్రా 4 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. టెగ్రా3 ప్రాసెసర్ తో పోలిస్తే టెగ్రా 4 ఆరు రెట్లు అధిక శక్తిని కలిగి ఉంటుంది.

హవాయి ఆసెండ్ డీ2: ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ హవాయి ‘ఆసెండ్ డీ2’ పేరుతో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సీఈఎస్ వేదిక పై ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), 13 మెగా పిక్సల్ కెమెరా (ఎఫ్/2.2 ఆపెర్చర్, హైబ్రీడ్ ఐఆర్ ఫిల్టర్, 5 పిక్సల్ లెన్స్), 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్, 2జీబి ర్యామ్, 1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

హవాయి ఆసెండ్ మేట్: ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ హవాయి ‘ఆసెండ్ డీ2’ పేరుతో మరో పెద్ద‌స్ర్కీన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సీఈఎస్ వేదిక పై ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్ లు: 6.1 అంగుళాల స్ర్కీన్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4050ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మ్యాజిక్ టచ్ యూజర్ ఇటర్ ఫేస్, 8 మెగా పిక్సల్ కెమెరా.

సోనీ ఎక్ప్‌పీరియా జడ్/జడ్ఎల్:

సోనీ మొబైల్స్ ‘ఎక్ప్ పీరియా జడ్’ మోడళ్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సీఈఎస్ వేదిక పై ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల స్ర్కీన్, టీఎఫ్టీ రియాల్టీ డిస్‌ప్లే (మొబైల్ బ్రావియో ఇంజన్ 2), 1080పిక్సల్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఎల్టీఈ ఇంకా ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.

ఏసర్ ఐకోనియా బీ1:

ప్రముఖ కంప్యూటర్ల తయారీ బ్రాండ ఏసర్ సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను సీఈఎస్ వేదిక పై ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్‌లు: 7 అంగుళాల డబ్ల్యూఎస్ వీజీఏ స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ మీడియాటెక్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8 జీబి ఇంటర్నల్ స్ట్రోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-పై ఇంకా మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 2710ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆల్కాటెల్ వన్ టచ్ పాప్:

సీఈఎస్ 2013లో భాగంగా ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ ఆల్కాటెల్ వన్ టచ్ పాప్ సిరీస్ క్రింద పలు వేరియంట్‌లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వాటి వివరాలు......

వన్‌టచ్ ‘ఎక్స్’పాప్: డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, హెచ్ఎస్‌‌పీఏ+ కనెక్టువిటీ, 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత.

వన్‌టచ్ ‘ఎస్’పాప్: 1గిగాహెట్జ్ సీపీయూ, 512ఎంబి ర్యామ్, 3.5 అంగుళాల హెచ్‌వీజీఏ డిస్‌ప్లే, 3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా, 1గిగాహెట్జ్ ప్రాసెసర్.

వన్‌టచ్ ‘టీ’పాప్: 256ఎంబి ర్యామ్, 3.5 అంగుళాల హెచ్‌వీజీఏ డిస్‌ప్లే, 3.2 మెగా పిక్సల్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం.

ఆల్కాటెల్ వన్‌‍టచ్ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు:

సీఈఎస్ వేదిక పై ఆల్కాటెల్ తన వన‌టచ్ సిరీస్ నుంచి అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వాటి వివరాలు......

వన్‌టచ్ ఐడోల్: డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, బరువు 110 గ్రాములు, సింగిల్ సిమ్ ఇంకా డ్యూయల్ సిమ్ వర్షన్స్, 4జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ.

వన్‌టచ్ ఐడోల్ అల్ట్రా: ఈ స్లిమ్ ఫోన్ 4.7 అంగుళాల హైడెఫినిషన్ ఆమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 8జీబి స్టోరేజ్, 8 మెగా పిక్సల్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్.

వన్‌టచ్ స్ర్కైబ్ హైడెఫినిషన్: 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆల్కాటెల్ వన్‌టచ్ ట్యాబ్లెట్స్:

సీఈఎస్ వేదిక పై వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిన ఆల్కాటెల్ సరికొత్త జెల్లీబీన్ ట్యాబ్లెట్‌లను తొలిరోజు ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించింది. వాటి వివరాలు......

ఆల్కాటెల్ వన్‌టచ్ ట్యాబ్7: 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 7 అంగుళాల డబ్ల్యూఎస్ వీజీఏ టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,024 x 600పిక్సల్స్), 1జీబి ర్యామ్, ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీబి స్టోరేజ్, 1.6గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ

కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత.

ఆల్కాటెల్ వన్‌టచ్ ట్యాబ్7 హైడెఫినిషన్: 7 అంగుళాల డబ్ల్యూఎక్స్ జీఏ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1,280 x 800పిక్సల్స్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్.

ఆల్కాటెల్ వన్‌టచ్ ట్యాబ్ 8 హైడెఫినిషన్: 8 అంగుళాల ఎక్స్‌జీఏ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,024 x 768పిక్సల్స్), 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్.

ఇంటెల్ లెక్సింగ్‌టన్: చిప్ మేకర్ ఇంటెల్ ‘లెక్సింగ్‌టన్’ పేరుతో సరికొత్త ప్రాసెసర్‌ను సీఈఎస్ వేదిక పై ఆవిష్కరించింది. లావా, ఏసర్ ఇంకా సఫరాకామ్‌లు ఈ ప్రాససెర్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించుకోనున్నాయి.

ఇంటెల్ బే ట్రెయిల్: ఇంటెల్ ఈ ప్రాసెసర్‌ను ప్రత్యేకించి ట్యాబ్లెట్ పీసీల కోసం వృద్ధి చేసింది. 22ఎన్ఎమ్ టెక్నాలజీ పై ఈ చిప్‌ను రూపొందించారు. ప్రస్తుత ఇంటెల్ ప్రాసెసర్‌లతో పోలిస్తే రెండితల వేగవంతమైన పనితీరును ప్రదర్శిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X