Dish TV and D2h మల్టీ టీవీ వినియోగదారులకు NCF మీద పెద్ద ఊరట....

|

ఇండియాలోని డిటిహెచ్ పరిశ్రమలో టాటా స్కై,డిష్ టీవీ,D2h మరియు ఎయిర్టెల్ డిజిటల్ టీవీల పేర్లు అధికంగా వినిపిస్తూ ఉంటాయి. డిటిహెచ్ చందాదారుడు ప్రతిఒక్కరు తాము ఎంచుకున్న ప్రతి నెట్‌వర్క్ కొనుగోలు మీద చెల్లించాల్సిన ఛార్జీలలో ఒకటి నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (NCF).

 

డిటిహెచ్ కనెక్షన్లు

ఒకవేళ మీకు ఒకే అకౌంట్ మీద రెండు లేదా అంతకంటే ఎక్కువ డిటిహెచ్ కనెక్షన్లు ఉంటే అప్పుడు మీరు వాటిలో ప్రతిదానికి కూడా ఎన్‌సిఎఫ్ చెల్లించాలి. DTH ప్రొవైడర్ వినియోగదారులకు అందిస్తున్న రెండవ కనెక్షన్ ను దాని మల్టీ టీవీ కనెక్షన్ అంటారు. అంతకుముందు డిటిహెచ్ యొక్క ధరలను తగ్గిస్తున్నపుడు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మల్టీ టివి కనెక్షన్ కోసం ఎన్‌సిఎఫ్ ఛార్జీలపై ఏమైనా తగ్గింపులను ఇవ్వబోతున్నారా లేదా అనేది డిటిహెచ్ కంపెనీపై ఆధారపడి ఉంటుందని అని చెప్పారు.

నేషనల్ టారిఫ్ ఆర్డర్

నేషనల్ టారిఫ్ ఆర్డర్

ప్రతి డిటిహెచ్ సంస్థ తమ వినియోగదారులకు మల్టీ టివి కనెక్షన్ కోసం ఎన్‌సిఎఫ్ ఛార్జీలపై కొంత ఉపశమనం ఇవ్వాలని నిర్ణయించగా టాటా స్కై ఇతర మార్గాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా టాటా స్కై తన వినియోగదారుల వద్ద నుండి గతంలో మొత్తంగా రూ.153 వసూలు చేసింది. ట్రాయ్ యొక్క నేషనల్ టారిఫ్ ఆర్డర్ (NTO) 2.0 తీసుకువచ్చిన కొత్త మార్పులలో భాగంగా ఇప్పుడు అది మార్చబడింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిష్ టీవీ మరియు డి 2 హెచ్ మల్టీ టీవీ వినియోగదారులకు తక్కువ NCF
 

డిష్ టీవీ మరియు డి 2 హెచ్ మల్టీ టీవీ వినియోగదారులకు తక్కువ NCF

టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి సంస్థలు ధరల తగ్గింపును పొందిన తరువాత కూడా మల్టీ టివి NCF ఛార్జింగ్ విషయంలో డిష్ టివి మరియు డి 2 హెచ్ కంటే వెనుకబడి ఉన్నాయి. డిష్ టివి మరియు డి 2 హెచ్ చందాదారులు ఇప్పటికీ మొదటి 200 సబ్స్క్రైబర్స్ ఛానెళ్లకు NCF (పన్నులు మినహాయించి) రూ.50 చెల్లిస్తున్నారు. వేర్వేరు కంటెంట్ ప్రొవైడర్లకు చందా కోసం వినియోగదారులు ఇంకా అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు స్టార్, సోనీ మొదలైనవి. DTH ఆపరేటర్ నుండి ఇక్కడ ఎటువంటి తగ్గింపు ఉండదు. వారు తగ్గించగలిగేది ఎన్‌సిఎఫ్ ఛార్జీలు మాత్రమే.

టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మల్టీ టివి NCF

టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మల్టీ టివి NCF

టాటా స్కై ప్రస్తుతం రూ.153 ధర వద్ద NCFను వసూలు చేస్తున్నది. ఎయిర్టెల్ డిజిటల్ టివి వాస్తవానికి ముందు ఉన్న దాని ధరలను తగ్గించాలని నిర్ణయించుకుంది. అందుకోసం ప్రతి మల్టీ టివి కనెక్షన్ కోసం NCF గా రూ.80 వసూలు చేసింది. కానీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఎన్‌సిఎఫ్ ఛార్జీలకు సంబంధించి డిటిహెచ్ కంపెనీలకు కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది. టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి వంటి డిటిహెచ్ ఆపరేటర్లు మల్టీ టివి కనెక్షన్ల కోసం వారి ఎన్‌సిఎఫ్ ఛార్జీలను తగ్గించడానికి ఇది కారణమైంది.

మల్టీ టివి కొత్త NCF ధరలు

మల్టీ టివి కొత్త NCF ధరలు

టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివిలు రెండు ఇప్పుడు తన మల్టీ టివి కనెక్షన్ కోసం ఎన్‌సిఎఫ్ ఛార్జీగా వరుసగా రూ.52 + రూ.9.36 (GST) = రూ.61.36 వసూలు చేస్తున్నాయి. ఈ ధర వద్ద వినియోగదారులు 200 లేదా 200 కంటే తక్కువ ఛానెల్‌లకు చందాను పొందారు. 200 కంటే ఎక్కువ ఛానెల్‌లకు సభ్యత్వాన్ని పొందాలనుకునే వినియోగదారులకు ఈ ధర రూ .75.52 కు పెరుగుతుంది. ఇందులో ఇక్కడ రూ.64 ప్రాథమిక ఛార్జీ, దానిపై రూ .11.52 దానిపై జిఎస్‌టిగా వర్తించబడుతుంది.

Best Mobiles in India

English summary
Dish TV and D2h Charging Less NCF For Multi TV Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X