డిష్ టివి దీపావళి ఆఫర్: RS.219లకే 250 ఛానెల్‌లు
డిటిహెచ్ ఆపరేటర్లలో ఎక్కువ మంది వినియోగదారుల ఎంచుకొనే వాటిలో డిష్ టివి ఒకటి. కొన్ని రోజుల క్రితం వరకు డిష్ టివి చందాదారుల సంఖ్య విషయంలో దేశంలోనే ఎక్కువ మందిని కలిగి ఉంది. కాకపోతే కొద్ది రోజుల క్రితం టాటా స్కై దీనిని అధిగమించింది. అయితే డిటిహెచ్ పరిశ్రమలో డిష్ టివి తన సత్తాను కోల్పోయింది అని దీని అర్థం కాదు.

డిటిహెచ్ ఆపరేటర్లు తమ డిటిహెచ్ కనెక్షన్లను పూర్తిగా విడిచిపెట్టలేదు. వీటి యొక్క కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. డిష్ టీవీ ఈ సమస్యలను వినియోగదారులు ఎదురుకోక ముందే దీనికి ప్రతాన్మయ ప్రయత్నాలు చేస్తోంది. దీని ద్వారా డిష్ టీవీ తన కస్టమర్లను మెరుగైన మార్గంలో నిలుపుకోగలదు. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి డిటిహెచ్ సంస్థ ఇటీవల హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాని ప్రసిద్ధ ఆఫర్ యొక్క కొత్త పరిచయంలో డిష్ టివి కస్టమర్ల దృష్టిని ఆకర్షించే ఫెస్టివల్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిష్ టివి ఫెస్టివల్ ఆఫర్
దీపావళి పండుగ ఆఫర్‌లో భాగంగా డిష్ టీవీ ముందు అందిస్తున్న పాత ధరలకు కొన్ని ఛానల్ ప్యాక్‌లను అందిస్తోంది. పాత ధరల ప్రకారం డిష్ టివి కొత్త ట్రాయ్ టారిఫ్ పాలన రాకముందు ఉన్న ధరలను సూచిస్తుంది. ఇప్పుడు మీరు ఉహించినట్లుగా కొత్త ట్రాయ్ పాలనకు మారిన తరువాత నెలవారీ డిటిహెచ్ కనెక్షన్ల ధరలు చాలా మంది వినియోగదారులకు చాలా తేడాతో పెరిగాయి. ఇది వినియోగదారులు ఇష్టపడే సమర్పణ. అయితే ఇది ఆకర్షణీయమైన ఒప్పందం కావడంతో ఈ ఆఫర్‌కు ఖచ్చితంగా ప్రత్యక ప్రయోజనాలు ఉంటాయి.

ఈ ధరలను ఆస్వాదించడానికి చందాదారులు రెండేళ్ల సబ్స్క్రిప్షన్ వ్యవధిని ఎంచుకోవాలి. అంటే దీని అర్థం ఏమిటంటే డిష్ టివి చందాదారులు తక్కువ నెలవారీ అద్దెను పొందుతున్నప్పటికీ అది ఇంకా ఎక్కువ కాలం పాటు వాటిని అందించగలదు. డిష్ టివి దాని చందాదారుల సంఖ్యను నిలుపుకోవడంలో ఈ వ్యూహం బాగా ఉపయోగపడుతున్నది.

ఛానల్ ప్యాక్‌ల వివరాలు
ఈ పండుగ ఆఫర్‌లో భాగంగా డిష్ టివి కొన్ని ఛానల్ ప్యాక్‌లను ప్రకటించింది. వాటిలో మొదటిది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ SD ప్లాన్. దీని ధర 24 నెలల కోసం రూ.5,256 గా ఉంటుంది. అంటే ఒక నెలకు దీని ధర రూ.219లు. అదేవిధంగా డిష్ టివి అందిస్తున్న ఇతర ఛానల్స్ ప్యాక్‌ల ధరల వివరాలు 24 నెలలకు వరుసగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హెచ్‌డి ధర 71,76 రూపాయలు (రూ.299 నెలవారీ ధర), ఫ్యామిలీ ఇంగ్లీష్ SD ప్యాక్ రూ .7,800 రూపాయలు (నెలవారి ధర 325 రూపాయలు), ఫ్యామిలీ ఇంగ్లీష్ HD ప్యాక్ రూ.10,776 (రూ.449 నెలవారీ అద్దెతో), ఫ్యామిలీ క్రికెట్ ప్యాక్ ఎస్‌డి ప్యాక్ ధర రూ.6,600 కు (నెలవారీ అద్దె 275 రూపాయలతో), ఫ్యామిలీ క్రికెట్ హెచ్‌డి ప్యాక్ రూ.8,376 రూ. 349 నెలవారి అద్దెతో లభిస్తున్నాయి. ఈ ఛానల్ ప్యాక్‌లన్నీ 250 కన్నా ఎక్కువ ఛానెల్‌లను అందిస్తున్నాయి. రెండేళ్ల ధరల కోసం ఈ ఛానెల్ ప్యాక్‌ల ధరలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

HD సెట్-టాప్-బాక్స్
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మరియు జియో 4K సెట్-టాప్ బాక్స్‌కు పోటీగా డిష్ టివి ఇప్పుడు తన ఆండ్రాయిడ్ HD సెట్-టాప్ బాక్స్‌ను కూడా ప్రారంభించింది. ఈ కొత్త హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్ గత కొన్ని నెలల నుండి డిష్ టీవీ ఎదుర్కొంటున్న మరియు క్షీణిస్తున్న చందాదారుల స్థావరాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. కొత్త హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్ ప్రస్తుతం వున్న కస్టమర్లకు రూ.2,499 లకు లభిస్తుంది. అలాగే కొత్త కస్టమర్లకు ఈ సెట్-టాప్ బాక్స్ రూ.3,999 ధరకు లభిస్తుంది. DTH పరిశ్రమలో చాలా మంది చందాదారులు OTT సర్వీస్ లకు వలస వెళ్ళడం జరుగుతున్నది. అవి చాలా తక్కువ ఖర్చు అవుతున్నాయి కావున DTH ఆపరేటర్లు OTT సర్వీస్ లను తమ చందాదారులకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications








