జియో 4K STBకు పోటీగా డిష్ టీవీ కొత్త SMRT కిట్‌,ఆండ్రాయిడ్ టివి STB

|

ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ డిష్ టివి ఇండియాలో రెండు స్మార్ట్ కనెక్ట్ డివైస్ లను విడుదల చేసింది. మొదటిది డిష్ SMRT హబ్ ఇది ఆండ్రాయిడ్ 9పై ఆధారంగా పని చేసే సెట్-టాప్-బాక్స్. రెండవది డిష్ SMRT కిట్ ఇది అమెజాన్ అలెక్సాతో కూడిన డాంగిల్. ఈ పరికరాలతో డిష్ టీవీ యొక్క టీవీ కంటెంట్ మరియు వీడియో స్ట్రీమింగ్‌ను యాక్సిస్ ఉన్న వినియోగదారులకు నిరంతరాయంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

డిష్ SMRT హబ్

డిష్ టివి ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మరియు రిలయన్స్ జియో యొక్క 4K సెట్-టాప్ బాక్స్‌ను అధిగమించడానికి డిష్ SMRT హబ్ అనే ఆండ్రాయిడ్ టివి ఆధారిత సెట్-టాప్ బాక్స్‌ను ప్రవేశపెట్టింది. డిష్ SMRT హబ్‌తో పాటు ప్రముఖ DTH ఆపరేటర్ కూడా వాయిస్ అసిస్టెంట్ అలెక్సాతో నిర్మించిన రిమోట్‌తో డిష్ SMRT కిట్‌ను ప్రకటించారు. డిష్ టీవీ యొక్క తాజా ఆండ్రాయిడ్ టీవీ STB ఇప్పటికే ఉన్న వారికి రూ.2,499 ధరకు మరియు కొత్త కస్టమర్లకు రూ.3,999 లకు లభిస్తుంది.

డిష్ SMRT కిట్‌

డిష్ SMRT కిట్‌ను 1,199 రూపాయల ధరలకు విడిగా పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న డిష్ టివి సెట్-టాప్ బాక్స్‌ల పైన దీనిని ఉపయోగించవచ్చని కంపెనీ ధృవీకరించింది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మాదిరిగానే డిష్ SMRT హబ్ శాటిలైట్ టీవీ మరియు OTT యాప్ కంటెంట్‌ను కలిసి తెస్తుంది. ఇందులో చాలా రకాల యాప్ లతో కూడి ఉంటుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా రన్ అవుతుంది.

డిష్ స్మార్ట్ హబ్ ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్: ఫీచర్స్

డిష్ స్మార్ట్ హబ్ ఆండ్రాయిడ్ టీవీ సెట్-టాప్ బాక్స్: ఫీచర్స్

డిటిహెచ్ రంగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని డిష్ టివి చివరకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మరియు జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకునే ప్రతి వినియోగదారునికి అందిస్తున్న జియో 4 k సెట్-టాప్ బాక్స్‌ను అధిగమించడానికి ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చింది. డిష్ SMRT హబ్ అనేది డిష్ టీవీ నుండి వచ్చిన ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత సెట్-టాప్ బాక్స్. ఇది గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ వంటి గూగుల్ యాప్ లతో ముందే లోడ్ అయి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, VOOT, ZEE5, ALT బాలాజీ వంటి అన్ని ప్రముఖ OTT యాప్ లకు డిష్ SMRT హబ్ మద్దతు ఇస్తుంది. అయినప్పటికీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌ను అందించడం లేదు. అయితే వినియోగదారులు అదే ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్ అయినందున యాప్ ను సైడ్‌లోడ్ చేయవచ్చు.

డిష్ SMRT హబ్

డిష్ SMRT హబ్ Chromecast మద్దతును కలిగి ఉంటుంది. శీఘ్ర వాయిస్ సెర్చ్ కోసం రిమోట్ ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కలిగి ఉంది. ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మాదిరిగానే డిష్ టివి యొక్క సరికొత్త ఎస్‌టిబి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. డిష్ టివి యూజర్లు నేరుగా ప్లే స్టోర్ నుండి యాప్ లను ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతిస్తుంది..

శాటిలైట్ టీవీ

డిష్ SMRT హబ్ యొక్క మొదటి హైలైట్ విషయం ఏమిటంటే ఇది శాటిలైట్ టీవీ మరియు OTT యాప్ ల మధ్య మారడం. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మరియు జియో 4K సెట్-టాప్ బాక్స్ కూడా ఈ ఫీచర్స్ లను అందిస్తున్నాయి. ఇది చాలా మంది వినియోగదారులు ఇష్టపడే విషయం.

 

వివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లువివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లు

అలెక్సా ఆధారిత రిమోట్‌తో డిష్ SMRT కిట్

అలెక్సా ఆధారిత రిమోట్‌తో డిష్ SMRT కిట్

డిష్ SMRT హబ్ ఆండ్రాయిడ్ టివి STBతో పాటు డిటిహెచ్ ఆపరేటర్ అలెక్సాతో పనిచేసే రిమోట్ కంట్రోల్‌తో వచ్చే ‘డిష్ SMRT కిట్' అనే కొత్త రిమోట్‌ను కూడా ప్రవేశపెట్టారు. కంపెనీ గత సంవత్సరం ప్రారంభించిన అదే డిష్ SMRT స్టిక్ లాగా ఉంది. కాని కొత్తది డిష్ SMRT కిట్ రిమోట్తో వస్తుంది. డిష్ టీవీ ప్రకారం డిష్ SMRT కిట్ రియల్ టైమ్ టీవీ కంటెంట్ మరియు ఆన్‌లైన్‌లో లభించే OTT కంటెంట్ మధ్య అంతరాన్ని సజావుగా తగ్గించడానికి వినియోగదారులకు సహాయం చేస్తుంది.

DishSMRT స్టిక్

DishSMRT స్టిక్ మాదిరిగానే డిష్ SMRT కిట్ కూడా Wi-Fi డాంగిల్. ఇది యూజర్ యొక్క HD లేదా SD సెట్-టాప్ బాక్స్‌కు కనెక్ట్ చేయవచ్చు. డిష్ SMRT కిట్ యొక్క గొప్ప విషయం బ్లూటూత్ మరియు అలెక్సాతో ప్రారంభించబడిన రిమోట్ కంట్రోల్స్. ఇది అలెక్సా యొక్క అన్ని ఫీచర్స్ లకు యాక్సిస్ ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Dish TV Launches Android TV Set-Top Box and Dish SMRT Kit in India: Price,Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X