తెలుగువారి కోసం 'తెలుగు యాక్టివ్' సర్వీస్ ను ప్రారంభించిన DTH

|

ఇండియాలో టీవీ రంగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని సర్వీస్ ప్రొవైడర్లు తమ చందాదారులను ఆకట్టుకోవడానికి చాలా రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు డిటిహెచ్ ప్రొవైడర్ తెలుగు ప్రేక్షకుల కోసం మంచి శుభవార్తను అందిస్తోంది. భారతదేశపు ప్రసిద్ధ డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్ Dish TV మరియు d2h (వీడియోకాన్ డి 2హెచ్) తన వినియోగదారుల చందాదారుల కోసం 'తెలుగు యాక్టివ్' వాల్యూ యాడెడ్ సర్వీస్ (VAS) ను ప్రవేశపెట్టింది.

తెలుగువారి కోసం 'తెలుగు యాక్టివ్' సర్వీస్ ను ప్రారంభించిన DTH

 

షెమరూ మరియు మాంగో మాస్ మీడియా భాగస్వామ్యంతో తెలుగు యాక్టివ్ సర్వీసును ప్రారంభించినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ సర్వీస్ Dish TV మరియు d2h రెండు డిటిహెచ్ బ్రాండ్లలో లభిస్తుంది.

తెలుగు యాక్టివ్ సర్వీస్ వివరాలు:

తెలుగు యాక్టివ్ సర్వీస్ వివరాలు:

ఇతర సర్వీస్ ల మాదిరిగా తెలుగు యాక్టివ్ సర్వీస్ కూడా నాన్-స్టాప్ గా తెలుగు సినిమాలు మరియు టీవీ షోలను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ 10 గంటల తాజా కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరని డిష్ టివి పేర్కొంది. అంతేకాకుండా ప్రతి వారం రెండు ప్రీమియర్ సినిమాలను చూడవచ్చు. కస్టమర్లతో మరింత కనెక్ట్ అవ్వడానికి పూర్తి వినోదభరితమైన ప్యాకేజీ కోసం ముఖ్యమైన సినిమా స్టార్లు నయనతార, అధర్వ, సాయి ధరంతేజ్, నిహారికా వంటి ప్రఖ్యాత నటుల యొక్క ఉత్తమ తెలుగు సినిమాలను అందిస్తుంది. అదనంగా ఇది అగ్ర ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూ షోలను, కొత్త సినిమాల యొక్క యాక్షన్ సన్నివేశాలు మరియు మిగతా వాటికి సంబందించిన మేకింగ్ వీడియోలను కూడా ప్రసారం చేస్తుంది.

డిష్ టీవీ కంటెంట్:
 

డిష్ టీవీ కంటెంట్:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టీవీ కంటెంట్ చాలా గొప్పది మరియు తెలుగు కంటెంట్ పట్ల అధిక అనుబంధంతో టీవీ ప్రేక్షకులను అధికంగా కలిగి ఉంది. డిష్ టివి ఇండియా తన కొత్త ‘తెలుగు యాక్టివ్' సర్వీస్ తో మన తెలుగు ప్రేక్షకుల అవసరాలను ఆరోగ్యకరమైన మరియు విభిన్నమైన కుటుంబ విషయాల కోసం తీరుస్తుంది. మా దృష్టి ఎల్లప్పుడూ ఆకర్షణీయమైన కంటెంట్, ఉత్తమ విలువ ప్రతిపాదన మరియు ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలపై ఉంది. డిష్ టివి మరియు డి 2 హెచ్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ కొత్త యాడ్-ఫ్రీ సర్వీస్ ను ప్రారంభించడానికి షెమారూతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది అని డిష్ టివి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & గ్రూప్ CEO అనిల్ దువా ఒక ప్రకటనలో తెలిపారు.

ఛానల్ నంబర్:

ఛానల్ నంబర్:

డిష్ టివి కస్టమర్లు ఛానల్ నంబర్ 710 లో తెలుగు యాక్టివ్ సర్వీస్ ను చూడవచ్చు. డిటిహెచ్ ఆపరేటర్ నామమాత్రపు చందా ధర అన్ని రకాల పన్నుల టాక్సెస్ కలిపి నెలకు 40 రూపాయలుగా ఉంచారు. ఉచిత ప్రివ్యూ ఆఫర్ కూడా ఉంది (ఆగస్టు 20 వరకు) అందువల్ల ఛార్జీలు పోస్ట్ ఫ్రీ ప్రివ్యూ కాలానికి వర్తిస్తాయి. తెలుగు యాక్టివ్ సర్వీస్ కు సభ్యత్వాన్ని పొందడానికి వినియోగదారులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 1800-315-0710 కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
dish Tv India Launches Telugu Active Service on Dishtv and d2h Platforms

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X