22 ఏళ్లకే కోటి రూపాయల జీతం

Written By:

వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా కోటిపైనే! ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి చేతన్‌ కక్కర్‌ అందుకోనున్న వార్షిక వేతనమిది! ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (డీటీయూ)లో ఫైనల్‌ ఇయర్‌ చదువు తున్న చేతన్‌కు గూగుల్‌ కంపెనీ ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది! ఏడాదికి సుమారు రూ.1.27 కోట్లు వేతనంతో అతడిని ఉద్యోగంలోకి తీసుకుంది.

Read more:భారత్‌లో దొరకని వస్తువులు ఇవే

22 ఏళ్లకే కోటి రూపాయల జీతం

చదువు పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సర మే కాలిఫోర్నియాలోని గూగుల్‌ కార్యాలయంలో చేతన్‌ ఉద్యోగంలో చేరనున్నాడు. ఢిల్లీకి చెందిన చేతన్ ప్రస్తుతం ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)లో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలో ఫైనలియర్ చదువుతున్నారు. చేతన్ కోర్సును పూర్తి చేశాక వచ్చే ఏడాది కాలిఫోర్నియాలో గూగుల్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరనున్నాడు.

Read more : ఆకాశం నుంచి టమోటాలు, పూలు..

22 ఏళ్లకే కోటి రూపాయల జీతం

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారీ ఆఫర్ అందుకున్న విద్యార్థి చేతన్ కావడం విశేషం. చేతన్‌కు ముందు ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అత్యధిక వేతన ఆఫర్ రూ. 93 లక్షలు మాత్రమే. గూగుల్ సంస్థలో చేరడానికి ఉత్సుకతతో ఉన్నానని చేతన్ సంతోషం వ్యక్తం చేశారు.

22 ఏళ్లకే కోటి రూపాయల జీతం

చేతన్ తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకులు. తల్లి రీతా కెమిస్ట్రీ విభాగంలో, తండ్రి సుభాష్ మేనేజ్ మెంట్ స్టడీస్ విభాగంలో పనిచేస్తున్నారు.

Read more about:
English summary
Here Write Delhi boy grabs whopping Rs 1 27 crore pay offer from Google
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot